అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సానికొమ్ము వెంకట్‌రెడ్డి(25) తనకున్న రెండెకరాలతో పాటు మరో ఎనిమిదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, వరి సాగు చేస్తున్నాడు.
ఈ క్రమంలో గత ఏడాది కూడా పంట దిగుబడి రాకపోవడంతో పాటు ఈ ఏడాది పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు రూ. 2.50 లక్షలు ఉండటంతో దానిని తీర్చలేనని గత కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ రోజు పంటకు మందు కొట్టడానికి వెళ్లిన వెంకట్‌రెడ్డి ఎండిన పంటను చూసి దిగుబడి రాదేమోననే భయంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అతనికి భార్య ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.