విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Wed, Sep 21 2016 12:21 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
ములుగు : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని భూపాల్‌నగర్ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాల్‌నగర్(పందికుంట)కు చెందిన నోముల రామచంద్రు(30) మంగళవారం తన చెలకలో సాగు చేసిన పసుపు పంటలో గుంటుక నడుపుతున్నాడు. పొలంలో తెగిపడిన విద్యుత్ తీగను గమనించని అతడు ఆ దిశగా వెళ్తుండగా విద్యుత్ తీగలు కానిపై పడ్డాయి. గుంటుక ఇనుముతో చేసినది కావడంతో విద్యుత్ సరఫరా జరిగి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పక్క పొలంలో కలుపు తీస్తున్న మృతుడి భార్య స్వరూప గమనించి కేకలు వేసింది. అందుబాటులో ఉన్న రైతులు రామచంద్రును కాపాడుదామని వెళ్లేసరికి విగతజీవిలా పడి ఉన్నాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ములుగు సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి కుమారులు సంజయ్(12), భరత్(8) ఉన్నారు. మృతుడి బంధువులు ములు గు సివిల్ ఆస్పత్రిలో చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మృ తుడి కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు ముసినేపల్లి కుమార్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మొట్లపల్లిలో ప్రొక్లెయినర్ హెల్పర్..
మొగుళ్లపల్లి : విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెంది న సంఘటన మండలంలోని మొట్లపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామానికి చెందిన గట్టు రమేష్‌గౌడ్(32) ప్రొక్లెయినర్‌పై హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సాయి కన్‌స్టక్ర్షన్ ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి నుంచి సిరిసేడు వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులు నడుస్తుండగా ప్రొక్లెయినర్‌పై వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం 11 కేవీ వైర్లు ప్రొక్లెయినర్‌కు తగలడంతో రమేష్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రొక్లె్లయినర్ డ్రైవర్ స్థానిక పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిసింది.
Advertisement