రంగారెడ్డి(పూడూరు): అప్పుల బాధతో ఓ యువరైతు ఉరేసుకుని బలవన్మరణం చెందిన సంఘటన చన్గోముల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం పూడూరు మండల పరిధిలోని సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన చిట్టంపల్లి రత్నాకర్‌రెడ్డి(30) గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పత్తి దిగుబడి రాక చేసిన అప్పుల అధికమై ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడని మృతుడి బందువులు తెలిపారు.
మృతుని తండ్రి నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.