డెట్ ఫండ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలాంటివేనా? | question hour with dheerendra kumar | Sakshi
Sakshi News home page

డెట్ ఫండ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలాంటివేనా?

Published Mon, Dec 16 2013 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

డెట్ ఫండ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలాంటివేనా?

డెట్ ఫండ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలాంటివేనా?

 డెట్ ఫండ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలాంటివేనా? ఎఫ్‌ఐఐల నిధుల కారణంగా అవి ఒడిదుడుకులకు గురవుతాయా? డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి?
 - జాన్సన్, సికింద్రాబాద్
 
 ఒడిదుడుకులున్నప్పటికీ, ఓ మేరకు డెట్‌ఫండ్స్ సురక్షితమైనవేనని చెప్పవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే ఇవి కొంచెం భద్రమైనవే. అయితే నష్టభయం పూర్తిగా లేదని చెప్పడానికి లేదు. డెట్‌ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు - ఇవి రెండూ ఒకలాంటివేనని, డెట్‌ఫండ్స్‌లో పెట్టిన తమ పెట్టుబడులు క్షీణించే అవకాశాల్లేవని చాలా మంది ఇన్వెస్టర్లు పొరబడుతూ ఉంటారు. వడ్డీరేట్లు పెరిగితే డెట్ ఫండ్స్ విలువ తగ్గిపోతుంది. డెట్ ఫండ్స్‌లో నష్ట భయాన్ని తగ్గించుకునే మార్గాలున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ టైమ్‌ఫ్రేమ్‌ను కచ్చితంగా నిర్దేశించుకోవాలి.  ఈ టైమ్‌ఫ్రేమ్ 3 నెలలు/6 నెలలు/2 సంవత్సరాలు.... ఇలా ఏదైనా నిర్దిష్టమైన కాలపరిమితిని నిర్దేశించుకోవాలి. దీనికి తగ్గట్టుగా సరైన ఫండ్‌ను ఎంచుకుంటే మరీ నిరాశచెందేస్థాయిలో రాబడులు ఉండవు. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు చేసే పొరపాటేమిటంటే స్వల్పకాలానికి అవసరమయ్యే పెట్టుబడులను దీర్ఘకాలిక డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి సహజంగానే స్వల్పకాలంలో ఒడిదుడుకులకు లోనవుతాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు ఆశించిన రాబడులు రావు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) భారీ మొత్తాల్లో డెట్‌ఫండ్స్‌లో  ఇన్వెస్ట్ చేస్తారు. వారి అవసరాలను బట్టి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. దీంతో ఒడిదుడుకులు తప్పవు.  
 
 పెట్టుబడులను డైవర్సిఫై చేయమని మీరు తరచుగా సలహాలిస్తుంటారు కదా. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం మిడ్-క్యాప్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయమంటారా? లేక మల్టీ-క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా?
 - పరమేశ్వర్, కాకినాడ
 
 ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేయడానికి చాలా మార్గాలున్నాయి. వివిధ రకాలైన డెవర్సిఫైడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. లేదా వివిధ సెగ్మెంట్లకు సంబంధించిన ఫం డ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఏ మార్గాన్ని ఎన్నుకోవాలనేది మీ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మార్కెట్ల రోజువారీ ఒడిదుడుకుల కారణంగా మీరు అశాంతికి గురవుతున్నట్లయితే డైవర్సిఫైడ్ ఫండ్స్‌కు సంబంధించి వాల్యూ రీసెర్చ్ సూచించే లార్జ్, మిడ్‌క్యాప్, మల్టీ క్యాప్ ఈక్విటీ ఫం డ్స్‌లో పెట్టుబడులు పెట్టండి. మరో మార్గమేమిటంటే అధిక పనితీరు ఉన్న ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం. మీకు అనువైనది ఎంచుకోండి.
 
 బిర్లా సన్ లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్‌కు 2 స్టార్స్ రేటింగ్‌ని ఇచ్చారు. ఒడిదుడుకుల మార్కెట్లో మిడ్ క్యాప్ ఫండ్ పనితీరును బట్టి ఆ ఫండ్‌ను అంచనా వేయవచ్చని మీరు చెబుతుంటారు. గత ఏడాది కాలం నుంచి మన మార్కెట్లు ఒడిదుడుకులమయంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ పనితీరును ఎలా అంచనా వేస్తారు?                 - ముంతాజ్, ఖమ్మం
 
 ఓవరాల్‌గా చూస్తే బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ పనితీరు పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. అయితే ఈ కేటగిరి ఫండ్స్‌తో పోల్చితే మాత్రం, ఈ ఫండ్ తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పవచ్చు. ఒక మిడ్ క్యాప్ ఫండ్‌ను నిర్వహించే మేనేజర్ ఆ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను  లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్  చేస్తారు. ఒక్కో ఫండ్ మేనేజర్ ఒక్కో విధంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా వివిధ ఫండ్స్ మేనేజర్లు వివిధ రకాలైన స్టాక్స్‌ను ఎంచుకోవడం వల్ల ఈ ఫండ్స్ పనితీరు వేర్వేరుగా ఉంటుంది. మరోవైపు ఈ కేటగిరి ఫండ్స్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఫండ్ ఇచ్చే రాబడికి, అధ్వాన పనితీరు కనబరిచిన ఫండ్ ఇచ్చే రాబడికి తేడా పెద్దగా ఉండదు. ఎంచుకోవడానికి లార్జ్‌క్యాప్ స్టాక్స్ తక్కువగా ఉండడమే దీనికి కారణం. బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ 2009లో 120 శాతం రాబడులనిచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ కేటగిరి ఫండ్స్ సగటు రాబడిని కూడా అందించలేకపోయింది. గత 3-4 ఏళ్లలో చెప్పుకోదగిన రాబడులనిచ్చిన ఫండ్స్ కొన్ని లేకపోలేదు.
 
 -ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement