
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
గోరంట్ల (సోమందేపల్లి) : ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గోరంట్ల మండలం మందలపల్లి పంచాయతీ బూచేపల్లికి చెందిన తలారి చంద్రశేఖర్ (26) స్థానికంగా పనులు లేకపోవడంతో ఉపాధి కోసం కర్ణాటకలోని మాలూరుకు వలస వెళ్లాడు. అక్కడ ఓ కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి అతను పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.