అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య | Young Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య

Published Mon, Aug 31 2015 6:26 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Young Farmer commits suicide

బుక్కపట్నం (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని సిద్ధరామపురం గ్రామానికి చెందిన చంద్రమోహన్(35) అనే రైతుకు వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులపాలయ్యాడు. అప్పులు తీరే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement