det funds
-
లాభాల్ని తెచ్చిపెట్టే ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు తెలుసా?
వడ్డీ రేట్లు దాదాపు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పదేళ్లకు మించిన లక్ష్యాల కోసం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. మన దగ్గర దీర్ఘకాలంతో కూడిన పెట్టుబడుల సాధనాలు పరిమితం. పీపీఎఫ్, ఎన్పీఎస్ పథకాలు ఉన్నా, వీటిల్లో లాకిన్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణకు వీలు కాదు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్‌లు) నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. వీటిపై రెగ్యులర్ ఆదాయం వస్తుంటుంది. వడ్డీపై వ్యక్తిగత పన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ గడువు కంటే ముందే వైదొలగాలని అనుకుంటే లిక్విడిటీ పెద్దగా ఉండదు. కానీ, లాంగ్ డ్యురేషన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కోరుకున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య ఫండ్ పదేళ్లకు మించిన లక్ష్యాలకు అనుకూలం. కోరుకున్నప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. పెట్టుబడుల విధానం.. నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య అనేది ఓపెన్ ఎండెడ్ డెట్ పథకం. కనుక ఎప్పుడైనా పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు. దీర్ఘకాలంతో కూడిన జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంది. సగటున 20–25 ఏళ్లకు మెచ్యూరిటీ తీరే (గడువు ముగిసే) సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. పైగా వ్యయాలు చాలా తక్కువ. డైరెక్ట్ ప్లాన్‌లో కేవలం 0.16 శాతమే ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టిన మొదటి మూడేళ్లలో కేవలం 20 శాతం యూనిట్లనే విక్రయించుకోగలరు. ఈ మొత్తంపై ఎగ్జిట్ లోడ్ పడదు. ఇంతకుమించిన మొత్తం ఉపసంహరించుకుంటే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత ఎలాంటి పరిమితులు, చార్జీలు లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం దీర్ఘకాల పెట్టుబడులకు ఉద్దేశించినది. కనుక స్వల్పకాలంలో పెట్టుబడుల ఉపసంహరణను నిరుత్సాహపరిచేందుకు ఈ నిబంధన విధించడం జరిగింది. దీర్ఘకాల జిసెక్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తక్కువ. పరిమితి విధించడానికి ఇది కూడా ఒక కారణం. కనుక కనీసం 8–10 ఏళ్లకు మించిన కాలానికే ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. సరైన సమయమే.. గతంలో వడ్డీ రేట్ల సైకిల్ 8–8.5 శాతం వద్ద గరిష్టానికి చేరి, 5–5.5 శాతం వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం ఈల్డ్స్ 7.4 శాతానికి చేరాయి. గరిష్టానికి ఒక శాతం తక్కువ. సాధారణంగా వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడే లాంగ్ డ్యురేషన్ ఫండ్స్/సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు అధిక రాబడులు పొందొచ్చు. ఏ సైకిల్లో అయినా గరిష్ట రేటును అంచనా వేయడం కష్టం. కనుక ఇక్కడి నుంచి ఈల్డ్స్ ఇంకా పెరుగుతాయా? అన్నది చెప్పలేం. కనుక ఇక్కడి నుంచి లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఆరంభించుకోవచ్చు. వడ్డీ రేట్ల క్షీణత ఆరంభమైన తర్వాత తాజా పెట్టుబడులు నిలిపివేసుకోవచ్చు. రాబడులు.. డెట్ పథకాల్లో మూడేళ్లు పూర్తయ్యే వరకు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. నివేష్ లక్ష్య తదితర లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో గడిచిన ఏడాది, మూడేళ్ల కాల రాబడులు అంత ఆకర్షణీయంగా అనిపించవు. ఎందుకంటే ఈ కాలంలో వడ్డీ రేట్లు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. వీటిల్లో రాబడులను సైకిల్ ఆధారంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరిగితే లాంగ్ డ్యురేషన్ పథకాల్లోని పెట్టుబడుల ఎన్ఏవీ సైతం తగ్గుతుంది. గడిచని ఏడాదిలో 5 శాతం, మూడేళ్లలో వార్షికంగా 6 శాతం రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. కానీ, ఎనిమిదేళ్లు అంతకుమించిన కాలానికి ఈ పథకాలు ద్రవ్యోల్బణంతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
ఈక్విటీల్లో పన్ను మినహాయింపు అధికంగా పొందాలంటే ?
క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటీ ? ఈక్వీటీల నుంచి ఎక్కువ లాభాలు పొందాలంటే ఏం చేయాలని ఇలాంటి అంశాలపై ఇన్వెస్టర్లు, స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉన్న వారు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు మార్కెట్ నిపుణులు , వాల్యు రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ వివరణ మీ కోసం.. నా వయసు 60 ఏళ్లు. ఈక్విటీల్లో నా పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నది నా ఆలోచన. ఈ పెట్టుబడులను బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలా? ఒకవేళ డెట్ ఫండ్స్‌కు మారేట్టు అయితే నా పెట్టుబడికి ఏదైనా రిస్క్ ఉంటుందా? రెండు నుంచి మూడు మంచి డెట్ పథకాలను సూచించగలరు? – రామకృష్ణ, భీమవరం మీ లాభాలను కాపాడుకోవాలనుకుంటే అందుకున్న ఏకైక మార్గం ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడమే. దాంతో మార్కెట్‌పై ఇక ఎంతమాత్రం ఆధారపడి ఉండరు. ఈక్విటీల్లో స్వల్పకాలంలోనే అధిక రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకానీ, దీర్ఘకాలంలో అంత రిస్క్ ఉండదు. మీరు 60 ఏళ్లకు వచ్చి, గణనీయమైన రాబడులను ఈక్విటీల్లో సంపాదించుకున్నారు కనుక.. భవిష్యత్తులో ఈక్విటీలు కరెక్షన్ను చూస్తే విచారించకూడదనుకుంటే ఇందులో అధిక భాగాన్ని డెట్ ఫండ్స్‌కు మళ్లించడం మంచి ఆలోచనే అవుతుంది. దీనిని ప్రణాళిక మేరకు చేసుకోవాలి. అంతేకానీ, ఈక్విటీలకు మొత్తంగా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం, వీటిల్లో ఏవి మెరుగన్నది చూస్తే.. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే, వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మీకు వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆ లాభాలను తీసుకునే వరకు పన్ను వర్తించదు. ఒకవేళ డెట్ ఫండ్స్‌లో లాభాలను స్వీకరించేట్టు అయితే.. అది కూడా ఇన్వెస్ట్ చేసి మూడేళ్లలోపు అయితే.. ఆ లాభాలను కూడా ఆదాయంగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తుంది. దానిపై మీ పన్ను శ్లాబు మేరకు పన్ను చెల్లించాలి. ఒకవేళ డెట్‌లో పెట్టుబడులు మూడేళ్లకుపైగా కొనసాగించిన తర్వాత లాభాలను స్వీకరిస్తే అందులో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసేసిన తర్వాత మిగిలిన లాభాలపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ ఫండ్స్‌లో రాబడులపై నికరంగా పన్ను భారం తక్కువ ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో ఎక్కువ పథకాలు సురక్షితమే. కానీ, రాబడులకు అవి ఎటువంటి హామీ ఇవ్వవు. వీటిల్లో రాబడులు వడ్డీ రేట్లకు అనుగుణంగానే ఉంటుంటాయి. డెట్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు ఇటీవలి పనితీరును చూడకుండా.. పెట్టుబడుల్లో నాణ్యతను చూడాలి. డెట్ ఫండ్స్‌లో స్వల్పకాలం కోసం యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్, ఐడీఎఫ్సీ బాండ్ షార్ట్ టర్మ్ ఫండ్, ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్లను పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగైన నికర రాబడులను ఆశించొచ్చు. క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్ మధ్య వ్యత్యాసం ఏంటి? సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఏది సురక్షితమైనది? – రిషికేష్, విశాఖపట్నం క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మధ్య అంతర్లీనంగా ఉండే వ్యత్యాసం వాటి పెట్టుబడుల్లో ఉండే క్రెడిట్ రిస్కే. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని అత్యధిక నాణ్యత కలిగిన బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, దీనికి విరుద్ధంగా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని తక్కువ నాణ్యత కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి పెట్టుబడుల్లో అధిక రిస్క్ తీసుకుని, అధిక రాబడులను ఇచ్చే విధానంతో పనిచేస్తుంటాయి. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న కంపెనీలు నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లలో ఈ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఆర్థిక వ్యవస్థలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయాల్లో ఇటువంటి కంపెనీలు అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ తరహా రిస్క్ ఉంటుంది కనుక ఆయా సంస్థలు జారీ చేసే బాండ్లపై అధిక వడ్డీ రేటును ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తుంటాయి. కనుకనే క్రెడిట్‌రిస్క్ ఫండ్స్ ఎక్కువ రాబడులు ఇచ్చేందుకు వీలుంటుంది. దాంతో అధిక రిస్క్ వీటిల్లో ఉంటుంది. ఇక మీరు అడిగిన సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కోసం అయితే ఈ రెండు కూడా తగినవి కావన్నది నా నమ్మకం. వీటికి బదులు లిక్విడ్ ఫండ్స్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి లిక్విడిటీ పరంగా, వడ్డీ రేట్ల అస్థితరల పరంగా కాస్త మెరుగైన ఎంపిక అవుతాయి. వాల్యు రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ -
ఫండ్స్ పెట్టుబడులను సమీక్షిస్తున్నారా..
దీర్ఘకాలంలో ఈక్విటీల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందన్న అవగాహన పెరుగుతోంది. ఫలితమే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గత కొన్నేళ్లలో పెరుగుతూ వస్తోంది. కాకపోతే మార్కెట్ పతనాల్లో సిప్ పెట్టుబడుల్లో కాస్త క్షీణత కనిపించడం సాధారణమే. తిరిగి మార్కెట్ల రికవరీతో పరిస్థితి మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీయండి, డెట్ ఫండ్స్ కానీయండి.. వాటిల్లో పెట్టుబడులు పెట్టేయడంతో పని పూర్తయినట్టు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో మన పెట్టుబడులను నిపుణులే నిర్వహిస్తుంటారు కనుక వాటి గురించి ప్రత్యేకంగా చూడాల్సినది ఏముంటుందని అనుకోవడం కూడా సరికాదు. తమ జీవిత లక్ష్యాలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు తప్పకుండా క్రమానుగతంగా వాటి పనితీరును సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్జనా శక్తి పెరగడం, జీవిత అవసరాలు అధికం కావడం.. దీనికితోడు కాస్త రిస్క్ తీసుకుంటే మంచి రాబడులను ఈక్విటీల్లో సొంతం చేసుకోవచ్చన్న అవగాహనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విస్తృతం చేస్తోంది. అయితే, ఎంతో మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నప్పటికీ.. తమ పెట్టుబడులను తరచుగా సమీక్షించుకోవాలన్న విషయం వారికి తెలియడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం అంటే మీ పెట్టుబడులపై ఓసారి లుక్కేయడం కాదు. ఓ పథకంలో పెట్టుబడులపై లాభం లేదా నష్టం వచ్చిందా? అన్న దానికే పరిమితం కానే కాదు. మీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం అంటే అందుకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. పెట్టుబడులపై రాబడులు వస్తే ఉత్సాహంతో పొంగిపోయినట్టే.. నష్టాలు కనిపిస్తే అసంతప్తికీ లోనవుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలే చూపిస్తుంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం దండగని భావించి అమ్మేయడం మాత్రం సరికాదు. అదే సమయంలో మార్కెట్లు పతనమయ్యాయా? అన్నది చూడాలి. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో అదే సమయంలో రాబడుల తీరు ఎలా ఉందీ పరిశీలించాలి. ఫండ్స్ స్కీమ్ విధానాల్లో మార్పులు జరిగాయా? అన్నది చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఎక్స్పెన్స్ రేషియో (ఫండ్స్ పెట్టుబడుల నిర్వహణకుగాను వసూలు చేసే చార్జీ), రిస్క్, స్కీమ్ సైజు, అస్సెట్ రేషియో, రిస్క్ అంశాలు మారిపోయాయా అన్న దానిపై దృష్టి సారించాలి. అంతేకాదు, ఇన్వెస్టర్ ఏ అంశాలను చూసి అయితే ఆ పథకాన్ని ఎంచుకున్నారో.. అనంతర కాలంలో ఆ అంశాల్లో మార్పులు వచ్చాయేమో పరిశీలించడం మర్చిపోవద్దు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మంచి రాబడుల తీరును (ఇతర పథకాలు, బెంచ్ మార్క్ కంటే మెరుగైన పనితీరు) చూపించే ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్కీమ్ ఉద్దేశాల్లో మార్పులు జరగకపోయి, ఇన్వెస్టర్ తాను ఏ అంశాలను అయితే మెచ్చి ఆ పథకాలను ఎంచుకున్నారో... అవేమీ మారనప్పుడు, కేవలం నష్టాలను చూపిస్తుంటే వాటి నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదన్నది నిపుణుల సూచన. కేవలం అద్భుత రాబడులనే చూసి పథకం ఎంచుకుంటే మాత్రం వాటిని ప్రత్యేకంగా సమీక్షించాల్సి ఉంటుంది. సమీక్ష ఏదైనా కానీయండి.. స్వల్ప కాలంలో రాబడుల తీరు నచ్చక ఆయా పథకాలను మార్చేస్తే పెట్టుబడులకు విజయం అందడం కష్టమేనని గుర్తించాలి. మరీ ముఖ్యంగా తమ జీవిత లక్ష్యాల్లో మార్పులు సంభవించినప్పుడు ఇన్వెస్టర్లు తప్పకుండా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం అవసరమని నిపుణుల సూచన. ఉదాహరణకు రిటైర్మెంట్ (60 ఏళ్లు వచ్చే నాటికి) కోసమని పెట్టుబడులు మొదలు పెట్టారనుకుంటే.. అనంతర కాలంలో 60 ఏళ్ల కంటే ముందుగానే రిటైర్ అవ్వాలని భావిస్తే అప్పుడు తప్పకుండా పోర్ట్ ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల్లో సమతుల్యం కూడా అవసరం. పోర్ట్ ఫోలియోను వార్షికంగా ఒకసారి సమీక్షించుకోవడం వల్ల పన్నుల పరంగా ప్రయోజనం కూడా ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు, వాటికి తగిన పెట్టుబడుల సాధనాల ఎంపిక అనేది ఎక్కువ మంది ఇన్వెస్టర్లలో కనిపించదన్నది వాస్తవం. కానీ, దీన్ని ఎక్కువ మంది అంగీకరించరు లేదా గుర్తించరు. అందుకే ఈ విషయంలో ఆర్థిక సలహాదారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని గుర్తించాలి. -
పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య
అప్పుల భారం మరో యువ రైతును బలితీసుకుంది.ఈ ఘటన గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం రామిడి చర్లలో సోమవారం చోటు చేసుకుంది. రామిడి చర్లకు చెందిన మన్నేపల్లి (26) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతాళలేకే ఊరి చివరన ఉన్న పొలంలో మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్లు ఇన్వెస్ట్ చేయవచ్చా?
నేను కొన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వీటిపై వచ్చిన రాబడులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన రాబడుల కన్నా స్వల్పమే ఎక్కువ. ఎక్స్పెన్స్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాబడులు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించుకున్న తర్వాతనే మనకు రాబడులను ఇస్తారా? ఈ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 5-10 ఏళ్లపాటు కొనసాగించవచ్చా? తగిన సమాధానాలు ఇవ్వగలరు. - సునయన, విజయవాడ ఫండ్ వ్యయాలను మినహాయించుకున్న తర్వాతనే మ్యూచువల్ ఫండ్ సంస్థలు నెట్ అసెట్ వేల్యూ(ఎన్ఏవీ)ను ప్రకటిస్తాయి. మీకు వచ్చే రాబడులు ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించుకున్న తర్వాత వచ్చినవే. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్‌కు రెండు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో స్థిరమైన రాబడి వస్తుంది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వడ్డీరేట్ల హెచ్చుతగ్గులను బట్టి రాబడులు ఉంటాయి. వడ్డీరేట్ల హెచ్చుతగ్గులు బాగా ఉంటే వీటి నుంచి మంచి రాబడులు వస్తాయి. ఇటీవల కాలంలో ఒక డెట్ ఫండ్ ఏడాదికి 17 శాతం రాబడిని ఇచ్చింది. డెట్ ఫండ్స్ నుంచి కనిష్టంగా 8.5 శాతం రాబడి పొందవచ్చు. ఇతర స్థిరాదాయ మార్గాలతో పోల్చితే డెట్ ఫండ్స్ మంచి రాబడులనిచ్చే అవకాశాలే ఎక్కువ. ఇక ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్ యూనిట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. కానీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోలేం. నిర్ణీత గడువు కన్నా ముందుగానే తీసుకుంటే, కొంత రుసుము చెల్లించాల్సి రావచ్చు. పన్ను పరంగా చూసుకున్నా డెట్ ఫండ్స్ ఉత్తమమైనవి. స్వల్పకాలంలో అధిక రాబడులు, లిక్విడిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా డెట్ ఫండ్సే ఉత్తమం. డెట్ ఫండ్స్‌లో స్వల్పకాలానికే ఇన్వెస్ట్ చేయాలి. డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం సరైన పని కాదు. ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 65% ఈక్విటీల్లోనూ, మిగిలిన దానిని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి నుంచి అధిక శాతం రాబడులు వస్తాయి. పైగా వీటిల్లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే ఎలాంటి పన్ను పోటు ఉండదు. నేను ఇప్పటివరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. కొత్త ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. వచ్చే జనవరి నుంచి ఏదైనా ఒక ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. విస్తృత అధ్యయనం అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్స్ ఎన్ఏవీ (నెట్ అసెట్ వేల్యూ) అధికంగా ఉంది. దేనిని ఎంచుకోవాలో తగిన సూచనలివ్వండి. - రుద్ర భూపతి, విజయనగరం మ్యూచువల్ ఫండ్స్‌లో అందునా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నందుకు మీకు అభినందనలు. మీరు షార్ట్‌లిస్ట్ చేసిన ఫండ్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ ఉత్తమమైనది. మిగిలిన రెండూ మంచి ఫండ్సే కానీ, మూడేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి, మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో అడుగిడుతున్న మీకు హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ అనువైనది. ఇక ఎన్ఏవీ అధికంగా ఉందని రాశారు. ఇది అసలు సమస్యే కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గతంలోని పనితీరు ఇప్పటి పనితీరు పోల్చడానికి ఎన్ఏవీ పనికి వస్తుంది. ఎన్ఏవీ తక్కువగా ఉంటే ఎక్కువ యూనిట్లు, ఎన్ఏవీ ఎక్కువగా ఉంటే యూనిట్లు తక్కువగా వస్తాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ విలువ ఒక్కలాగే ఉంటుంది. ఎన్ఏవీని బట్టి కాకుండా ఫండ్ పనితీరును బట్టి ఇన్వెస్ట్ చేయాలి. నేరుగా ఈక్విటీల్లో (షేర్లు) ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? - కమలాకర్, నిజామాబాద్ మ్యూచువల్ ఫండ్స్ వార్షిక వ్యయాలను మినహాయించుకొని రాబడులను అందిస్తాయి. ఈ వార్షిక వ్యయాలు 1-2% రేంజ్లో ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. నిపుణులైన ఫండ్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్లను నిర్వహించడమే దీనికి కారణం. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి విస్తృతమైన పరిజాఞనం అవసరం. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ ఏ రంగంలో ఉంది? ఎలాంటి ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది? వాటికి మార్కెట్లో స్పందన ఎలా ఉంది? ప్రమోటర్ల ట్రాక్ రికార్డ్.. ఇలాంటి పలు అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వీటన్నింటినీ చూడ్డానికి నిపుణులైన వ్యక్తులు ఉంటారు. మీకు తగిన సమయం, ఓపిక ఉంటే కంపెనీకి సంబంధించి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. -
డెట్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లలాంటివేనా?
డెట్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లలాంటివేనా? ఎఫ్ఐఐల నిధుల కారణంగా అవి ఒడిదుడుకులకు గురవుతాయా? డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? - జాన్సన్, సికింద్రాబాద్ ఒడిదుడుకులున్నప్పటికీ, ఓ మేరకు డెట్‌ఫండ్స్ సురక్షితమైనవేనని చెప్పవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే ఇవి కొంచెం భద్రమైనవే. అయితే నష్టభయం పూర్తిగా లేదని చెప్పడానికి లేదు. డెట్‌ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు - ఇవి రెండూ ఒకలాంటివేనని, డెట్‌ఫండ్స్‌లో పెట్టిన తమ పెట్టుబడులు క్షీణించే అవకాశాల్లేవని చాలా మంది ఇన్వెస్టర్లు పొరబడుతూ ఉంటారు. వడ్డీరేట్లు పెరిగితే డెట్ ఫండ్స్ విలువ తగ్గిపోతుంది. డెట్ ఫండ్స్‌లో నష్ట భయాన్ని తగ్గించుకునే మార్గాలున్నాయి. ఇన్వెస్ట్మెంట్ టైమ్‌ఫ్రేమ్‌ను కచ్చితంగా నిర్దేశించుకోవాలి. ఈ టైమ్‌ఫ్రేమ్ 3 నెలలు/6 నెలలు/2 సంవత్సరాలు.... ఇలా ఏదైనా నిర్దిష్టమైన కాలపరిమితిని నిర్దేశించుకోవాలి. దీనికి తగ్గట్టుగా సరైన ఫండ్‌ను ఎంచుకుంటే మరీ నిరాశచెందేస్థాయిలో రాబడులు ఉండవు. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు చేసే పొరపాటేమిటంటే స్వల్పకాలానికి అవసరమయ్యే పెట్టుబడులను దీర్ఘకాలిక డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి సహజంగానే స్వల్పకాలంలో ఒడిదుడుకులకు లోనవుతాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు ఆశించిన రాబడులు రావు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) భారీ మొత్తాల్లో డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. వారి అవసరాలను బట్టి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. దీంతో ఒడిదుడుకులు తప్పవు. పెట్టుబడులను డైవర్సిఫై చేయమని మీరు తరచుగా సలహాలిస్తుంటారు కదా. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం మిడ్-క్యాప్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయమంటారా? లేక మల్టీ-క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? - పరమేశ్వర్, కాకినాడ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేయడానికి చాలా మార్గాలున్నాయి. వివిధ రకాలైన డెవర్సిఫైడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. లేదా వివిధ సెగ్మెంట్లకు సంబంధించిన ఫం డ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఏ మార్గాన్ని ఎన్నుకోవాలనేది మీ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మార్కెట్ల రోజువారీ ఒడిదుడుకుల కారణంగా మీరు అశాంతికి గురవుతున్నట్లయితే డైవర్సిఫైడ్ ఫండ్స్‌కు సంబంధించి వాల్యూ రీసెర్చ్ సూచించే లార్జ్, మిడ్‌క్యాప్, మల్టీ క్యాప్ ఈక్విటీ ఫం డ్స్‌లో పెట్టుబడులు పెట్టండి. మరో మార్గమేమిటంటే అధిక పనితీరు ఉన్న ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం. మీకు అనువైనది ఎంచుకోండి. బిర్లా సన్ లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్‌కు 2 స్టార్స్ రేటింగ్‌ని ఇచ్చారు. ఒడిదుడుకుల మార్కెట్లో మిడ్ క్యాప్ ఫండ్ పనితీరును బట్టి ఆ ఫండ్‌ను అంచనా వేయవచ్చని మీరు చెబుతుంటారు. గత ఏడాది కాలం నుంచి మన మార్కెట్లు ఒడిదుడుకులమయంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ పనితీరును ఎలా అంచనా వేస్తారు? - ముంతాజ్, ఖమ్మం ఓవరాల్‌గా చూస్తే బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ పనితీరు పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. అయితే ఈ కేటగిరి ఫండ్స్‌తో పోల్చితే మాత్రం, ఈ ఫండ్ తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పవచ్చు. ఒక మిడ్ క్యాప్ ఫండ్‌ను నిర్వహించే మేనేజర్ ఆ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక్కో ఫండ్ మేనేజర్ ఒక్కో విధంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా వివిధ ఫండ్స్ మేనేజర్లు వివిధ రకాలైన స్టాక్స్‌ను ఎంచుకోవడం వల్ల ఈ ఫండ్స్ పనితీరు వేర్వేరుగా ఉంటుంది. మరోవైపు ఈ కేటగిరి ఫండ్స్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఫండ్ ఇచ్చే రాబడికి, అధ్వాన పనితీరు కనబరిచిన ఫండ్ ఇచ్చే రాబడికి తేడా పెద్దగా ఉండదు. ఎంచుకోవడానికి లార్జ్‌క్యాప్ స్టాక్స్ తక్కువగా ఉండడమే దీనికి కారణం. బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ 2009లో 120 శాతం రాబడులనిచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ కేటగిరి ఫండ్స్ సగటు రాబడిని కూడా అందించలేకపోయింది. గత 3-4 ఏళ్లలో చెప్పుకోదగిన రాబడులనిచ్చిన ఫండ్స్ కొన్ని లేకపోలేదు. -ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్