అప్పుల భారం మరో యువ రైతును బలితీసుకుంది.ఈ ఘటన గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం రామిడి చర్లలో సోమవారం చోటు చేసుకుంది. రామిడి చర్లకు చెందిన మన్నేపల్లి (26) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతాళలేకే ఊరి చివరన ఉన్న పొలంలో మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.