ఉప్పునుంతల (మహబూబ్‌నగర్) : సకాలంలో వర్షాలు కురవక.. వేసిన పంట చేతికి రాదనే ఆవేదనతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం సదగోడు గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సదగోడు గ్రామానికి చెందిన గడ్డి శ్రీను(24) తనకున్న ఎకరం పొలంతోపాటు అదే గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా రూ. 4 లక్షలు అప్పులు తెచ్చి పత్తిపంట సాగు చేశాడు. అయితే వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడంతో మనస్తాపం చెందిన శ్రీను శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న శ్రీను శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య సంధ్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
యువరైతు ఆత్మహత్య
Published Sat, Aug 22 2015 4:18 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement