laborer
-
రాయే రాకాసై
తండ్రి పదేళ్ల కిందటే మృతి చెందాడు. ఇక తల్లి, ఇద్దరు అక్కచెల్లెల్ల భారం అతడిపై పడింది. కుటుంబపోషణను తనపై వేసుకుని ట్రాక్టర్ కూలీగా పగలూరాత్రి కష్టపడి తన ఇద్దరు సోదరిమణులకు వివాహం చేశాడు. తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ కాలం నెట్టుకొస్తున్న సమయంలో విధికి కన్నుకుట్టింది. రాయి రూపంలో అతడిని మృత్యువు కాటేసింది. తల్లికి ఆదారంగా ఉన్న కుమారుడిని అనంతలోకాలకు తీసుకెళ్లి ఆ మాతృమూర్తికి గర్భశోకాన్ని మిగిల్చింది. క్వారీలో బండరాయి తగిలి సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామానికి చెంది న ట్రాక్టర్ కూలీ మృతి చెందాడు. వివరాలు ఇలావున్నాయి. పొందూరు:మండలంలో రాపాక గ్రామానికి సమీపంలోని గారకొండలో సోమవారం ప్రమాదం జరిగింది. సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన అదపాక ఈశ్వరరావు(29) మృతి చెందాడు. క్వారీలో ఉన్న చిన్న రాళ్లను ట్రాక్టర్లోకి ఎత్తుతుండగా కొండ పైనుంచి పడిన రాయి ఇతని తలకు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయాలు పాలైన ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవరు బూరాడ పోలినాయుడు దూరంగా ఉండటంతో అతడికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మృతుడుకి తల్లి రమణమ్మ, అక్కచెల్లెల్లు చిత్తిరి బాలామణి, వసంత కుమారి ఉన్నారు. అక్కచెల్లెల్లుకు పెళ్లిల్లు జరగడంతో జి.సిగడాం మండలం అగ్రహారంలో ఉంటున్నారు. తల్లి వృద్ధురాలు కావడంతో ఆమె పోషణంతా ఈశ్వరరావు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇతడు మృతి చెందడంతో తల్లిని చూసే దిక్కులేకుండా పోయింది. ఈశ్వరరావు తండ్రి పదేళ్ల క్రిత మే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి సీఐ రామకృష్ణ, ఎస్ఐ బాలరాజు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిన్నంటిన బంధువుల రోదనలు మృతుడు ఈశ్వరరావు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ గ్రామంలో ఈశ్వరరావుకు మంచి గుర్తింపు ఉంది. ప్రజలు ఏ పని చెప్పినా చేసే మనస్తత్వంతో మెలిగేవాడని చెబుతున్నారు. ఈశ్వరరావు మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామంలోని అధిక సంఖ్యలో మహిళలు క్వారీకి చేరుకున్నారు. బ్లాస్టింగ్ సమయాల్లో రాళ్లను ఝలిపించకపోవడమే... బ్లాస్టింగ్లు సమయాల్లో కొండపై నుంచి రాళ్లు దూరంగా పడతాయి. కొన్ని అక్కడే పడిపోతాయి. మరికొన్ని రాళ్లు ఊడీఊడకుండా కొండకు అతుక్కొని ఉండిపోతాయి. అటువంటివి గుర్తించి కిందకు పడే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రాళ్ల పరికరాలతో ఝుళిపించాలి. అలా జరగకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని క్వారీ కార్మికులు పలువురు చెబుతున్నారు. సిరిపురంలో విషాదం సంతకవిటి: సిరిపురం గ్రామానికి చెందిన అదపాక ఈశ్వరరావు అనే ట్రాక్టర్ కూలీ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈశ్వరరావు మృతితో కుటుంబీకుల రోదన మిన్నంటింది. అయ్యో దేవుడా ఎంతపని చేశావంటూ మృతుడి తల్లి విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఆర్తనాదాలు మిన్నంటాయి. ఒంటరైన ఈశ్వరరావు తల్లి రమణమ్మను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
గోరంట్ల (సోమందేపల్లి) : ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గోరంట్ల మండలం మందలపల్లి పంచాయతీ బూచేపల్లికి చెందిన తలారి చంద్రశేఖర్ (26) స్థానికంగా పనులు లేకపోవడంతో ఉపాధి కోసం కర్ణాటకలోని మాలూరుకు వలస వెళ్లాడు. అక్కడ ఓ కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి అతను పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు 139కి ఫోన్ చేసి కూలీ, ట్యాక్సీలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ల నుంచి ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సేవలు నిర్ణీత రుసుముపై లభిస్తారుు. టికెట్లు రిజర్వు చేసుకునే సమయంలో పై సేవలు అందుబాటులో ఉన్న రైళ్లు, స్టేషన్ల వివరాలు కనబడుతాయని ఐఆర్సీటీసీ చైర్మన్ ఏకే మనోచ తెలిపారు. -
ఉపాధిలో నెం.1
♦ ఈజీఎస్ అమలులో జిల్లాకు ప్రథమస్థానం ♦ అత్యధిక కూలీలకు ఉపాధి కల్పించిన ఘనత ♦ కూలీ డబ్బుల చెల్లింపుల్లోనూ అగ్రస్థానం ♦ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసలు అడిగిన కూలీలందరికీ ఉపాధి పని.. పనిచేసిన కూలీలకు సకాలంలో చెల్లింపులు.. జాబ్‌కార్డులున్న వారిలో ఎక్కువ మందికి వందరోజుల పని కల్పించడం.. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్దేశించిన లక్ష్యంలో మెరుగైన పురోగతి.. నీటి గుంతల తవ్వకాల్లో లక్ష్యానికి నాలుగురెట్ల సాధన.. ఇన్ని రికార్డులతో గ్రామీణాభివృద్ధిలో పరుగులు పెడుతూ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పలు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేయడంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ.. జిల్లా నీటి యాజమాన్య సంస్థను ప్రశంసలతో ముంచెత్తింది. బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో డ్వామా పీడీ హరితతోపాటు సిబ్బందిని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అభినందించారు. లక్ష్యాలు అధిగమించి.. 2016-17 వార్షిక సంవత్సరంలో గత నెలాఖరు నాటికి జిల్లాలోని కూలీలకు 44.06 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అటు పట్టణ వాతావరణ, ఇటు గ్రామీణ ప్రాంతం తోడవడంతో లక్ష్యసాధన కొంత ఇబ్బందికరమైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఉపాధికి ప్రత్యేక చొరవ తీసుకుని ఏకంగా 45.85 లక్షల పనిదినాలు కల్పించారు. నిర్దేశించిన లక్ష్యంలో 104.08 శాతం పురోగతి సాధించి పని కల్పించడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఖమ్మం (91.88%), నిజామాబాద్ (88.54%) జిల్లాలున్నాయి. 1,644 కుటుంబాలకు వందరోజుల పని.. ఈజీఎస్ పథకంలో ప్రతి కుటుంబానికి వందరోజుల పని కల్పించాలి. కరువు నేపథ్యంలో పనిదినాలను 150కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజా వార్షిక సంవత్సరంలో ఇప్పటివరకు వంద రోజుల పనిదినాలు పొందిన కుటుంబాలు 1,644 ఉన్నాయి. రాష్ట్రంలో వందరోజుల పనిదినాలు పొందిన కుటుంబాలు జిల్లా నుంచే నమోదు కావడం గమనార్హం. ఫాంపండ్స్.. అదుర్స్ రైతుల పొలాల్లో నీటి కొలను (ఫాంపండ్స్) ఏర్పాటు ప్రక్రియను ఈజీఎస్‌లో పొందుపర్చారు. ఈ క్రమంలో 2016- 17 వార్షిక సంవత్సరంలో జిల్లాకు ఫాంపండ్స్ లక్ష్యాన్ని 1000గా ప్రభుత్వం నిర్ధారించింది. కానీ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ లక్ష్యాన్ని ఏకంగా 8,700 పెంచు తూ ప్రభుత్వ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు మూడు వేల ఫాంపండ్స్ నిర్మాణ పనులు మొదలు పెట్టగా.. ఇప్పటివరకు 550 ఫాంపండ్స్ పూర్తయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఫాంపండ్స్ నిర్మించింది జిల్లాలోనే. చెల్లింపుల్లోనూ జోరు.. ఉపాధి పథకం కింద పనిచే సిన ప్రతి కూలీకి మూడు రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. అయితే పలు జిల్లాల్లో పోస్టాఫీస్ సిబ్బంది ద్వారా డబ్బులు చెల్లిస్తుండగా.. జిల్లాలో మాత్రం కూలీలకు ప్రత్యేకం బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిల్లో ఆన్లైన్ పద్ధతిలో డబ్బులు జమచేస్తున్నాడు. కూలీ డబ్బుల చెల్లింపుల ప్రక్రియ ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డిజిల్లాలో వేగంగా జరుగుతుంది. ఈక్రమంలో కూలీ చెల్లింపుల విభాగంలోనూ జిల్లా ముందువరుసలో ఉంది. నెలాఖర్లోగా 56 గ్రామాల్లో... వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ జిల్లా దూసుకెళ్తోంది. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈక్రమంలో త్వరలో జిల్లాలో 56 గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించనుంది. ఈనెలాఖర్లోగా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ప్రాజెక్టు డెరైక్టర్ హరిత ‘సాక్షి’తో అన్నారు. మొత్తంగా నెలాఖర్లోగా బహిరంగ మల విసర్జన నిషేధిత కేటగిరీలో 56గ్రామాలను ప్రకటిస్తామని ఆమె అన్నారు. -
ఇంటి సజ్జ కూలి ఒకరి దుర్మరణం
మొగుళ్ళపల్లి : ఇంటిని కూల్చి వేస్తుండగా ప్రమాదవశాత్తు సజ్జ కూలి మీదపడి ఓ కూలీ మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఇటీవల మొగుళ్లపల్లి-పరకాల ప్రధాన రహదారికి ఆర్ ఆండ్ బీ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మార్కింగ్ చేశారు. దీంతో ఇంటి యజమానులు తమ ఇళ్లను కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో దాసరి శంకర్లింగం తన ఇంటిని కూల్చివేసేందుకు పిడిసిల్ల గ్రామానికి చెందిన కూలీలను పిలిచాడు. బుధవారం ఇంటి సజ్జపై నిలబడి కేతిరి తిరుపతి(40) అనే కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సజ్జ కూలడంతో అతడు కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే సజ్జను తొలగించేందుకు ప్రయత్నించగా సజ్జ లేవకపోవడంతో జేసీబీ సాయంతో తిరుపతిని బయటకు తీశారు. కాగా అతడు అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. కూలీ పనికి వచ్చి తిరుపతి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటారుు. తహసీల్దార్ రాజ్‌కుమార్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి కుటుంబ సభ్యులు తమకు ఇంటి యజమాని శంకర్లింగం నష్టపరిహారం చెల్లించాలని శవంతో బైఠాయించి కొద్దిసేపు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై రాజమౌళి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
కూలీల చేతుల నరికివేతపై సుప్రీం విచారణ
ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు నోటీసులు సాక్షి, న్యూఢిల్లీ: గత నెలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక లేబర్ కాంట్రాక్టర్ ఒడిశాకు చెందిన ఇద్దరు కూలీల కుడి చేతులను నరికివేసిన ఘటనపై సుప్రీం కోర్టు సోమవారం సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ దురాగతంపై పత్రికల్లో వచ్చిన కథనాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ అకృత్యంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఆ వార్తా కథనాల ప్రకారం.. ఘటన ఒడిశా కలహండి జిల్లాలో జరిగింది. ఇటుక బట్టీలో పని విషయమై గొడవకు దిగడంతో జిల్లాకు చెందిన నీలాంబర్, దయాలు అనే కూలీల చేతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆ కాంట్రాక్టర్, అతడి సహచరుడు నరికివేశారు.