బల్మూరు (మహబూబ్‌నగర్) : విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బల్మూరు మండలం లక్ష్మిపల్లెలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. లక్ష్మిపల్లె గ్రామానికి చెందిన చుక్క బాలరాజు(25) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ట్రాన్స్ ఫార్మర్‌పై ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కూతురు ఉన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Sat, Aug 22 2015 4:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM
Advertisement
Advertisement