కూలీల చేతుల నరికివేతపై సుప్రీం విచారణ | Labourers hands chopped: Supreme Court notice to Odisha, Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కూలీల చేతుల నరికివేతపై సుప్రీం విచారణ

Published Tue, Jan 28 2014 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Labourers hands chopped: Supreme Court notice to Odisha, Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు నోటీసులు
 సాక్షి, న్యూఢిల్లీ: గత నెలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక లేబర్ కాంట్రాక్టర్ ఒడిశాకు చెందిన ఇద్దరు కూలీల కుడి చేతులను నరికివేసిన ఘటనపై సుప్రీం కోర్టు సోమవారం సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ దురాగతంపై పత్రికల్లో వచ్చిన కథనాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ అకృత్యంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఆ వార్తా కథనాల ప్రకారం.. ఘటన ఒడిశా కలహండి జిల్లాలో జరిగింది. ఇటుక బట్టీలో పని విషయమై గొడవకు దిగడంతో  జిల్లాకు చెందిన నీలాంబర్, దయాలు అనే కూలీల చేతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆ కాంట్రాక్టర్, అతడి సహచరుడు నరికివేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement