young farmer
-
వ్యవసాయం.. యువరైతు దూరం!
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో వ్యవసాయానికి యువరైతులు దూరమవుతున్నారు. వాతావరణ అనిశ్చిత పరిస్థితులు, తక్కువ దిగుబడులకు తోడు చిన్న భూ కమతాల సంఖ్య పెరగడంతో ఆ విస్తీర్ణంలో పండిన పంటకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోక ఈ రంగాన్నే వీడుతున్నారు. నగరీకరణకు అనుగుణంగా గ్రామాల్లోనూ జీవనోపాధి ఖర్చులు పెరగడంతో అంత మేర ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మరలుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్, గ్లోబల్ డెవలప్మెంట్ ఇంక్యుబేటర్, ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇండియా సంస్థలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థలు ‘స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్–2024’ పేరుతో ఇటీవల నివేదికను విడుదల చేశాయి.వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లతో యువ రైతులు ఈ రంగాన్ని వీడి పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొనేందుకు లేదా ఇతర రంగాలను ఎంచుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 60 శాతం మంది యువత సాగును వీడారని పేర్కొంది. చిన్న కమతాలు ఎక్కువే... : రాష్ట్రంలో సగటు భూకమతాల విస్తీర్ణం ఒక హెక్టార్ (2.47 ఎకరాలు) నుంచి 0.89 హెక్టార్ల (2.19 ఎకరాలు)కు తగ్గింది. కుటుంబాల విభజనతో భూముల పంపకంతోపాటు కొత్తగా సాగు, జీవనోపాధి కోసం సొంతంగా భూముల కొనుగోళ్లకు మొగ్గు చూపడం తదితర కారణాలతో చిన్న కమతాలు పెరిగాయి. 2.47 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని సన్నకారు, 2.48 నుంచి 4.94 ఎకరాలను చిన్నకారు, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాలను పాక్షిక మధ్యతరహా, 9.89 నుంచి 24.77 ఎకరాలుంటే మధ్యతరహా, 24.78 ఎకరాలకన్నా పైన ఉంటే పెద్ద భూకమతంగా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, భద్రాద్రి జిల్లాల్లో 1.5, 1.4, 1.3 హెక్టార్ల విస్తీర్ణం సగటున ఉంటే కరీంనగర్, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లాల్లో 0.75, 0.74, 0.60 హెక్టార్లుగా సగటు విస్తీర్ణం ఉంది. రాష్ట్రంలో చిన్న కమతాలతో సేద్యం ఎక్కువగా జరుగుతుందని ఇటీవల విడుదలైన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక పేర్కొంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడు గ్రామానికి చెందిన ఇతని పేరు గారె రాజు. అతనికి వారసత్వంగా ఎకరం భూమి ఉంది. ఇది పంట సాగుకు సరిపోకపోవడంతో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. ట్రాక్టర్ కూడా కొన్నాడు. 2020 నుంచి 2024 వరకు రూ. లక్షలు వెచ్చించి వ్యవసాయం చేసినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదు. దీంతో ఫొటోగ్రఫీని జీవనాధారంగా మార్చుకున్నాడు. వ్యవసాయంపై ప్రేమ ఉన్నా సాగు ఖర్చులకు తగ్గట్టు లాభాల్లేక సాగుకు దూరమైనట్లు చెప్పాడు. పెట్టుబడి ఖర్చుకు తగ్గ ఆదాయం రాక అవస్థలు » చిన్న భూకమతాలు, వాతావరణ అనిశ్చి తి, తక్కువ దిగుబడులూ కారణం » కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఉపాధి వైపు అడుగులు » స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్–2024 నివేదికలో వెల్లడి » యువతకు నైపుణ్యాల పెంపుతో ఆదాయం పెంచొచ్చంటున్న నిపుణులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలివ్యవసాయానికి దూరమవుతున్న యువతకు బ్రేక్ వేయాలంటే విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విస్తృతంగా నెలకొల్పాలి. మొక్కజొన్నల నుంచి పేలాల తయారీ, మామిడి నుంచి గుజ్జు తీయడం, మిరపకాయ నుంచి కారం... ఇలా వివిధ పరిశ్రమలను గ్రామాల్లో నెలకొల్పాలి. అలాగే యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలి. – ఉమారెడ్డి, ఏడీఆర్, వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంట్రైనింగ్ కోర్సులు అందించాలి యువ రైతులకు పంటల సాగు పద్ధతులపై సరి్టఫికెట్ ట్రైనింగ్ కోర్సులు అందించాల్సిన అవసరం ఉంది. యాంత్రీకరణతో కూడిన యాజమాన్య పద్ధతులు తీసుకురావాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్లను విస్తృతం చేయాలి. ఈ కేంద్రాల ద్వారా పనిముట్లను అద్దెకు ఇస్తే యువ రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలి. అప్పుడే యువ రైతులకు మేలు జరుగుతుంది. – కె. భాస్కర్, సంచాలకుడు, జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, మహబూబాబాద్ జిల్లా -
మామిడి మియాజాకిలో అత్యంత పోషక విలువలు
-
యువరైతు ప్లాన్ సక్సెస్.. పచ్చని తోటలో ఎర్ర బెండలు!
ఆలమూరు: వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పూలు, కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఓ అరెకరం పొలంలో మాత్రం వినూత్నంగా ఎర్రబెండలు సాగుచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన భీమాల రాఘవేంద్ర.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జిల్లాలో మరెక్కడా లేని ఎర్రబెండ సాగుకు శ్రీకారం చుట్టారు. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే శీతాకాలంలోనే దీనిని సాగుచేయాలన్న ఉద్యాన శాస్త్రవేత్తలు ఇచి్చన సలహాతో గత నవంబర్ చివరి వారంలో సాగు చేపట్టాడు. ముదురు ఆకుపచ్చ రంగు స్థానంలో ఎండు మిరప రంగును పోలి ఉన్న ఎర్ర బెండకాయలను ఆయన పండిస్తున్నాడు. విత్తనాలను వారణాశిలోని నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి ఆన్లైన్లో తెప్పించి.. అరెకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాడు. సాధారణ రకం బెండ 60 రోజుల్లో కోతకు వస్తుంది. కానీ ఎర్రబెండ మాత్రం 40 రోజుల్లోనే దిగుబడినిస్తోంది. అది కూడా సాధారణ పంట కంటే 20 శాతం అధికంగా. పచ్చ బెండ మాదిరిగా ఈ ఎర్ర బెండలో జిగురు లేదు. ఆకృతి కూడా ఆకర్షణీయంగా ఉండటంతో శాకాహారులు అమితంగా ఇష్టపడుతున్నారు. అయితే కూర వండాక ఎర్రబెండ ఆకుపచ్చ రంగుకు మారడం విశేషం. పుష్కలంగా పోషకాలు - విటమిన్ సీ, ఏ, బీతో పాటు ఫోలాసిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. - కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. - కంటి చూపును మెరుగుపరచి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. - ఎర్ర రక్తకణాల సంఖ్యను, రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. - ఎర్రబెండలో ఉండే ఫోలేట్ గర్భిణులకు ప్రయోజనకరంగా ఉంటుంది. - మధుమేహాన్ని అదుపులో ఉంచడం, బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ప్రత్యేకతను చాటుకోవాలనే.. సహజ పంటలకు భిన్నంగా నూతన వంగడాల్ని ఈ ప్రాంత ఉద్యాన రైతులకు పరిచయం చేసి, తద్వారా వ్యవసాయ రంగంలో ప్రత్యేకతను చాటుకోవాలనే ఉద్దేశంతోనే ఎర్రబెండ సాగు చేశాను. ఆశించిన దానికంటే దిగుబడి ఎక్కువగా వచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా లభిస్తోంది. ఉద్యాన శాఖ రాయితీలిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – బి.రాఘవేంద్ర, రైతు. -
నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..
తాంసి (ఆదిలాబాద్ జిల్లా): నెలకు రూ.లక్ష జీతం తీసుకుంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం మానేశాడు. తన భూమిలో విభిన్న పంటలను సాగుచేస్తూ నలుగురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన కోదే అన్వేశ్ ఎంటెక్ వరకు చదివాడు. 2016 నుంచి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. వెబ్ డెవలప్మెంట్లో భాగంగా 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. నెలకు రూ.లక్ష జీతం వస్తున్నా సంతృప్తి చెందలేదు. ఉద్యోగం వదులుకొని తనకు నచ్చిన వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. నాలుగేళ్లుగా తాంసి మండలం సావర్గాం గ్రామశివారులోని ఎనిమిదెకరాల సొంత భూమిలో వివిధ పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొదటగా నష్టాలు చవిచూసి.. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్వేశ్ మొదటి సంవత్సరం పత్తి, జొన్న సాగు చేశాడు. పత్తి, జొన్న సాగుతో కూలీల కొరత, కష్టం ఎక్కువగా ఉండడంతో నష్టాలను చవిచూశాడు. ఏ మాత్రం కుంగిపోకుండా ఇతర పంటలను సాగుచేసి లాభాలను పొందాలని నిర్ణయించుకున్నాడు. ఏ పంటలను సాగుచేస్తే మేలని వ్యవసాయశాఖ అధికారుల సూచనలు తీసుకున్నాడు. స్నేహితుల సలహాలు తీసుకొని పంటలను సాగుచేస్తున్నాడు. అధికారుల సూచనలు పాటించి.. 2019లో హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సలహాతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి నుంచి థైవాన్ జామ మొక్కలను తెప్పించాడు. రూ.2.50 లక్షల వరకు ఖర్చుచేసి నాలుగెకరాల్లో ఎకరాకు వెయ్యి చొప్పున నాటించాడు. మొక్కలను హైడెన్సిటీ విధానంతో ఆరు అడుగులకు ఒక్కటి చొ ప్పున ఉండేలా చూశాడు. రసాయన మందులు లే కుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేశాడు. దీంతో మొక్కలను నాటిన 18 నెలలకే కాత ప్రారంభమైంది. సేంద్రియంగా పెంచిన జామపండ్లను పంటచేను పక్కనే ఉన్న రోడ్డు పక్కన షెడ్డు వేసి రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. పెద్దఎత్తున దిగుబడి వచ్చినప్పుడు బయటి మార్కెట్‌కు కూడా తరలిస్తున్నాడు. జామ ద్వారా మొదటి సంవత్సరం రూ.రూ.2.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కాత ఎక్కువగా ఉండగా రూ.3 లక్షల వరకు వస్తుందని అన్వేశ్ చెబుతున్నాడు. షెడ్లు వేసి కోళ్లు పెంచుతూ.. జామతోటతో అంతరసాగు విధానంలో వివిధ పంటలు వేశాడు. దీనికి తోడు పంటచేనులో ప్రత్యేక షెడ్లు వేసి రెండేళ్లుగా నాటు, కడక్‌నాథ్, గిరిరాజా కోళ్లు, బాతులను పెంచుతున్నాడు. వాటిని విక్రయిస్తూ అదనపు లాభాలను గడిస్తున్నాడు. వచ్చే సంవత్సరం నుంచి బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టనున్నట్లు అన్వేశ్ తెలిపాడు. ఇప్పటినుంచే షెడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇక్కడే తృప్తిగా, ప్రశాంతంగా ఉన్నట్లు చెబుతున్నాడు. వ్యవసాయంలోనే సంతృప్తి నేను ఎంటెక్ పూర్తిచేశా ను. మూడేళ్లపాటు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యో గం చేశాను. జీతం సరిప డా వచ్చినా ఉద్యోగంపై ఆసక్తి లేక మానేశాను. మాకున్న భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న. నాన్న శ్రీనివాస్ సాయంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం ప్రారంభించాను. ప్రస్తుతం వి విధ పంటలతోపాటు జామ సాగు చేపట్టా ను. అలాగే వివిధ రకాల కోళ్ల పెంపకం చేప ట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్న. రోజూ పంటచేనులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాతోపాటు నిత్యం నలుగురు కూలీలకు పని కల్పించడం సంతృప్తినిస్తోంది. – కోదే అన్వేశ్, యువరైతు -
సీఎంఆర్ఎఫ్కు యువ రైతు విరాళం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం నీళ్లతో తన బీడు భూమిలో పంటలు పండించిన ఓ యువ రైతు ముఖ్యమంత్రి సహాయ నిధికి పదివేల రూపాయలను విరాళంగా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్‌రెడ్డి అనే యువ రైతు తన పంట ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏడాదిలో తాను పండించే రెండు పంటల నుంచే వచ్చే ఆదాయంలో ‘పంటకు పదివేల రూపాయల’లెక్కన ఆరునెలలకోసారి సీఎంఆర్ఎఫ్కు జమ చేయాలనే సంకల్పంతో శుక్రవారం ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రూ.10 వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరం. ఏదో సంస్థలో అరకొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. తమ స్వంత గ్రామాల్లోనే పచ్చని పంటపొలాల మధ్య ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకుని తమ కాళ్లమీద నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి తన సంపాదనలోంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్కు కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి. అతనికి నా అభినందనలు’అని ప్రశంసించారు. -
కాలం కలిసిరాక.. పంట సరిగ్గా పండక..
సాక్షి, హాలియా (నల్గొండ): అప్పుల బాధతో పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలంలోని వీర్లగడ్డతండాకు చెందిన దేపావత్ జబ్బర్‌నాయక్, లక్ష్మి దంపతుల మూడో సంతానం దేపావత్ లక్ష్మణ్(27) డిగ్రీ పూర్తిచేశాడు. జబ్బర్నాయక్కి పక్షవాతం వచ్చి కదల్లేని స్థితిలో ఉండటంతో లక్ష్మణ్ చదువు మానేసి తమకున్న ఎకరం పొలంతో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టబడి కోసం సుమారు రూ.5 లక్షలు వరకు అప్పులు చేశాడు. చదవండి: (గేమ్స్, చాటింగ్.. తల్లిదండ్రులు మందలించడంతో..) కాలం కలిసిరాక.. పంట సరిగ్గా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక లక్ష్మణ్ మంగళవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్ష్మణ్‌ను గమనించిన అతడి తల్లి లక్ష్మి ఇరుగు పొరుగు వారి సహాయంతో నల్లగొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. చదవండి: (మొదటి భర్తతో సాన్నిహిత్యం.. తనకు పుట్టలేదనే అనుమానంతో..) -
యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక
సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిపటార్ గ్రామానికి చెందిన యువ కౌలు రైతు రాథోడ్ రాజు (34) వర్షాలకు పంట చేతికి రాదేమోననే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజుకు సొంత వ్యవసాయ భూమి లేకపోవడంతో గ్రామంలో 13 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగానికి పైగా పంట దెబ్బతింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం: ఈటల రాజేందర్ చేనుకు గురువారం ఉదయం వెళ్లిన రాజు దెబ్బతిన్న పంటను చూసి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య జమున వెంటనే స్థానికుల సాయంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి పిల్లలు లేరు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..!
ఎకరం పొలమే ఉన్న రైతు పొలంలో ఎంత పంట పండిస్తే మాత్రం ఏమంత సంతోషం కలుగుతుంది? అని ఎవరైనా అనుకుంటూ ఉంటేæవారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లేనంటున్నారు యువ మహిళా రైతు రజిత! రసాయనాలు వాడకుండా, ఒకటికి పది–పదిహేను పంటలు పండిస్తే.. చిన్న కుటుంబం ఆనందంగా జీవించడానికి ఎకరం భూమి ఉన్నా చాలని రుజువు చేస్తున్నారామె. 8 ఏళ్లుగా ఆదర్శ సేద్యం చేస్తూ తోటి రైతులకు వెలుగు బాట చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు ఏడాది పొడవునా పలు పంటల విధానాన్ని అనుసరిస్తూ సేద్యాన్ని సంతోషదాయకంగా మార్చుకోవడమే కాకుండా ఇతర రైతులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకు చెందిన కె.రజిత(27). 19 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత పెళ్లవడంతో చదువు ఆగిపోయింది. ఆ దశలో డ్రాక్రా గ్రూపులో చేరిన రజిత విష రసాయనాల్లేని వ్యవసాయం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్)లో శిక్షణ పొంది తమ కున్న ఎకరం నల్లరేగడి భూమిలో విభిన్నంగా పంటలు పండించడం ప్రారంభించారు. 2012లో ఎన్‌పిఎం వ్యవసాయంలో విలేజ్ యాక్టివిస్టుగా చేరి.. తాను వ్యవసాయం చేసుకుంటూ తమ గ్రామంలో ఇతర రైతులకూ ఈ సేద్యాన్ని నేర్పించేందుకు కృషి చేశారు. తదనంతర కాలంలో పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమంలో క్లస్టర్ యాక్టివిస్టుగా బాధ్యతలు తీసుకొని ఐదుగురు సిబ్బంది తోడ్పాటుతో మూడు గ్రామాల్లో ప్రకృతి సేద్య విస్తరణకు కృషి చేస్తున్నారు. తమ ఎకరం పొలంలో ఆదర్శవంతంగా ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఎన్‌పిఎం సాగుతో ప్రారంభం మెట్ట ప్రాంతమైన నాగులుప్పలపాడు రబీ మండలం కావడంతో రైతులు ఎక్కువగా రసాయనిక వ్యవసాయంలో పుల్ల శనగను పండిస్తూ ఉంటారు. రజిత ఎన్‌పిఎం సేద్యం చేపట్టినప్పుడు పురుగుమందులు వాడకుండా వ్యవసాయం ఎట్లా అవుతుందని రైతులు ఎద్దేవా చేసేవారు. కానీ, క్రమంగా ఆమె మెళకువలను అలవరచుకొని ముందుకు సాగడంతో వారే ముక్కున వేలేసుకున్నారు. మూడేళ్లుగా కూరగాయ పంటలను సైతం అంతరపంటలుగా సాగు చేసుకుంటున్నారు రజిత. గత నాలుగైదేళ్లుగా పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ప్రధాన పంటతోపాటు అనేక అంతర పంటలు పండిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారామె. ఎన్ని రకాల పంటలు సాగు చేసినా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించటమే ప్రధాన ధ్యేయం. జీవామృతం, పంచగవ్య, కషాయాలను పంటలపై పిచికారీ చేస్తారు. ఎకరానికి 400 కిలోల ఘన జీవామృతం తయారు చేసుకొని పంటలకు సకల పోషకాలను అందిస్తున్నారు. మిత్ర పురుగులు వృద్ధి చెంది చీడపీడల బెడద నష్టదాయకంగా పరిణమించకుండా కాపాడుతున్నాయి. 10 రకాల అంతరపంటలు ప్రధాన పంట మిరపలో అంతర పంటలుగా 10 రకాలు సాగు చేసి మంచి ఫలితాలు సాధించింది. మిరప పంట ఆరు నెలల కాల వ్యవధిలో కాపు ముగుస్తుంది. ఈ లోగా మూడు నెలలు, రెండు నెలలు, నాలుగు నెలల కాల వ్యవధిలో ఉండే పంట రకాలను ఎంచుకొని సాగు చేపట్టింది. మిరప పంటకు చుట్టూ బెల్టుగా కంది పంటను సాగు చేసింది. కందితో పాటు ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర, మొక్కజొన్న, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటా, ఎర పంటలుగా బంతి, ఆముదం కూడా సాగు చేపట్టింది. ఏడాది పొడవునా పంటలు 2017 ఏప్రిల్ నుంచి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిలో నవధాన్యాలను ఎండాకాలంలోనే వెదజల్లి పచ్చి రొట్ట పంటలు సాగు చేసి కలియదున్ని.. తదనంతరం పంటలు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఏడాది పొడవునా పొలాన్ని ఖాళీగా ఎండబెట్టకుండా ఏదో ఒక పంట లేదా పచ్చిరొట్ట పంటలు సాగులో ఉంటాయి. దీంతో భూమి గుల్లబారి భూసారం మరింత పెరగడంతోపాటు.. మిర్చి ప్రధాన పంటగా సాగు చేస్తుండగా ఇతర రైతులతో పోల్చితే చీడపీడల బెడద తమ పొలంలో చాలా తక్కువగా ఉందని, దిగుబడుల పరిమాణం, నాణ్యత కూడా బాగా పెరిగాయని రజిత తెలిపారు. మిర్చితోపాటు కొందరు రైతులు ఉల్లిని అంతర పంటగా వేశారని, తాను మిర్చితోపాటు వేసిన ఉల్లిపాయ ఒక్కొక్కటి పావు కిలో తూగితే, రసాయనిక వ్యవసాయం చేసే ఇతరుల పొలాల్లో ఉల్లి మధ్యస్థంగా పెరిగిందన్నారు. సాగు వ్యయం సగమే ప్రకృతి వ్యవసాయంలో ఎకరం పొలంలో ఎండు మిర్చితోపాటు పలు అంతర పంటలు సాగు చేయడానికి రజిత ఇప్పటి వరకు అన్ని ఖర్చులూ కలిపి రూ. 62,550 ఖర్చు పెట్టారు. మిర్చి సాగు చేసే ఇతర రైతులకు కనీసం రూ. 1,10,000 అయ్యిందని రజిత తెలిపారు. మిర్చి తొలి కోతలో ఎకరానికి 4.5 క్వింటాళ్లకు పైగా ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. ధర క్వింటాకు రూ. 14,500 ఉండగా తమ పంటను రూ. 16,000కు అడిగారని, అయినా ధర పెరుగుతుందన్న భావనతో కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టానని రజిత వివరించారు. మొత్తంగా 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. అంతరపంటల అమ్మకం ద్వారా రూ. 35 వేలు ఆదాయం వచ్చిందన్నారు. ఖర్చులన్నీ పోను రూ. 2.30 లక్షలకు తగ్గకుండా నికరాదాయం వస్తుందని రజిత లెక్కగడుతున్నారు. ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుగా కుటుంబానికి రసాయనిక అవశేషాల్లేని ఆహారాన్ని అందించడంతోపాటు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తున్న రజిత.. మరో వైపు చదువును సైతం కొనసాగిస్తున్నారు. దూరవిద్య ద్వారా బీకాం చదువుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ సంతోషంగా ఉన్నారని రజిత సంతోషపడుతున్నారు. హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..! నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన కొత్తలో గ్రామంలోని చాలా మంది రైతులు హేళన చేసేవారు. చిన్న అమ్మాయి ఏమి తెలుసని అనేవారు. 2012 నుంచి పురుగుమందుల్లేని వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలోని మెళకువలను అధ్యయనం చేసి, నా ఎకరం పొలంలో ఆచరిస్తున్నాను. ఇవే నన్ను ఆత్మస్థయిర్యంతో ముందుకు నడిపించాయి. జీవామృతంతో పంటలు పండించే విధానాన్ని 2, 3 ఏళ్ల పాటు రైతులు మా పొలంలో చూసి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో తగ్గిన ఖర్చులు చూసి రసాయన ఎరువులు, పురుగుమందులతో పంటలు సాగు చేసే రైతులు నివ్వెరపోయారు. వాళ్ళు 2, 3 రెట్లు అధికంగా ఖర్చు పెడుతున్నారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణించిపోతున్నది. ప్రకృతి వ్యవసాయమే అన్ని విధాలా మంచిది. – కె.రజిత (76740 21990), యువ ప్రకృతి వ్యవసాయదారు, నాగులుప్పలపాడు, ప్రకాశం జిల్లా – ఎన్.మాధవరెడ్డి, సాక్షి ప్రతినిధి, ఒంగోలు ఫొటోలు: ఎమ్. ప్రసాద్, సీనియర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
రుణం పేరుతో నమ్మించి ముంచారు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకున్న ఓ యువ రైతుకు వ్యవసాయ రుణం పేరిట వైట్ కాలర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఓ ప్రైవేట్ బ్యాంకు(హెచ్డీఎఫ్సీ) నుంచి రుణం మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికి.. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, బీమా ఛార్జీలతోపాటు కమీషన్ల పేరుతో రూ.5 లక్షలు వసూలు చేశారు. అయితే చెప్పిన మేరకు రుణం ఇప్పించకపోగా.. కమీషన్ ఇస్తేనే పని జరుగుతుందంటూ చెప్పడంతో అనుమానించిన రైతు చివరకు డబ్బు, ఆస్తి పత్రాలు తిరిగిచ్చేయాలని అడగ్గా బెదిరింపులకు దిగారు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన ఎ.సురేష్ కుమార్ అనే యువ రైతు నందిగామ ప్రాంతంలో తనకున్న 40 ఎకరాల భూమితోపాటు కౌలుకు 80 ఎకరాలు భూములు తీసుకుని అత్యాధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అవసరమైన పెట్టుబడికోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకున్నాడు. వ్యవసాయ రుణంకోసం అతను ప్రయత్నిస్తుండగా బ్యాంక్ ప్రతినిధులమంటూ శ్రీనివాస చక్రవర్తి, వి.సుధాకర్, జి.విజయకుమార్, సత్యరెడ్డి, బి.సాయితేజ, రవి అనే వ్యక్తులు గతేడాది డిసెంబర్ 29న సంప్రదించారు. యువ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి తమ బ్యాంకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, స్పెషల్ లోన్ ప్రోగ్రాంలో భాగంగా అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామంటూ నమ్మబలికారు. దీంతో రూ.4 కోట్ల వ్యవసాయ రుణానికి సురేష్ దరఖాస్తు చేశాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఫార్మాలిటీ పేరుతో రూ.5 లక్షలు తీసుకున్న మోసగాళ్లు ఆస్తుల పరిశీలన, హామీదారుల నుంచి సంతకాలు తీసుకోవడం తదితర కార్యక్రమాలతో కొద్దిరోజులు హడావుడి చేశారు. మూడు నెలలు దాటాక.. మీకు కోటి రూపాయల లోన్ మాత్రమే మంజూరయ్యిందని, అంతకంటే ఎక్కువ మొత్తం కావాలంటే 5 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కోటి రూపాయలే కావాలనుకుంటే తెల్లకాగితంపై సంతకం చేయాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు దీంతో అనుమానించిన సురేష్ కుమార్ లోన్ అక్కర్లేదు.. డబ్బులు, ఆస్తి పత్రాలు తిరిగిచ్చేయండని కోరాడు. లోన్ వద్దంటే కట్టిన డబ్బులో ఒక్క రూపాయి తిరిగిరాదని, ఆస్తి పత్రాలు తిరిగివ్వాలంటే రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వారు బెదిరింపులకు దిగారు. దీంతో తన దరఖాస్తు గురించి తెలుసుకునేందుకు బందరురోడ్డులోని బ్యాంకుకు వెళ్లిన సురేష్ కుమార్‌కు అగ్రికల్చర్ లోన్ విభాగం వాళ్లెవ్వరూ ఇక్కడ లేరని బ్యాంకు సిబ్బంది చెప్పారు. మోసపోయానని గ్రహించిన సురేష్ కుమార్ తనకు న్యాయం చేయాలంటూ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రుణం ఎలా తీర్చాలో తెలియటం లేదు..
వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న యువ రైతు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నా అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండల కేంద్రానికి చెందిన ఉప్పర వీరేష్ ఆత్మహత్య చేసుకొని 11 నెలల క్రితం చనిపోయినా అతని కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. 2018 ఫిబ్రవరి 2న ఉప్పర వీరేష్ (35) అప్పుల బాధ తాళలేక పొలంలోనే పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పేరున 4.71 ఎకరాల భూమి ఉంది. సిండికేట్ బ్యాంకులో రూ.5 లక్షలు రుణం తీసుకొని పప్పుశనగ సాగు చేశాడు. పైరు ఎదుగుదల సమయంలో వర్షాలు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పు తీర్చాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తెచ్చారు. దిక్కు తెలియని పరిస్థితుల్లో ఆత్మస్థయిర్యం కోల్పోయి పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మృతుడికి భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావణి (3వ తరగతి), తేజశ్వణి(2వ తరగతి) వంశీకృష్ణ (నర్సరీ) ఉన్నారు. పిల్లలను పోషించుకోవడానికి విజయలక్ష్మి ఇక్కట్లు పడుతున్నారు. ‘రుణాలు తీర్చలేక, పిల్లలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. రాత్రి పూట పిల్లలు నాయన ఎప్పుడు వస్తాడని అడుగుతుంటే ఎమి చెప్పాలో, ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మాకు పెద్దగా ఆస్తులు లేవు. ఉన్నది తాకట్టు పెట్టినా లేదా విక్రయించినా రూ.5 లక్షల బ్యాంకు రుణం తీరేటట్లు లేదు. రుణాలను ఎలా తీర్చాలో తెలియడంలేదు. ఆర్డీఓ వచ్చి విచారణ చేసి వెళ్లారు, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. మా కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి..’ అని విజయలక్ష్మి గుడ్లనీరు కుక్కుకుంటున్నారు. – పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా -
ఆత్మహత్య చేసుకుంటానంటేనే స్పందిస్తారా?
సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: ఆత్మహత్య చేసుకుంటానంటేనే స్పందిస్తారా? అంటూ అధికారులపై యువ రైతు చింతకాయల రాజేంద్రకుమార్(రాజా) మండిపడ్డాడు. పాసు పుస్తకాల కోసం 11 నెలలుగా తిరిగినా పట్టించుకోలేదని, సర్వేయర్ వద్దకు వెళితే కాగితాలు విసిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 11 నెలలు తిరిగినా ఎందుకు పట్టించుకోలేదని అధికారులను నిలదీశాడు. ‘కలెక్టర్ ముందే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలతో గురజాల ఆర్డీవో మురళి, ల్యాండ్స్ సర్వే ఏడీ కెజియా కుమారితో పాటు అధికారుల బృందం శనివారం ఉదయం గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురానికి చేరుకుంది. న్యాయం చేస్తామంటూ ఆర్డీవో మురళి బాధితునితో ఫోన్లో మాట్లాడారు. ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆయన్ని రాజా నిలదీశాడు. ఆర్డీవో స్పందిస్తూ.. న్యాయం చేసేందుకే వచ్చామని, సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పినట్టు తెలిసింది. నాదో కన్నీటి గాథ: అధికారులు వస్తున్నారన్న సమాచారంతో.. రాజా పురుగు మందుల డబ్బాలు తీసుకుని పొలంలోకి వెళ్లి బైఠాయించాడు. అక్కడకు వెళ్లిన విలేకరులకు రాజా తన కన్నీటి గాథను వివరించాడు. తన తండ్రి వెంకటేశ్వర్లు సాగు కోసం అప్పులు చేసి.. వాటిని తీర్చలేక 2010లో ఆత్మహత్య చేసుకోవడంతో తాను చదువు మానేసి వ్యవసాయంలోకి దిగినట్టు తెలిపాడు. ఇద్దరం అన్నదమ్ములమని, తమకు ఎకరం పొలం ఉందని వివరించాడు. ఖరీఫ్‌లో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేయగా.. వర్షాలకు ఉరకేసి పంట చేతికి రాలేదని వాపోయాడు. రూ.11 లక్షల దాకా అప్పులయ్యాయని వివరించాడు. అప్పులిచ్చిన వారిని ఇబ్బంది పెట్టకూడదని, తన పొలానికి సంబంధించిన పాసు పుస్తకాల కోసం అధికారుల చుట్టూ 11 నెలలుగా తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. టీడీపీ వాడిననే పేరే కానీ, తనను నాయకులెవరూ పట్టించుకోలేదని వాపోయాడు. చివరకు వీడియో మెసేజ్ పెట్టినట్టు చెప్పాడు. విచారణకు ఆదేశించాం: వీడియో మెసేజ్ మా దృష్టికి వచ్చిన వెంటనే గురజాల ఆర్డీవో మురళి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. రెవెన్యూ అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే, సంబంధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్డీవో మురళి మాట్లాడుతూ.. గత ఏడాది మే నెలలోనే సర్వే చేశామని, భూ విస్తీర్ణంలో తేడా రావడంతోనే జాప్యం జరిగిందన్నారు. ఎకరం పొలంలో 0.07 సెంట్లు బాటలో పోవడంతో సమస్య తలెత్తిందని చెప్పారు. అర్ధరాత్రి వరకు రైతు ఇంటివద్ద వేచి వున్న అధికారులు.. రాజాకు పాసుపుస్తకం ఇవ్వడానికి అధికారులు శనివారం రాత్రి 12 గంటల వరకు లక్ష్మీపురంలోనే వేచి వున్నారు. పాసు పుస్తకం తీసుకోవాలంటూ గ్రామ సర్పంచ్ ద్వారా ఫోన్ చేయించినప్పటికీ రాజా ఇంటికి రాలేదు. అతను వస్తే కౌన్సెలింగ్ ఇచ్చి పాసు పుస్తకం ఇవ్వాలనే యోచనలో అధికారులు ఉండగా.. వెళితే తననేదైనా చేస్తారనే భయంతో బాధిత రైతు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి పాసుపుస్తకం ఇవ్వాల్సింది అతని తల్లికి అయినప్పటికీ.. రాజాకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఆత్మహత్య యత్నాన్ని మాన్పించాలనేది అధికారుల భావనగా ఉంది. అయితే ఎంతసేపు వేచి చూసినా రాజా రాకపోవడంతో.. చేసేది లేక చివరకు రాజా తల్లికి పాసుపుస్తకం ఇచ్చి అధికారులు వెనుతిరిగారు. -
కలెక్టర్ ముందే ఆత్మహత్య చేసుకుంటా
-
'టీడీపీ అభిమానిని.. 22న ఆత్మహత్య చేసుకుంటా'
సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు వెస్ట్: కడుపు మండి ఓ రైతు పెట్టిన వీడియో అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏం చేయాలో తోచక ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆ వీడియో సారాంశం అతని మాటల్లోనే.. ‘‘నాపేరు రాజా. నేను గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతును. నాకు వారసత్వంగా ఎకరా భూమి సంక్రమించింది. గతేడాది మరో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే తెగులు వచ్చి మొత్తం పోయింది. అయితే పంట కోసం నేను చేసిన అప్పు రూ. 8 లక్షలు ఇప్పటికి వడ్డీతో సహా రూ. 10 లక్షలయింది. నా ఎకరా భూమి అమ్మి అప్పు తీర్చేద్దామని గత ఏడాది మే 13న స్థానిక సర్వేయర్‌కు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికి పదిసార్లు నన్ను కార్యాలయం చుట్టూ తిప్పుకుని నానా ఇబ్బందులకు గురిచేశారు. అయినా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు." అంటూ వాపోయాడు. అయితే అధికారుల తీరుతో ఇక విసిగిపోయిన రైతు ఈ నెల 22న గుంటూరులో కలెక్టర్ గారి ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. ఇంకా రైతు మాట్లాడుతూ "నేను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిని. ఏం ప్రభుత్వం ఇది. రైతే రాజన్నారు. ఇదేనా చంద్రబాబు పాలన? రైతులు చచ్చిపోతున్నా మీకు పట్టదా? నేను చచ్చిపోయిన తర్వాత నాకు చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలిస్తారని తెలిసింది. దయచేసి ఆ మొత్తాన్ని నా కుటుంబానికి ఇవ్వండి. నాకున్న ఎకరా పొలంలో సగం అమ్మితే రూ. 5 లక్షలు వస్తుంది. మొత్తం రూ.10 లక్షలతో అప్పులు తీర్చేయవచ్చు. ఈనెల 22లోపు ఎవరికైనా కిడ్నీ కావాలంటే ఇవ్వడానికి సిద్ధం. వ్యవసాయం తప్ప ఏమీ తెలీని నాకు ఎలా అప్పులు తీర్చుకోవాలో తెలీక ఈ సాహసం చేస్తున్నాను. నాకు రెండున్నరేళ్ళ పాప, 10 నెలల బాబు ఉన్నారు. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. రైతులు ఎలా జీవిస్తున్నారో. పెద్దగా చదువులేని వారు కార్యాలయాల చుట్టూ ఎలా తిరుగుతారు. మీ ప్రభుత్వంలో అధికారుల పనితీరు ఎలా ఉందో చూడండి ముఖ్యమంత్రి గారు. నాలాగా మరెవ్వరూ బాధపడకూడదని కోరుతున్నాను’’ అని తెలిపాడు. ఈ వీడియో ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరింది. దీంతో గురజాల ఆర్డీవో మురళి దీనిపై విచారణ చేపట్టారు. -
‘పత్తి’ రైతు ఆత్మహత్య
పురుగుల మందు తాగి బలవన్మరణం అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులే కారణం ఐనవోలు(వర్ధన్నపేట) : పత్తి పంట కాటుకు ఓ యువ రైతు బలయ్యాడు. పెట్టుబడికి చేసిన అప్పులు తేర్చే మార్గం కనిపించక తనవాళ్లనొదిలి తనదారిన తాను వెళ్లిపోయాడు. భార్యాపిల్లల్ని కన్నీళ్లసంద్రంలోకి నెట్టివేశాడు. ఈ హృదయ విదారక ఘటన ముల్కలగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఐనవోలు ఎస్సై కె.అశోక్‌కుమార్ కథనం ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని ముల్కలగూడెం గ్రామానికి చెందిన యువ రైతు గుండెకారి మల్లాజి(33) ఆదివారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మల్లాజి భార్య పద్మకు సమాచారం అందించారు. ఆమె బంధువులు, గ్రామస్తుల సాయంతో వరంగల్ ఎంజీఎంకు తరలించే ప్రయత్నం చేస్తుండగానే అతడు మరణించాడు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌కుమార్ తెలి పారు. ఆర్థిక ఇబ్బందులే.. మల్లాజికి మూడెకరాల భూమి ఉంది. అందులో పత్తి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. కాలం కలిసి రాక, పంట సరిగా చేతికి రాక మూడేళ్లుగా వ్యవసాయంలో నష్టాలను చవిచూశాడు. తెలిసిన వాళ్ల దగ్గర ఐదు లక్షల రూపాయాలను అప్పుగా తీసుకున్నాడు. అప్పులు తేర్చేందుకు గత సంవత్సరం గ్రామంలో ఓ రైతు వద్ద పాలేరుగా పనికి చేశాడు. మళ్లీ ఈ ఏడాది వ్యవసాయంపై నమ్మకం ఉంచి ఎలాగైనా అప్పులు తీర్చాలన్న పట్టుదలతో తనకున్న మూడెకరాలతో పాటు పక్కనే ఉన్న మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. కానీ అధిక వర్షంతో పత్తి కాతా,పూత లేకుండా పోయింది. దాంతో పాటు తెగుళ్లు సోకాయి. తీవ్ర ఆందోళనకు గురైన మల్లాజి అప్పులు తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. మల్లాజి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కరెంట్ షాక్‌తో యువరైతు మృతి
కన్‌సాన్‌పల్లిలో విషాద ఛాయలు జోగిపేట(అందోలు): అందోలు మండలం కన్సాన్పల్లి గ్రామంలో కరెంట్ షాక్‌తో యువరైతు అశోక్ (32) మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మృతుడు తనకున్న పాత బోరులో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఇటీవల కొత్త బోరును వేయించుకున్నాడు. అందులో నీరు పడడంతో మోటార్‌కు పాత బోరు కనెక్షన్‌ను ఇచ్చేందుకు చేసే ప్రయత్నంలో కరెంట్‌షాక్‌కు గురైనట్లు ఎస్ఐ–2 లింబాద్రి తెలిపారు. స్తంభానికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను తొలగించకుండా మోటార్ కనెక్షన్‌ను తీసి వైరును ఒక్కచోటకు తెచ్చేందుకు చుట్టుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో సర్వీస్ వైరు తెగి ఉండడంతో అక్కడే కరెంట్‌షాక్ బలంగా కొట్టింది. దీంతో అశోక్ అక్కడే కుప్పకూలి పడిపోయినట్లుగా తెలిపారు. జోగిపేట ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు ధ్రువీకరించారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న అశోక్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అశోక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పంట ఎండిపోయిందని..యువరైతు ఆత్మహత్య
ముస్తాబాద్(కరీంనగర్ జిల్లా): మండలంలోని మద్దికుంటలో పంట ఎండిపోయిందనే మనస్తాపంతో పరుష స్వామి(26) అనే యువ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు రూ.6 లక్షల అప్పు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. నాలుగు ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
యువ రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులే కారణం కన్నీరుమున్నీరైన కుటుంబీకులు మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలంలో ఘటన మెదక్ రూరల్ (హవేళిఘణాపూర్) : ఆర్థిక ఇబ్బందులు తాళ లేక ఓ యువరైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం బోగడ భూపతిపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం తండాకు చెందిన లకావత్ రవి (30)కి ఎకరం పది గుంటల వ్యవసాయపొలం ఉంది. గతేడాది రెండు బోర్లు వేయగా.. అవి ఫెయిలయ్యాయయి. పంటసాగు కోసం, బోర్లు వేయడానికి సుమారు రూ.లక్షా 50 వేల వరకు అప్పులు అయ్యాయి. దీంతో బతుకుదెరువు కోసం ఉపాధిని వెత్తుకుంటూ ప్రతి సంవత్సరం చెరుకు నరికేందుకు భార్యాపిల్లలతో ఎక్కడ పనిదొరికితే అక్కడికి వెళ్లేవాడు. ఈసారి మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామానికి చెందిన దండి సాయిలుకు చెందిన తోటలో చెరుకును నరికేందుకు కుటుంబంతో వచ్చాడు. కొద్దిరోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువ అవడంతో తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సైతం గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన రవి రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం అదే గ్రామంలోని దొమ్మాట మల్లారెడ్డి వ్యవసాయ పొలంలోని టేకు చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో మతుడి భార్య ఛమ్మీ, ఎనిమిదేళ్లలోపు ఇద్దరు పిల్లలు సంఘటన స్థలంలో రోదించిన తీరు అక్కడి వారిని కంట తడిపెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
కారంపూడి: అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుజిల్లా కారంపూడి మండలం చినగార్లపాడుకు చెందిన చల్లా మధు(23) శుక్రవారం బయటకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. బంధువులు గాలించగా గ్రామానికి సమీపంలోని చింతపల్లి కాల్వ వద్ద శనివారం అతడి మృతదేహం లభ్యమైంది. పక్కనే పురుగుమందు డబ్బా, బీరు సీసా ఉన్నాయి. శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మధు నాలుగెకరాల్లో పత్తి, ఐదెకరాలలో కంది, రెండెకరాల్లో మిర్చి సాగు చేశాడు. వాగుకు వచ్చిన వరదలో కొంత పంట, భారీ వర్షాలకు మరికొంత పంట ఉరకేసి భారీ నష్టం వాటిల్లింది. ఎకరం మాత్రమే సొంత పొలం కాగా మిగతాది ముందుగా కౌలు చెల్లించి సాగు చేస్తున్నాడు. కౌలుకు, సాగుకు పెట్టుబడుల కోసం సుమారు రూ.4 లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనతో మధు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
ములుగు : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని భూపాల్‌నగర్ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాల్‌నగర్(పందికుంట)కు చెందిన నోముల రామచంద్రు(30) మంగళవారం తన చెలకలో సాగు చేసిన పసుపు పంటలో గుంటుక నడుపుతున్నాడు. పొలంలో తెగిపడిన విద్యుత్ తీగను గమనించని అతడు ఆ దిశగా వెళ్తుండగా విద్యుత్ తీగలు కానిపై పడ్డాయి. గుంటుక ఇనుముతో చేసినది కావడంతో విద్యుత్ సరఫరా జరిగి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పక్క పొలంలో కలుపు తీస్తున్న మృతుడి భార్య స్వరూప గమనించి కేకలు వేసింది. అందుబాటులో ఉన్న రైతులు రామచంద్రును కాపాడుదామని వెళ్లేసరికి విగతజీవిలా పడి ఉన్నాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ములుగు సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి కుమారులు సంజయ్(12), భరత్(8) ఉన్నారు. మృతుడి బంధువులు ములు గు సివిల్ ఆస్పత్రిలో చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మృ తుడి కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు ముసినేపల్లి కుమార్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొట్లపల్లిలో ప్రొక్లెయినర్ హెల్పర్.. మొగుళ్లపల్లి : విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెంది న సంఘటన మండలంలోని మొట్లపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామానికి చెందిన గట్టు రమేష్‌గౌడ్(32) ప్రొక్లెయినర్‌పై హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సాయి కన్స్టక్ర్షన్ ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి నుంచి సిరిసేడు వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులు నడుస్తుండగా ప్రొక్లెయినర్‌పై వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం 11 కేవీ వైర్లు ప్రొక్లెయినర్‌కు తగలడంతో రమేష్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రొక్లె్లయినర్ డ్రైవర్ స్థానిక పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. -
బావిలో పడి యువరైతు మృతి
కురవి (వరంగల్) : వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం నెరెడ పంచాయతి పరిధిలోని ఎల్కచెట్టు తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తండాకు చెందిన లాల్ సింగ్(23) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి.. కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువరైతు ఆత్మహత్య
ఎల్కతుర్తి (కరీంనగర్ జిల్లా) : ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో సోమవారం పెండ్యాల దేవేందర్(26) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
రామడుగు : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన మిట్ట అనిల్‌కుమార్(21) అనే యువరైతు శుక్రవారం ఉదయం విద్యుత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. అనిల్‌కుమార్ వ్యవసాయ బావి వద్ద విద్యుత్తు మోటారును అన్ చేయడానికి వెళ్లి స్టార్టర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. -
ఉసురు తీసిన నిర్లక్ష్యం
కరెంటు కాటుకు యువ రైతు బలి అధికారుల తీరును నిరసిస్తూ గ్రామస్తుల ఆందోళన రూ.4 లక్షలు పరిహారం ప్రకటించిన చేతులు దులుపుకున్న విద్యుత్ శాఖ వెల్దుర్తి: కరెంటు కాటుకు ఓ యువరైతు బలి అయ్యాడు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో అధికారులు రూ. 4 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా మృతుని తండ్రి,భార్యాపిల్లలు అనాథలయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కుకునూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బస్వాపురం గ్రామానికి చెందిన మాసబోయిన దిగంబర్ (25) రోజు మాదిరిగా పొలంలోకి వెళుతున్న సమయంలో మరో పొలంలో వేలాడుతున్న విద్యుత్తు వైర్లు ఛాతికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల ఉన్న రైతులు ఇది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తండ్రి మైసయ్య, భార్య చంద్రకళ, కూతురు వైష్ణవి, కుమారుడు జశ్వంత్, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వచ్చి గుండెలవిసేలా రోదించడం పలువురిని కంట తడిపెట్టించింది. దీంతో గ్రామస్తులు విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందంటూ ఆగ్రహిస్తూ వెల్దుర్తి–నర్సాపూర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యుత్తు వైర్లు వేలాడుతున్నాయని, మరో స్తంభం ఏర్పాటు చేయాలని రెండు నెలల నుంచి అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తూప్రాన్ ఏడీ వీరారెడ్డి సంఘటనా స్థలానికి రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అధికారుల తీరును నిలదీశారు. దీంతో ఏడీ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, తమ శాఖ తరఫున మృతుని కుటుంబానికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శివకుమార్ తెలిపారు. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష ్యమే కారణం.. సునీతారెడ్డి విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష ్యమే నిండు ప్రాణాన్ని బలిగొందని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆమె గ్రామానికి చేరుకుని మృతుని తండ్రి, భార్యా పిల్లలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కాకముందే వేలాడుతున్న వైర్లు, ఒరిగిన స్తంభాలను సరి చేస్తే బాగుండేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆమె మండిపడ్డారు. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచితంగా చదవు చెప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. -
యువరైతు ఆత్మహత్య
కుల్కచర్ల (రంగారెడ్డి) : గత ఆరేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న మామిడితోట నీళ్లు లేక ఎండిపోవడంతో.. మనస్తాపానికి గురైన యువ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోట ఎండిపోవడంతో పాటు నెల రోజుల క్రితం లక్ష రూపాయలు అప్పు చేసి కొన్న జెర్సీ ఆవు మృతి చెందడం, ఉన్న రెండు బోర్లు ఎండిపోవడంతో.. చేసిన అప్పులు తీర్చే దారి కానరాక పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కుల్కచర్ల మండలం పుట్టపహడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటయ్య(33) తనకు ఉన్న 3 ఎకరాల పొలంలో 6 సంవత్సరాల క్రితం రెండు ఎకరాల మామిడి తోట వేశాడు. తోట కోసం వేసిన రెండు బోర్లు ఎండిపోవడంతో పాటు తోట ఎండిపోతుండటం.. దీనికి తోడు జర్సీ ఆవు మృతిచెందడంతో చేసిన అప్పులు తీర్చే దారి కానరాక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇదే ఆఖరి కోరిక
ఇదే ఆఖరి కోరిక అమ్మ, భార్య, పిల్లలకు రాసిన సూసైడ్ నోట్లో రైతు విన్నపం అప్పుల బాధతోఆత్మహత్య చేసుకున్న యువ రైతు అనాథలుగా మారిన కుటుంబ సభ్యులు అమ్మ, భార్యా, పిల్లలు మణికంఠ (15 నెలలు), చరిత(4), దీక్షిత(7)కు... క్షమించండి. ఇదే నా ఆఖరి కోరిక. ఇంత చిన్న వయసులోనే మీ ఆలనాపాలనా చూసుకోకుండా వెళ్లిపోతున్నాను. సమాజంలో అందరిలాగే మిమ్మల్ని కూడా బాగా చదివించాలని ఉంది. కానీ విధి వక్రీకరించింది. అందుకే క్షమించమని కోరుతున్నా. చిన్న వయసులోనే మీరు ఈ కాలాన్ని ఎలా నెట్టుకువస్తారోనని నాకు భయంగా ఉంది. మీరంటే(పిల్లలు) నాకు చాలా ప్రేమ. నేను ఎక్కడ తిరిగినా సాయంత్రమయ్యే సరికి ఇంటికొచ్చాక మిమ్మల్ని(పిల్లలను)చూశాకే మనశ్శాంతిగా ఉండేది. ఉదయం లేవగానే ‘నాన్నా’ అంటే ఉప్పొంగిపోయేవాడ్ని. కానీ అలాంటి మిమ్మల్ని వదలివెళ్లడం చాలా బాధగా ఉంది. మీ కోసం బతకాలని ఉన్నా, పరిస్థితుల ప్రభావంతో బతకలేకపోతున్నా. మీరు ఎలా బతుకుతారో, ఎలా పెద్దవుతారోనని చాలా భయంగా ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు నిద్రిస్తున్న మిమ్మల్ని కడసారి చూసుకున్న నాకు గుంతకల్లు చేరే వరకూ కన్నీళ్లు ఆగలేదు. (ఆత్మహత్యకు ముందు గోపాల్ రాసిన సూసైడ్ నోట్ ఇది) - గుంతకల్లు రూరల్ గుంతకల్లు రూరల్ మండలం నల్లదాసరపల్లిలో నివాసముండే గోపాల్(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నారు. తండ్రి మరణంతో స్వగ్రామం వదిలి..విడపనకల్లు మండం పెంచలపాడుకు చెందిన రామాంజనమ్మ, మల్లేశ్ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గోపాల్. పదిహేనేళ్ల కిందట తండ్రి అనారోగ్యంతో మరణించగా, తల్లితో కలసి ఆమె పుట్టినిల్లైన గుంతకల్లు రూరల్ మండలం నల్లదాసరపల్లికి చేరుకున్నాడు. పసుపు కుంకుమ కింద తల్లి రామాంజనమ్మకు ఇచ్చిన నాలుగెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. పదేళ్ల కిందట భారతితో గోపాల్ వివాహం జరగ్గా, వారికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఒక కుమారుడు జన్మించారు. సూసైడ్ నోట్లో గోపాల్ ఇంకా ఏం రాశారంటే... భూమిని నమ్ముకొని నాలుగేళ్ల కిందట బోరు వేశారు. తొలి ఏడాది పంట బాగా వచ్చినా ఆ తరువాతి సంవత్సరం తిరగబడింది. బోరులో నీరు కూడా రాలేదు. ఆ తరువాత రూ.5 లక్షల వరకు అప్పు చేసి వరుసగా మరో ఎనిమిది బోర్లు వేసినా నీళ్లు పడలేదు. వర్షాలు లేవు. కనీసం పెట్టుబడి కూడా చేతికి దక్కలేదు. అలా మూడేళ్లపాటు గడచిపోయింది. పంటల సాగుకు చేసిన అప్పులు కడదామంటే పంట చేతికి అందేది కాదు. అప్పుల వారి వేధింపులు ఎక్కువయ్యాయి. అప్పటి వరకు కూడా నేను కూడా సమాజంలో గౌరవంగా బతుకుతున్నవాడ్నే. కానీ దేవుడు చిన్నచూపు చూశాడు. ఇది నా ఖర్మ. అప్పు ఇచ్చిన వారి తప్పులేదు. అప్పు తీసుకోవడం నా తప్పే. నా పిల్లల్ని ఆదుకోండి ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో గోపాల్ పలువురు నేతలనుద్దేశించి ఇలా రాశారు. ‘అన్నా.. నా పిల్లల కోసం ఏమీ చేయలేకపోయాను. దయచేసి నా పిల్లల భవిష్యత్తు కోసం సహాయ సహాకారాలు అందిస్తారని ఆశిస్తున్నా’నంటూ గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, వై.వెంకట్రామిరెడ్డి, పెంచలపాడు ఎంపీపీ ప్రతాప్, పెంచలపాడు మాజీ సర్పంచ్ దేవేంద్రప్ప, గుంతకల్లు ఎంపీపీ రామయ్యకు చివరి కోరిక కోరారు. -
చికిత్సపొందుతూ యువరైతు మృతి
టేకులపల్లి(ఖమ్మం జిల్లా): పంట ఎండిపోయిందనే మనస్తాపంతో ఈ నెల 24న పురుగుల మందు తాగిన యువరైతు జార వెంకటేశ్(25) చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు..టేకులపల్లి మండలం ముత్యాలంపాడు పంచాయతీ తూర్పుగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్ తనకున్న ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. వర్షాభావంతో ఆశించిన మేరకు పంట పండలేదు. దీంతో రూ.2 లక్షల వరకు అప్పులు మిగలడంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్ ఈ నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలిసి కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. -
పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య
అప్పుల భారం మరో యువ రైతును బలితీసుకుంది.ఈ ఘటన గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం రామిడి చర్లలో సోమవారం చోటు చేసుకుంది. రామిడి చర్లకు చెందిన మన్నేపల్లి (26) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతాళలేకే ఊరి చివరన ఉన్న పొలంలో మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువరైతు ఆత్మహత్య
మల్హర్(కరీంనగర్): మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో పైడాకుల శ్రీనివాస్(30) అనే యువరైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
యువరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సానికొమ్ము వెంకట్‌రెడ్డి(25) తనకున్న రెండెకరాలతో పాటు మరో ఎనిమిదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, వరి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది కూడా పంట దిగుబడి రాకపోవడంతో పాటు ఈ ఏడాది పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు రూ. 2.50 లక్షలు ఉండటంతో దానిని తీర్చలేనని గత కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ రోజు పంటకు మందు కొట్టడానికి వెళ్లిన వెంకట్‌రెడ్డి ఎండిన పంటను చూసి దిగుబడి రాదేమోననే భయంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువరైతు ఆత్మహత్య
నల్గొండ : నల్గొండ జిల్లా బుద్ధారం గ్రామంలో మంగళవారం ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి చేను ఎర్రబారి పిందెలు రాలిపోవడం చూసి అప్పులు తీర్చే మార్గం తోచక మనస్తాపం చెంది ఆవుల శేఖర్(23) అనే యువరైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తేలుకాటుతో యువకుడు మృతి
నల్లగొండ: వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో తేలు కుట్టిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉపేందర్ వ్యవసాయ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పనిచేసుకుంటున్న సమయంలో తేలు కుట్టడంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉపేందర్ గురువారం రాత్రి మృతిచెందాడు. -
యువరైతు బలవన్మరణం
దుర్గి (గుంటూరు) : పత్తి సాగులో నష్టం ఓ యువ రైతును బలి తీసుకుంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జడ శ్రీనివాస్(27) స్థానికంగా నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవటంతో పత్తి ఎర్రబారి, ఎదుగుదల లోపించింది. దీంతో దిగుబడి రాలేదు. రూ. లక్ష వరకు ఉన్న అప్పును తీర్చే దారి కానరాక సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల సమయంలో మృతి చెందాడు. అతనికి భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
యువరైతు ఆత్మహత్య
కాటారం (కరీంనగర్) : అప్పులబాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మలహర్రావు మండలం కొయ్యూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వంశీకృష్ణ(30) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా పంటలు సరిగా పండక అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వరి.. ఉరి తాడయ్యింది
- అప్పులు వెంటాడాయి.. - వెరసి.. యువరైతు బలవన్మరణం - జంగరాయి గ్రామంలో విషాదం చిన్నశంకరంపేట: ఎంతో ఆశతో సాగుకు ఉపక్రమించాడు.. వరినాట్లు వేశాడు.. అంతలోనే బోరులో నీళ్లు తగ్గాయి.. అప్పులు చేసి రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు.. అటు పంట సైతం ఎండుముఖం పడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.. అప్పులోళ్ల ఒత్తిళ్లు పెరగిపోవడంతో చేసేది లేక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు,చిన్నశంకరంపేట ఎస్ఐ నగేష్ కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35)కు మూడున్నర ఎకరాల పొలం ఉంది. రెండెకరాల్లో వరినాట్లు వేశాడు. కొద్దిరోజులుగా బోరులో నీటి మట్టం తగ్గడం.. పంటకు నీళ్లు సరిగా అందకపోవడంతో ఎండుదశకు వచ్చింది. అప్పులు చేసి వరుసగా రెండు బోర్లు తవ్వించాడు.. అయినా చుక్కనీరు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఇటు పంట చేతికొచ్చే మార్గం లేక, అటు అప్పులు తీరే దారి కానరాక మనస్తాపం చెందాడు. స్థానిక బ్యాంకులో రూ.లక్షతో పాటు ప్రైవేట్‌గా మరో రూ.2 లక్షల అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు తీర్చాలని ఒత్తిడి పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య ఇందిరతో పాటు ఇద్దరు కుమారులు రాము,నిఖిల్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్ఐ నగేష్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ ఏరియా అస్పత్రికి తరలించారు. -
యువరైతు ఆత్మహత్య
కంబదూరు (అనంతపురం) : అప్పులబాధతో ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్వేష్ (26) అనే యువరైతు రెండేళ్లుగా వేరుశనగ, టమాటా సాగు చేసి నష్టాలను ఎదుర్కొన్నాడు. రూ.2.80 లక్షలు అప్పు మిగలడంతో తీర్చే మార్గం లేక మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. -
యువరైతు బలవన్మరణం
మల్దకల్ (మహబూబ్‌నగర్) : పత్తి పైరుకు తెగులు సోకడంతో ఇక పంట చేతికి రాదని మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం మంగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పరశురాముడు(23) తన రెండెకరాల పొలంలో పత్తి వేశాడు. ఇందుకోసం రూ.లక్షకు పైగా అప్పు చేశాడు. అయితే ఇటీవల పత్తి మొక్కలకు ఎర్రతెగులు సోకటంతో దిగాలు పడ్డాడు. మొక్కలు ఎర్రబారి పంట చేతికి రాకుంటే చేసిన అప్పులు తీర్చేదెలాగని మదనపడ్డాడు. తీవ్ర ఆందోళనకు గురై బుధవారం రాత్రి పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. -
అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య
బుక్కపట్నం (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని సిద్ధరామపురం గ్రామానికి చెందిన చంద్రమోహన్(35) అనే రైతుకు వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులపాలయ్యాడు. అప్పులు తీరే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య
కనగానపల్లి (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కనగానపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కనగానపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్(29) అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పలు అధికమవడంతో తీర్చే దారి కానరాక వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచరం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
బల్మూరు (మహబూబ్‌నగర్) : విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బల్మూరు మండలం లక్ష్మిపల్లెలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. లక్ష్మిపల్లె గ్రామానికి చెందిన చుక్క బాలరాజు(25) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ట్రాన్స్ ఫార్మర్పై ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కూతురు ఉన్నారు. -
యువరైతు ఆత్మహత్య
ఉప్పునుంతల (మహబూబ్‌నగర్) : సకాలంలో వర్షాలు కురవక.. వేసిన పంట చేతికి రాదనే ఆవేదనతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం సదగోడు గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సదగోడు గ్రామానికి చెందిన గడ్డి శ్రీను(24) తనకున్న ఎకరం పొలంతోపాటు అదే గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా రూ. 4 లక్షలు అప్పులు తెచ్చి పత్తిపంట సాగు చేశాడు. అయితే వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడంతో మనస్తాపం చెందిన శ్రీను శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న శ్రీను శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య సంధ్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
యువరైతు బలవన్మరణం
రఘునాథపాలెం (ఖమ్మం) : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దోన బండ గ్రామానికి చెందిన యువ రైతు ఈర్ల కృష్ణ(28) అప్పుల బాధ భరించలేక బలవన్మరణం చెందాడు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో రూ.3 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగిన కృష్ణను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మృతుని కుంటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. -
ఎకరానికి 85 బస్తాల వేరుశనగ!
రూ.50 వేల నికరాదాయం పొందిన యువ రైతు ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) రూపొందించి విడుదల చేసిన వేరుశనగ వంగడం వేసవి పంటగా అధిక దిగుబడినివ్వడం విశేషం. ఈ వంగడం పేరు టీఎల్జి-45. కడప జిల్లా చెన్నూరు మండలం బాలసింగాయపల్లికి చెందిన రైతు వెంకటేశ్వర్‌రెడ్డి(92474 36849) ‘బార్క్’ శాస్త్రవేత్తల నుంచి ఈ వంగడాన్ని తీసుకొచ్చి కొన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారు. ఆయన వద్ద నుంచి కడప నగర పరిధిలోని చలమారెడ్డిపల్లెకు చెందిన యువరైతు శిరిగిరెడ్డి పురుషోత్తమరెడ్డి గత ఏడాది ఈ విత్తన కాయలు కొన్నారు. ఆ విత్తన కాయల్లో నుంచి మేలైన కాయలను ఏరి.. గత ఏడాది విత్తనోత్పత్తి చేశారు. ఆ విత్తనంతో ఈ ఏడాది మార్చిలో తన ఎకరం 30 సెంట్లలో సాగు చేశారు. ఎకరంలో ఇటీవల నూర్పిడి చేయగా.. 85 బస్తాల పచ్చి కాయల(బస్తా 40 కిలోలు) దిగుబడి వచ్చిందని పురుషోత్తమరెడ్డి తెలిపారు. మిగతా 30 సెంట్లలో పంటను విత్తనాల కోసం ఉంచానన్నారు. తమ ప్రాంతంలో 65-70 బస్తాల వరకు పచ్చి కాయల దిగుబడి వస్తుంటుందని, అయితే, మేలైన విత్తన కాయలు వాడటం, శ్రద్ధగా సాగు చేయడం వల్ల తనకు అధిక దిగుబడి వచ్చిందని పురుషోత్తమరెడ్డి తెలిపారు. వేరు పురుగు, అడవి పందుల బెడద లేకపోతే మరో 5-10 బస్తాల పచ్చి కాయలు అదనంగా దిగుబడి వచ్చేదన్నారు. మార్చి 28న విత్తనం వేశానని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తగా నీటి తడులు ఇస్తూ కంటికి రెప్పలా పంటను కాపాడి అధిక దిగుబడి సాధించానని పురుషోత్తమరెడ్డి (77948 85686) సంతోషంగా చెప్పారు. పుష్కలంగా పశువుల ఎరువు, ఆముదం పిండి, జీవన ఎరువులతోపాటు తగుమాత్రంగా రసాయనిక ఎరువులు వాడి, శ్రద్ధగా సస్యరక్షణ చర్యలు చేపట్టానని తెలిపారు. ఒకసాలు అదనంగా లోతు దుక్కి చేయడం కూడా కలసివచ్చిందన్నారు. ఈ రకం కాయలు, విత్తనాలు పెద్దగా ఉంటాయి. నూనె దిగుబడి శాతం ఇతర వంగడాల మాదిరిగానే ఉంటుంది. మూడు, నాలుగు విత్తనాల కాయలు కూడా అధికంగా ఉంటాయి. ఉడకబెట్టి తినడానికి, చెట్నీలకు ఈ వంగడం అనుకూలంగా ఉంటుంది. దీంతో పురుషోత్తమరెడ్డి వద్ద నుంచి వ్యాపారులు పచ్చి కాయల బస్తాను రూ.1,160 వరకు ధర చెల్లించి కొన్నారు. ఎకరానికి రూ. 47 వేల వరకు ఖర్చయ్యింది. ఖర్చులు పోను రూ. 50 వేలకు పైగా నికరాదాయం వచ్చింది. టీఎల్జి-45 వంగడం ఈ స్థాయిలో దిగుబడినివ్వడం స్థానిక వ్యవసాయాధికారులతో పాటు ‘బార్క్’ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచింది. వేసవి పంటగా సాగు చేసి ఇంత దిగుబడి తీయడం మరో విశేషం. - ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్ -
యువరైతు ఆత్మహత్య
బిచ్‌కొండ (నిజామాబాద్ జిల్లా) : అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా బిచ్‌కొండ మండలం శాంతాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శాంతాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య(27) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన 4 ఎకరాల పొలంలో సోయా, వరి పంటలను సాగు చేశాడు. అయితే పంటలు సరిగా పండక పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పు తీర్చే మార్గం కనబడక శుక్రవారం పొలం దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి సుమారు రూ. 3లక్షల వరకు అప్పున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య
రామాయంపేట (మెదక్) : అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాట్రియాల గ్రామానికి చెందిన కుమ్మరి శ్యాములు(30) తనకున్న ఎకరం పొలంలో చెరకుపంట వేయగా అది ఎండిపోయింది. దీనికితోడు అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాములుకు రోజురోజుకు అప్పులబాధ పెరిగిపోయింది. దీంతో చేసేదిలేక గురువారం సాయంత్రం తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి విషగుళికలు మింగాడు. ఇంటికి వచ్చిన అతడు కిందపడిపోగా, వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్యాములకు భార్య స్వరూప, మూడేళ్లలోపు ఇద్దరు ఆడపిల్లలున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువరైతు బలవన్మరణం
అనంతపురం (చెన్నే కొత్తపల్లి) : సాగు కోసం చేసిన అప్పులు తీరే మార్గం లేకపోవడంతో ఓ యువరైతు బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఎర్రజిన్నయ్యగారిపల్లికి చెందిన అరుణ్ కుమార్(22) అనే యువ రైతు ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. రూ. 7లక్షలు అప్పు చేసి పొలంలో బోర్లు వేయించాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడం, బోర్లలో నీళ్లు ఇంకిపోవడంతో అప్పలు తీరే మార్గం లేదని అరుణ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో వారం రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు అరుణ్ మృతదేహం పొలంలో కనిపించింది. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా కనిపించడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
రంగారెడ్డి(పూడూరు): అప్పుల బాధతో ఓ యువరైతు ఉరేసుకుని బలవన్మరణం చెందిన సంఘటన చన్గోముల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం పూడూరు మండల పరిధిలోని సోమన్గుర్తి గ్రామానికి చెందిన చిట్టంపల్లి రత్నాకర్‌రెడ్డి(30) గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పత్తి దిగుబడి రాక చేసిన అప్పుల అధికమై ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడని మృతుడి బందువులు తెలిపారు. మృతుని తండ్రి నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి
కర్నూలు: విద్యుత్ షాక్ తగిలి యువరైతు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడగూరు మండలం కలకుంట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాము(26) అనే రైతు పొలాన్ని చదును చేయడానికి ఈ రోజు ఉదయం ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. ఆ సమయంలో.. సోమవారం రాత్రి వీచిన భారీ గాలులకు పొలంలో వెదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో వాటిని తొలగించడానికి ప్రయత్నించిన రాము విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి యువ రైతు బలి
సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని భరత్‌నగర్ దిమ్మెల వద్ద జరిగింది. వివరాల ప్రకారం..ఇందిరానగర్ గ్రామానికి చెందిన రుద్రారం శంకర్(28) అనే వ్యక్తి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం పొలం దగ్గర మోటర్ వేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువ రైతు మృతి
గుమ్మగట్ట (అనంతపురం జిల్లా) : గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన యువ రైతు అనుమానాస్పద స్థితిలో ఊరి చెరువులో శవమై కనిపించాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మగట్టకు చెందిన తిప్పెస్వామి(22) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా వారం రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లాడు. అయితే తల్లిదండ్రులు మాత్రం పని నిమిత్తం వెళ్లి ఉంటాడని భావించారు. కాగా మంగళవారం గొర్రెల కాపరులు గ్రామ శివారులో ఉన్న చెరువులో శవాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో చెరువు దగ్గరకు చేరుకున్న గ్రామస్తులు మృతదేహాం తిప్పెస్వామిదిగా గుర్తించారు. చెరువు దగ్గరకు చేరుకున్న తిప్పెస్వామి తల్లిదండ్రులు.. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు బలవన్మరణం
బెజ్జంకి : ఆర్థిక ఇబ్బందులతో కరీంనగర్ జిల్లాలో ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెజ్జంకి మండలం పారువెల్ల గ్రామానికి చెందిన సాయిని అనిల్(25) అనే యువ రైతు ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి బాధ్యతలు కూడా ఇతడే చూస్తున్నాడు. వ్యవసాయంతోపాటు ధాన్యం వ్యాపారం కూడా నిర్వహిస్తుంటాడు అనిల్. అయితే ఇతడు సాగు, వ్యాపార అవసరాల కోసం రూ.7 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆదివారం అర్ధరాత్రి సమయంలో కాసంపేట వాటర్ సంప్ వద్దకు చేరుకుని పురుగుమందు తాగి పడిపోవడంతో స్థానికులు గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి అనిల్‌ను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.