dheerendra kumar
-
ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.. వారంవారీ సిప్.. నెలవారీ సిప్ ఏది బెటర్?
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయని తెలుసు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ చేసుకోవడం? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
Q & A: ఇల్లు కొందామనుకుంటున్నా.. డౌన్‌పేమెంట్ కోసం ఈక్విటీ ఫండ్స్ కరెక్టేనా?
నేను వచ్చే 15 ఏళ్లలో రూ.2.5–3 కోట్ల వరకు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. డౌన్‌పేమెంట్ సమకూర్చుకునేందుకు... టాటా స్మాల్‌క్యాప్ లేదంటే ఎడెల్వీజ్ స్మాల్‌క్యాప్, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అన్నవి మంచి ఎంపికలేనా? – ఆదిత్య బి మీరు ఇప్పటి నుంచి 10–15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రణాళికతో ఉంటే సరైన ట్రాక్‌లో ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత వ్యవధి ఉంది. ఈక్విటీ ఫండ్స్‌లో మోస్తరు రాబడులకు ఇంతకాలం అనుకూలమని చెప్పుకోవచ్చు. దీంతో మీ ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటి కొనుగోలుకు అయ్యే ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అంచనా వేస్తునట్టు అయితే, దీనికి రియల్ ఎస్టేట్‌లో ఉండే సగటు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని జోడించాల్సి ఉంటుంది. అప్పుడు వాస్తవ కొనుగోలు ధరపై అంచనాకు రావాలి. దీనివల్ల డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు నెలవారీగా ఎంత మేర సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న దానిపై స్ప ష్టత సాధించొచ్చు. సిప్ మొత్తాన్ని రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పథకాలను కూడా జోడించుకోవచ్చు. కాకపోతే వీటిల్లో 25–30 శాతానికి మించి కేటాయింపులు చేసుకోవద్దు. మీ రిస్క్ సామర్థ్యం, ఈక్విటీ ఫండ్స్ పట్ల మీకు ఉన్న గత అనుభవం ఆధారంగా కేటాయింపులపై నిర్ణయానికి రావాలి. గృహ రుణానికి చెల్లించే ఈఎంఐ మీ నెలవారీ ఆదాయంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. ఇందుకు గాను కావల్సినంత డౌన్ పేమెంట్‌ను ముందే సమకూర్చుకోవాలి. మరోవైపు ఇంటిని పెట్టుబడిగా చూడడం మంచి ఆలోచన కాదు. రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ చాలా తక్కువ. ఇంటిని కొనుగోలు చేయడం, విక్రయించడం అంత సులభం కాదు. కనుక ఇంటి కొనుగోలు నివాసం కోణం నుంచే చూడాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
నేను పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ వరుసగా రెండేళ్లపాటు చెత్త పనితీరు చూపించినట్టయితే, నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనదేనా? – ఖలీద్ మునావర్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి వైదొలగేందుకు, ఆ పథకం తక్కువ పనితీరు చూపించడం అన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. తక్కువ పనితీరు అంటే ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ రాబడులు ఇవ్వడం. వైదొలిగే నిర్ణయానికి ముందు.. మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ పథకం విభాగంలోని ఇతర పథకాల పనితీరు కూడా విశ్లేషించాలి. వాటి పనితీరు కూడా తగ్గిందా..? లేక మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం పనితీరు మాత్రమే తగ్గిందా? చూడాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ క్షీణించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ పడిపోయినా రాబడులు తగ్గుతాయి. అన్ని పథకాలు కొన్ని ప్రతికూల సమయాలను ఎదుర్కొంటూ ఉంటాయి. అది చూసి ఒక పథకం నుంచి మరో పథకంలోకి మారిపోవడం సరైన నిర్ణయం కాబోదు. ఈ ప్రతికూల, తక్కువ పనితీరు అనేది ఒక పథకంలో కనీసం నిరంతరాయంగా రెండేళ్లపాటు కొనసాగాలి. అప్పుడు ఆ పథకం పనితీరు గురించి మీరు ఆలోచన చేయవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు) మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం తక్కువ పనితీరు చూపించడం వెనుక కారణాన్ని గుర్తించాలి. ఫండ్ మేనేజర్లో మార్పు జరిగిందా? అందుకే పనితీరు మందగించిందా? అని చూడాలి. అదే నిజమైతే ఆ పథకం నుంచి మీ పెట్టుబడులను తీసుకుని బయటకు రావచ్చు. ఒకవేళ ఫండ్ మేనేజర్లో మార్పు లేకపోతే.. రాబడులు మందగించడానికి గల కారణాన్ని సాధారణంగా వారు మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఆయా ఫండ్ సంస్థ నెలవారీ న్యూస్ లెటర్లోనూ సమాచారాన్ని వెల్లడిస్తుంటారు. పథకం పెట్టుబడుల విధానం వల్ల కూడా తాత్కాలికంగా రాబడులు మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పథకం పనితీరును తప్పుబట్టడం సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు గ్రోత్ ఆధారిత విధానంతో పోలిస్తే వ్యాల్యూ ఆధారిత పెట్టుబడుల విధానం కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది. అటువంటప్పుడు మీరు పెట్టుబడులను కొనసాగించొచ్చు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకం అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించాలని ఆశిస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది సాధ్యం కాదు. అన్ని పథకాలు సానుకూల, ప్రతికూల సందర్భాలను ఎదుర్కొంటూ వెళుతుంటాయి. కనుక పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ చూడాలి. నా వయసు 32 సంవత్సరాలు. నేను ఐదేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టుబడులు పెట్టే కాలంలో అస్సెట్ అలోకేషన్‌ను ఎలా నిర్వహించాలి? -వినయ్ శేఖర్ చిన్న వయసు నుంచే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో అస్సెట్ అలోకేషన్ ఎంతో కీలకమైనది. మీ పెట్టుబడులను ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు (డెట్) కేటాయించడం, అలాగే, మీ పెట్టుబడుల కాల వ్యవధి, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాల ఆధారంగా కేటాయింపులు చేసుకోవడమే అస్సెట్ అలోకేషన్. ఈక్విటీలు ఇతర సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మంచి రాబడులను ఇవ్వగలవు. మీ పెట్టుబడుల కాల వ్యవధి ముగింపునకు వస్తున్నప్పుడు, పెట్టుబడులతో అవసరం ఏర్పడడానికి కొంత ముందు నుంచే క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను డెట్‌లోకి మళ్లించు కోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలు మూడేళ్ల లోపు ఉంటే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. మూడేళ్లకు మించి ఉన్నప్పుడు మొత్తం పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మూడు నుంచి ఐదేళ్ల కోసం అయితే 25-30 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. ఐదు, ఏడేళ్ల కోసం అయితే ఈక్విటీ కేటాయింపులు 50 శాతం వరకు, లేదా మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఏడేళ్లకు మించిన లక్ష్యాల కోసం ఈక్విటీలకు 70-80 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ముఖ్యమైనది. దీనివల్ల అస్థిరతలను అధిగమించొచ్చు. -ధీరజ్ కుమార్, సీఈవో వాల్యూ రీసెర్చ్ -
మంచి ఫండ్‌ను గుర్తించడం ఎలా? ఇదిగో ఇలా!
ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఒకేసారి, ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – వెంటక రమణ మీరు సంక్లిష్టతను ఇష్టపడే వారు అయితే అప్పుడు ఒకటికి మించిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో విభాగాల మధ్య వర్గీకరించినప్పుడు అది గజిబిజీగా, పన్ను పరంగా అనుకూలం కాకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాలు వివిధ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా విభాగాలకు కేటాయించే మొత్తం వేర్వేరుగా ఉండొచ్చు. సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70-75 శాతాన్ని లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. కనుక మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మీరు విడిగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా, రిస్క్ తీసుకునే వారు, ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10-15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవడం ద్వారా ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. మంచి మ్యూచువల్ ఫండ్‌ను గుర్తించడం ఎలా? అలాగే, ఏడాది కోసం ఒక మంచి పథకాన్ని సూచించగలరు. ఏడాదికి 12 శాతం కాంపౌండెడ్ రాబడి నా లక్ష్యం – ఇమ్రత్ సూతర్ చాలా విస్తృత శ్రేణిలో వేలాది పథకాలు ఉన్నప్పుడు సరైన పథకం ఎంపిక అన్నది కష్టమైన పనే. అయితే మంచి పథకం ఎంపికకు రాబడులు ఒక్కటే ప్రామాణికంగా తీసుకోకూడదు. పెట్టుబడి పెట్టడానికి ముందు మీ లక్ష్యాలను గుర్తించాలి. మీ పెట్టుబడుల లక్ష్యం ఆధారంగానే ఎలాంటి పథకం ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలన్నది మీ లక్ష్యం అయితే అందుకు ఈక్విటీ పథకాలపై దృష్టి పెట్టాలి. అలా కాకుండా క్రమం తప్పకుండా ఆదాయం కోరుకుంటుంటే స్థిరాదాయ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రిస్క్ ఎంత తీసుకోగలరు? అన్నది కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. మీ పెట్టుబడులు విలువ పడిపోతూ, పెరుగుతూ ఉన్నా ఫర్వాలేదని అనుకుంటే అప్పుడు ఈక్విటీలు అనుకూలం. లేదా రిస్క్ లేని రాబడులు కోరుకుంటే డెట్ విభాగం అనుకూలం. అధిక రాబడులు ఇచ్చే సాధనాలు ఏవైనా అందులో అధిక రిస్క్ ఉంటుందని మర్చిపోవద్దు. రిస్క్, రాబడుల మధ్య సమతుల్యం అవసరం. పెట్టుబడులను ఎంత కాలం కొనసాగించాలని అనుకుంటున్నారు? లిక్విడిటీ సమస్యలు సమీప భవిష్యత్తులో ఉన్నాయా? తదితర అంశాలను చూడాలి. మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి నడుస్తుంటాయి. అందుకని కనీసం ఐదేళ్లకు తక్కువ కాకుండా ఈక్విటీ పెట్టుబడులు కొనసాగించుకోవాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, వీటికి సరితూగే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇక ఏడాది కాలానికి 12 శాతం రాబడి కోరుకుంటే అది అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్లు కరెక్షన్లోకి వెళితే రాబడులు అటు ఉంచి, పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఏడాది కోసం అయితే, ఎఫ్డీ తదితర సంప్రదాయ సాధనాలనే చూడాల్సి ఉంటుంది. వీటిల్లో మీరు కోరుకున్నంత రాబడి రాదు. -
మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చా? ఈ విషయాలు తెలుసా?
ఫండ్ పథకంలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని పిల్లల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలి. మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్ సంస్థలు ఆమోదించవు. ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవడం ఒక్కటే మార్గం. నేను ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఓ మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 లేదా 5 స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్‌దీప్ సింగ్ ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్‌ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్ చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోండి. విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇది పన్ను ఆదా అవుతుంది. -ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వారసత్వంగా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌పై పన్ను కట్టాల్సిందేనా?
నాకు వారసత్వంగా వచ్చిన ఫండ్స్ ప్రస్తుత విలువ రూ.10 లక్షలు. కానీ, వాటిని కొనుగోలు చేసిన సమయంలో చేసిన పెట్టుబడి రూ.5 లక్షలే. నేను విక్రయించే సమయంలో రూ.15 లక్షలు ఉంటే అప్పుడు మూలధన లాభాల పన్నును ఎలా లెక్కిస్తారు? వాస్తవంగా కొనుగోలు చేసిన ధర నుంచి చూసి పన్ను చెల్లించాలా..? లేక నాకు బదిలీ అయిన నాటి విలువనే పరిగణనలోకి తీసుకుంటారా? – తరుణ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారు మరణిస్తే ఆ యూనిట్లను నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బదిలీ చేస్తారు. ఇలా ఒకసారి బదిలీ చేసిన తర్వాత పన్ను అంశంపై సందేహం ఏర్పడడం సహజమే. అదృష్టవశాత్తూ మనదేశంలో వారసత్వ పన్ను లేదు. మీ తల్లిదండ్రులు లేదా మరొకరి నుంచి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు మీకు బదిలీ అయితే పన్ను చెల్లించక్కర్లేదు. కాకపోతే ఆ యూనిట్లను విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించినప్పుడు ఉండే బాధ్యతలే మీకు వర్తిస్తాయి. మూలధన లాభాల పన్ను విషయానికొస్తే ఆ పెట్టుబడిని ఎంత కాలం కొనసాగించారు (అసలు కొనుగోలు నాటి నుంచి) అనే దాని ఆధారంగా నిర్ణయానికి రావాలి. ఇక్కడ అసలు మొదట కొనుగోలు చేసిన తేదీనే పన్ను కోసం పరిగణనలోకి తీసుకుంటారు. మీకు బదిలీ అయిన తేదీ లెక్కలోకి రాదు. ఉదాహరణకు రవి తండ్రి రూ.5 లక్షలను ఓ పథకంలో 2019లో ఇన్వెస్ట్ చేశాడని అనుకుందాం. అప్పుడు అతని తండ్రి యూనిట్దారు అయితే, రవి నామినీ అవుతారు. దురదృష్టవశాత్తూ రవి తండ్రి గతేడాది మరణించారు. ఆయన పేరిట ఉన్న యూనిట్లు రవికి బదిలీ అయ్యాయి. బదిలీ అయ్యే నాటికి ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.7 లక్షలుగా ఉంది. ఇప్పుడు వాటి విలువ రూ.7.80 లక్షలు ఉంది. రవి ఆ పెట్టుబడులను విక్రయించాలని అనుకుంటున్నాడు. ఇక్కడ పెట్టుబడులను 2019 నుంచి కొనసాగించినట్టు చూస్తారు. ఈక్విటీ పథకంలో పెట్టుబడులు కనుక హోల్డింగ్ పీరియడ్ ఏడాదికిపైనే ఉంది. లాభం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. మొదటి రూ.లక్ష లాభాన్ని మినహాయించి మిగిలిన లాభంపై 10 శాతాన్ని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విక్రయించే నాటి విలువ రూ.7.80 లక్షల్లో పెట్టుబడి రూ.5 లక్షలు మినహాయిస్తే అప్పుడు లాభం రూ.2.80 లక్షలు అవుతుంది. రూ.లక్ష లాభం మినహాయిస్తే, మిగిలిన రూ.1.80 లక్షల లాభంపై 10 శాతం పన్ను చొప్పున రూ.18,000 చెల్లించాలి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ గణేశ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసేది. వాటి పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ లేదా ఈక్విటీల్లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్‌వోఎఫ్‌లను ఆయా ఫండ్స్ హౌస్‌లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్‌వోఎఫ్‌లు వేరే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండంచెల్లో ఎక్స్పెన్స్ రేషియో భారాన్ని మోయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఎఫ్‌వోఎఫ్‌లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో భరించాలని అర్థం చేసుకోవాలి. ఎఫ్‌వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్‌వోఎఫ్‌లు నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్‌వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి: ఈ పొరబాటు అసలు చేయకండి!
మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయం చేసే సమయంలో నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) పదం వినిపిస్తుంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ ధరగా కొందరు భావిస్తుంటారు. దీంతో ఎన్ఏవీ తక్కువ ఉంటే అది ఇతర పథకాలతో పోలిస్తే చౌక అని భావిస్తుంటారు. అంటే ఎన్ఏవీ తక్కువగా ఉన్న పథకాన్ని ఎంచుకోవాలని అర్థమా? కాదు. మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎన్ఏవీని పరిగణనలోకి తీసుకోవద్దన్నది మా సూచన. ఒక పథకం ఎన్ఏవీ తక్కువగా ఉంటే.. దాన్ని చౌకగా భావించొచ్చా..? పెట్టుబడులకు ఆకర్షణీయంగా తీసుకోవచ్చా? -జగదీశ్వర్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయం చేసే సమయంలో నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) పదం వినిపిస్తుంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ ధరగా కొందరు భావిస్తుంటారు. దీంతో ఎన్ఏవీ తక్కువ ఉంటే అది ఇతర పథకాలతో పోలిస్తే చౌక అని భావిస్తుంటారు. అంటే ఎన్ఏవీ తక్కువగా ఉన్న పథకాన్ని ఎంచుకోవాలని అర్థమా? కాదు. మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎన్ఏవీని పరిగణనలోకి తీసుకోవద్దన్నది మా సూచన. ఎన్ఏవీ అంటే? ఒక మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియో (పెట్టుబడులు) మార్కెట్ విలువను మొత్తం యూనిట్లతో భాగించగా వచ్చేదే ఎన్ఏవీ. ఒక పథకానికి సంబంధించి ఒక యూనిట్ విలువను ఇది చెబుతుంది. ఒక కంపెనీ షేరు మాదిరే, ఒక పథకం యూనిట్ అని అనుకోవచ్చు. ఒక యూనిట్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో ఇది తెలియజేస్తుంది. అలాగే, ఒక యూనిట్‌ను విక్రయిస్తే ఎంత వస్తుందో చెప్పడానికి ప్రామాణికమే ఎన్ఏవీ. ఎన్ఏవీ ధర ఎన్ఏవీ విలువను చూసి ధరగా భావించొద్దు. తులం బంగారం కొనుగోలు చేద్దామని జ్యుయలరీ షాపునకు వెళ్లారని అనుకుందాం. 10 గ్రాములు రూ.50వేలు ఉంది. వెండి తులం ధర రూ.600. దీంతో చౌకగా వస్తుందని వెండిని కొనుగోలు చేసుకుని వెళతారా? ఒకవేళ కొనుగోలు చేసినా అది బంగారం కాదు. బంగారానికి ఉన్న విలువ రాదు. ఈ రెండింటి ధరలను పోల్చడానికి లేదు. అలాగే, రెండు పథకాల ఎన్ఏవీ కూడా అంతే. ఒక పథకం ఎన్ఏవీ చౌకగా ఉందని దాన్ని కొనుగోలు చేస్తామంటే అది సరి కాదు. ఎన్ఏవీ తక్కువగా ఉన్నది మెరుగైన పథకం కావాలని లేదు. ఒక పథకం నిర్వహణలోని పెట్టుబడుల మార్కెట్ విలువ మారినప్పుడు, తాజా పెట్టుబడులు, అదే పథకంనుంచి ఇన్వెస్టర్లు ఉప సంహరించుకున్న మొత్తం ఇవన్నీ కూడా పరిగణనలోకి వచ్చే అంశాలే. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే ఫండ్ ఎన్ఏవీ రూ.10 ఉంది. వై అనే ఫండ్ ఎన్ఏవీ రూ.50 ఉంది. ఏడాది కాలంలో ఈ రెండు పథకాలు ఒకే విధంగా 25 శాతం రాబడి ఇచ్చాయని అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఫండ్ ఎన్ఏవీ రూ.10 నుంచి రూ.12.50 అవుతుంది. వై ఫండ్ ఎన్ఏవీ రూ.50 నుంచి రూ.62.50 అవుతుంది. ఆయా పథకాల పెట్టుబడులపై వచ్చిన రాబడి ఆధారంగా ఎన్ఏవీలో మార్పులు ఉంటాయి. అంతేకానీ, ఎన్ఏవీ తక్కువగా ఉంటే చౌక, ఆకర్షణీయమని అనుకోవద్దు. వ్యయాలను మినహాయించిన తర్వాతే పనితీరు చూస్తారా? -విణదమ్ వ్యాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ వెబ్సైట్లో ఫండ్స్ పనితీరును వాటి ఎన్ఏవీలో వృద్ధి ఆధారంగా లెక్కిస్తుంటాం. వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎన్‌ఏవీపై నిర్ణయానికి వస్తాం. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల విలువను, మొత్తం యూనిట్లతో భాగించగా ఎన్ఏవీ వస్తుందని తెలుసుకదా. ఇక్కడ పథకానికి సంబంధించి అన్ని వ్యయాలను, నిర్వహణ ఫీజులను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. అప్పుడు నికర విలువ వస్తుంది. ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ మార్కెట్ ముగిసిన తర్వాత పెట్టుబడుల విలువ ఆధారంగా, వ్యయాలను మినహాయించి పథకాల ఎన్ఏవీలను ఖరారు చేస్తుంటుంది. ఆయా ఫండ్ పథకాలు రోజువారీగా ప్రకటించే ఎన్ఏవీల ఆధా రంగానే మ్యూచువల్ ఫండ్ పథకం రాబడులను లెక్కిస్తుంటాం. ఉదాహరణకు ఒక పథకం ఎన్ఏవీ రూ.12 ఉందనుకుంటే, ఏడాది క్రితం ఇదే పథకం ఎన్ఏవీ రూ.10గా ఉంటే, ఏడాదిలో 20 శాతం రాబడులను ఇచ్చినట్టు. ఒకవేళ ఎన్ఏవీ రూ.12 నుంచి రూ.10కు తగ్గితే అప్పుడు 20 శాతం నష్టాలను ఇచ్చినట్టు. ఏడాదికాలానికి మించి రాబడులను చూసే సమయంలో కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
పెట్టుబడులు ఆలస్యం అయితే ఏంటి మార్గం?
పెట్టుబడులు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ అస్థిరతలు, జాగ్రత్తలపై నిపుణులు, వాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ సలహాలు ఎవరైనా ఒకరు ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. అప్పటి వరకు నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేది ఎలా? నేను 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి నిధిని సిద్ధం చేసుకోవడం ఎలా? – సురేష్ మరీ అంత ఆలస్యం ఏమీ కాలేదు. మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు 20–25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం సరిపోతుంది. అంతేకాదు, మీరు అనుకున్న 55 ఏళ్లకు రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడుల మొత్తం తీసుకెళ్లి డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత భాగం అలానే కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. కనుక వెంటనే ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మ్యాజిక్ సాధ్యపడుతుందన్నది ఇన్వెస్టర్లు నమ్మే అంశం. అది జరగాలంటే మరింత పెట్టుబడి పెట్టాలన్నది గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధిగా అది ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే మార్గం. మార్కెట్లు తీవ్ర అస్థిరతలు ఎదుర్కొంటున్నాయి.. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ మార్కెట్లలో ఇప్పుడు అస్థితరలు ఎదుర్కొంటున్నది నిజం. ఇప్పుడనే కాదు గతంలోనూ అస్థిరతలను చూశాం. భవిష్యత్తులో ఈ ఆటుపోట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్విటీలంటేనే అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు నిజంగా సంతోషాన్నివ్వాలి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే నానా రకాల సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. -
పెరుగుతున్న ద్రవ్యోల్భణం..! బంగారం ధరలు ఎలా ఉండొచ్చు అంటే...?
ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున షార్ట్ డ్యురేషన్ ఫండ్ కంటే బంగారం మెరుగైనదా? బంగారం ధరలు ఎలా ఉండొచ్చు? – రాజేంద్రన్ వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో బంగారం స్థిరంగా ఉండడమే కాకుండా, రాబడినిస్తుంది. అని శ్చిత పరిస్థితుల్లో ఇది సురక్షిత సాధనం. అయితే, ఇది సిద్ధాంతం మాత్రమే. వాస్తవం ఏమిటంటే బంగారం ఎంతో అస్థిరతలతో కూడుకున్నదని నిరూపితమైంది. ఎన్నో కారణాలు ఈ అస్థిరతలకు దోహదం చేస్తుంటాయి. ఇందులో ఒకటి డిమాండ్–సరఫరా. ఇది ధరలను నిర్ణయిస్తుంటుంది. పైగా బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ఒక టి. గతేడాది గణనీయంగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. భారత్‌లో బంగారం అతిపెద్ద దిగు మతి ఉత్పత్తిగా మారిపోయింది. ఇది ప్రభుత్వానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అనుత్పా దక సాధనం కనుక బంగారాన్ని పెట్టుబడి సాధనంగా ప్రభుత్వం నిరుత్సాహపరచొచ్చు. మనం షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తే ఫ్యాక్టరీలు, పరిశ్రమ, సేవల కంపెనీల యాజమాన్యంలో వాటా లభిస్తుంది. కానీ, బంగారాన్ని కొనుగోలు చేస్తే తీసుకెళ్లి లాకర్లో పెట్టేస్తాం. దాంతో అది ఉత్పాదకతలోకి రాదు. కనుక ప్రభుత్వం దీన్ని పెట్టుబడి కోణంలో నిరుత్సాహపరచొచ్చు. ఈ పరిస్థితులు బంగారంలో అస్థిరతలకు దారితీస్తాయి. అందుకనే స్వల్ప కాలం కోసం అల్ట్రా షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పెరుగుతున్న వడ్డీ రేట్ల సైకిల్‌ను అధిమించడానికి ఇదే మెరుగైన మార్గం అవుతుంది. అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించడం అన్నది ఆర్ట్, సైన్స్‌తో కూడుకున్నది. డిస్కౌంటింగ్ సూత్రా న్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో గుర్తించి, ఆ మేరకు చెల్లించేందుకు ముందుకు రావడం. ఇక్కడ ఎన్నో అంశాలు లెక్కించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అనేది కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మింగేస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని కొనసాగే బలం కూడా కావాలి. నా వద్ద రూ.12 లక్షలు ఉన్నాయి. ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మా కార్యాలయం నుంచి ఉన్న ఆంక్షల కారణంగా స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయలేను. కనుక ఈ మొత్తాన్ని ఎక్కడ, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – బర్జిత్ సింగ్ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఒకటి కాల వ్యవధి, రెండు పెట్టుబడుల పరంగా ఉన్న అనుభవం కీలకమవుతాయి. ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోతే (ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో సైతం) మీరు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా 65 శాతం వరకు ఈక్విట్లీలో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మూడింట ఒక వంతు డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వృద్ధిలో స్థిరత్వం ఉంటుంది. మార్కెట్ల పతనాల్లో అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరి, ఈ ఫండ్స్ మరీ అంత నష్టాలను నమోదు చేయవు. అలాగే, ఈ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడిని ఒకే విడతలో పెట్టేయకూడదు. 12 నెలల్లో సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడి వ్యయం సగటుగా మారుతుంది. కుదుపులను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఒకే విడత రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి.. ఆ తర్వాత 20% పడిపోయినా నష్టం ఎక్కువగా ఉంటుంది. దాంతో పెట్టు బడులను వెనక్కి తీసేసుకుందామన్న ఆందో ళన ఏర్పడొచ్చు. ఏడాది కాలం పాటు సిప్ రూపం లో రూ.12 లక్షలను ఇన్వెస్ట్ చేయడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే పథకాలున్నాయా?
నేనొక సీనియర్ సిటిజన్ని. నా పెట్టుబడుల నుంచి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం కావాలి. హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ప్రతీ నెలా మంచి ఆదాయాన్నిస్తుందని, అదే సమయంలో పెట్టుబడి కూడా వృద్ధి చెందుతుందని తెలిసిన ఒక వ్యక్తి చెప్పారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? – ఈల నందన ఇది నిజమే. కానీ పెట్టుబడులపై డివిడెండ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవద్దు. మ్యూచువల్ ఫండ్ పథకం రాబడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కానీ డివిడెండ్‌కు కాదు. స్వల్పకాలాల్లో అదేపనిగా స్థిరమైన రాబడులను మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు. అన్ని పథకాలు మధ్య మధ్యలో కొంత ప్రతికూల కాలాలను ఎదుర్కొంటుంటాయి. హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా అంతే. ప్రస్తుతం ఈ పథకం మంచి పనీతీరునే ప్రదర్శిస్తోంది. గ్రోత్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని.. ప్రతీ నెలా కావాల్సినంత మేర ఉపసంహరించుకునేలా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. అయితే మీ మొత్తం పెట్టుబడి నుంచి ఒక ఏడాదిలో ఉపసంహరించుకునే మొత్తం 6 శాతాన్ని మించకుండా చూసుకోండి. ఉదాహరణకు రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారనుకుంటే.. మ్యూచువల్ ఫండ్ పథకం 10 శాతం రాబడి ఇస్తున్నట్టయితే అప్పుడు ప్రతీ నెలా రూ.500 మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ రూపంలో తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఏడాది తర్వాత పెట్టుబడి మొత్తం రూ.1.04 లక్షలుగా ఉంటుంది. ఈ విధానం వల్ల మ్యూచువల్ ఫండ్ పథకం కొంత కాలం పాటు ప్రతికూలతలు ఎదుర్కొన్నా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 4 శాతం మేర రాబడులు పెట్టుబడికి జమ అవుతుంటాయి. దీర్ఘకాలంలో ఇది కూడా వృద్ధి చెందుతుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిపాజిట్లు.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – అంకిత్ జైన్ రెండింటిలోనూ భద్రత ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కాస్త అధిక భద్రత ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడుల పరంగా వైవిధ్య ప్రయోజనం లభిస్తుంది. అదే సమయంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిపాజిట్లో రిస్క్ ఉంటుందని కాదు. ఆర్బీఐ సూక్ష్మంగా వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొత్త నమూనా కింద వచ్చినవి. ఇంకా విశ్వసనీయతను సంపాదించుకోవాల్సి ఉంది. అంటే అవి భద్రత లేనివి అని కాదు. డెట్ ఫండ్‌లో మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఆ మొత్తం కూడా 30 డెట్ సాధనాల మధ్య విస్తరించి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక్కటి అంచనాలు తప్పినా.. పెట్టుబడుల్లో 5–7 శాతం వాటా మించి ఉండదు. అంటే మీ పెట్టుబడులు మొత్త రిస్క్‌లో పడినట్టు కాదు. మూడేళ్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తే డెట్సాధనాల రాబడులపై పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పైగా వీటిల్లో లిక్విడిటీ అధికం. విక్రయించిన రెండు రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే.. మెచ్యూరిటీ సమయానికి ఎంత మొత్తం వస్తుందన్నది డిపాజిట్స్‌లో తెలుస్తుంది. డెట్ ఫండ్స్‌లో అయితే రాబడులు అంచనాలపైనే ఆధారపడి ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు టర్మినల్ ఇల్నెస్ రైడర్, ఇతర రైడర్లను యాడ్ చేసుకోవాలా లేక విడిగా పాలసీ తీసుకోవడం మంచిదా? – సుహాస్ రైడర్లు అయితే చౌకగా వస్తాయి. తక్కువ వ్యయానికే కవరేజీనిచ్చే మంచి ప్లాన్లు. ఊహించనిది జరిగితే ఆదుకుంటాయి. మీ టర్మ్ ఇన్సూరెన్స్‌కు రైడర్లను జోడించుకోవడం మంచిదే. చదవండి: ‘ఎస్బీఐ లాంటివి నాలుగైదు బ్యాంకులు కావాలి’ -
పిల్లల భవిష్యత్తుకు.. ఫ్లెక్సీక్యాప్ లేదా స్మాల్‌క్యాప్?
పిల్లల భవిష్యత్తు దృష్ట్యా 10-15 ఏళ్ల కోసం.. మల్టీక్యాప్ (ఫ్లెక్సీక్యాప్) లేదా స్మాల్ క్యాప్‌లలో అధిక రాబడుల కోసం ఏది మెరుగైన ఎంపిక అవుతుంది? చక్కని పోర్ట్‌ఫోలియో రీత్యా అంతర్జాతీయ ఫండ్స్‌కు ఎంత మేర కేటాయింపులు చేసుకోవచ్చు?- వరుణ్, పుణె మార్కెట్ల హెచ్చు, తగ్గులను చూసి కలవర పడకపోతే మల్టీక్యాప్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది. అయితే, 10-15 ఏళ్ల దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. పెట్టుబడులు పెట్టి మర్చిపోయేట్టు అయితే, ఈక్విటీల్లో అనిశ్చితులకు చలించేట్టయితే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశం కాల వ్యవధే. మీ ప్రశ్న ప్రకారం 15 ఏళ్ల వరకు మీకు డబ్బుల అవసరం లేదు. మల్టీక్యాప్ ఫండ్స్ కూడా మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, వాటిల్లో రాబడులు మరీ ఎక్కువగా ఉండవు. అస్థిరతలు కొంత తక్కువ. ఎందుకంటే పెట్టుబడుల్లో వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. మీ రెండో ప్రశ్న అంతర్జాతీయ ఫండ్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఫండ్స్‌లో మీకు పెట్టుబడులు లేనట్టయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలో 15-20 శాతం నిధులను వీటికి కేటాయించుకోవచ్చు. అయితే, అంతర్జాతీయ ఫండ్స్‌ను విభిన్నంగా చూడరాదు. వీటిని సైతం మొత్తం ఈక్విటీ కేటాయింపుల్లో భాగంగానే చూడాలి. అంతర్జాతీయ ఫండ్స్‌కు 15-20 శాతం కేటాయింపులను ఒకే సారి కాకుండా కొంత కాల వ్యవధి పరిధిలో కేటాయించుకోవాలి. దీనివల్ల కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఏర్పడే నమ్మకానికి అనుగుణంగా మరింత కేటాయింపులు చేసుకోవడం లేదా అప్పటి వరకు చేసిన కేటాయింపులకు పరిమితం కావొచ్చు. నా వయసు 55 ఏళ్లు. ముందస్తుగానే స్వచ్చంద పదవీ విరమణ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రస్తుతం నా నెలవారీ ఖర్చులు రూ.50,000. రిటైర్మెంట్ నిధి కింద రూ.80 లక్షలు సమకూర్చుకున్నాను. జీవించి ఉన్నంత కాలం క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం వచ్చేందుకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? -నీరజ, హైదరాబాద్ రూ.80 లక్షల నిధిపై ప్రతి నెలా రూ.50,000 ఆదాయం కోరుకుంటున్నారు. అంటే ఈ లెక్కన వార్షికంగా ఉపసంహరించుకునే రేటు 7.5 శాతం అవుతుంది. ఇలా అయితే మీ దగ్గరనున్న నిధి తొందరగా కరిగిపోతుంది. పైగా మీరు ముందుగానే పదవీ విరమణ తీసుకుంటున్నారు. దీంతో ఈ నిధిపై ఎక్కువ కాలం పాటు ఆధారపడి ఉంటారు. కనుక మీ రిటైర్మెంట్ ప్రణాళికను మరో సారి సమీక్షించుకోవాలి. ఎవరైనా కానీయండి.. రిటైర్మెంట్ నిధి నుంచి ఉపసంహరణ రేటు అన్నది 5 శాతం మించకూడదని మేము విశ్వసిస్తాము. ఈ లెక్కన మీ రిటైర్మెంట్ నిధిపై ప్రతి నెలా రూ.30,000-35,000 మధ్యలో ఆదాయం వస్తుంది. కనుక ఇది సరిపోదు. ఈ దృష్ట్యా మీరు ముందస్తుగా పదవీ విరమణ తీసుకోవాలన్న నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోండి. రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేందుకు గాను.. ప్రతీ ఒక్కరు 35-40 శాతం నిధిని ఈక్విటీలకు కేటాయించుకోవడాన్ని పరిశీలించాలి. మిగిలిన నిధి నుంచి ఏడాది, ఏడాదిన్నర అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుని క్రమం తప్పకుండా పెట్టుబడుల ఉపసంహరణ (సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్/ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నిధిని అధిక నాణ్యత కలిగిన స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ విధమైన పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకున్న తర్వాత.. ఏటా ఒక్కసారి ర్యీబ్యాలెన్స్ (మళ్లీ సమతుల్యం ఉండేలా చూసుకునేందుకు) చేసుకోవాలి. అంటే ఈక్విటీలకు 35 శాతం స్థాయిలో కేటాయింపులు ఉండేలా చూసుకుని.. అంతకుమించి ఉన్న నిధిని లిక్విడ్ ఫండ్స్‌కు మళ్లిస్తూ ఎస్‌డబ్ల్యూపీని కొనసాగించుకోవాలి. దాంతో క్రమబద్ధమైన ఆదాయం అందుకోవచ్చు. అయినా సరే 7.5 శాతం ఉపసంహరణ రేటు అన్నది ఈ ప్రణాళికలోనూ సాధ్యం కాకపోవచ్చు. -
రిటైరైన వారు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించొచ్చా?
నా వయసు 53 సంవత్సరాలు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక సలహా సంస్థ సూచనల ఆదారంగా రూ.15 లక్షలను నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. మరో రూ.15 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. పీపీఎఫ్, ఈపీఎఫ్ల్లోనూ రూ.50లక్షల పెట్టుబడులు ఉన్నాయి. 2026లో నేను పదవీ విరమణ తీసుకుంటాను. ఆ తర్వాత కూడా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించొచ్చా? -ఆర్కే గుప్తా, హైదరాబాద్ ఒక పెట్టుబడి సాధనంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించొచ్చు. మీరు ఈక్విటీల్లో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మీ మొత్తం నిధి రూ.80 లక్షల్లో ఈక్విటీ పెట్టుబడులు 35–37 శాతంగా ఉన్నాయి. రిటైర్ అయిన వారు స్థిరమైన ఆదాయం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి దీర్ఘకాలిక రాబడుల కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు చేసుకోవాలని మేము సాధారణంగా భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈక్విటీలకు మీరు చేసిన కేటాయింపులు చక్కగానే ఉన్నాయి. వాటిని కొనసాగించొచ్చు. కాకపోతే ఈక్విటీ కేటాయింపులు ఏ విధంగా చేశారన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఒకవేళ మీ ఈక్విటీ కేటాయింపులు ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్‌క్యాప్‌లో ఉంటే వెంటనే తగ్గించేసుకుని.. అధిక నాణ్యతతో కూడిన లార్జ్‌క్యాప్ కంపెనీలకే పరిమితం కావాలని నా సూచన. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ విధంగా చేసి ఉంటే సరైన నిర్ణయమే అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును (ఎల్టీసీజీ) లెక్కించే సమయంలో ఇండెక్సేషన్ ప్రయో జనం అన్నది కేవలం డెట్ ఫండ్స్‌కే వర్తిస్తుందా..? ఈక్విటీలకు ఉండదా? -శివనందన, బెంగళూరు మీరు అడిగింది నిజమే. ప్రస్తుతం ఇండెక్సేషన్ ప్రయోజనం అన్నది డెట్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయంలోనే అందుబాటులో ఉంది. ఈక్విటీలకు లేదు. ఈక్విటీ పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను పడుతుంది. డెట్ ఫండ్స్‌పై ఎల్టీసీజీ అంటే కనీసం మూడేళ్లు, అంతకుమించి పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో డెట్ ఫండ్స్‌పై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్) మినహాయించిన తర్వాత మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ అన్నది మీ కొనుగోలు వ్యయాన్ని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు మీరొక సెక్యూరిటీని రూ.100కు కొనుగోలు చేసి కొన్నేళ్ల పాటు కొనసాగించారనుకుంటే.. ఆ పెట్టుబడి కొనసాగించిన అన్నేళ్లలో రూ.100 విలువ కాస్తా ద్రవ్యోల్బణ ప్రభావం కలసి రూ.125కు చేరిందనుకుంటే.. అప్పుడు ఇండెక్సేషన్ వల్ల మీ కొనుగోలు వ్యయం రూ.100 కాకుండా రూ.125 అవుతుంది. కనుక ఇది మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఈక్విటీలకు ఇండెక్సేషన్ ప్రయోజనం లేకపోయినప్పటికీ.. డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను రేటు తక్కువ. ఇండెక్సేషన్ ప్రయోజనం మీకు అనుకూలిస్తుందా లేదా అన్నది ఎంత మేర మూలధన లాభాలు వచ్చాయి, ద్రవ్యోల్బణం రేటు, కొనసాగించిన కాలం వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. మూడేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్)లో సిప్ ప్రారంభించాను. మూడేళ్ల కాలం అన్నది 2021 మార్చితో ముగిసింది. ఇప్పుడు పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చా? అలాగే, నా వద్ద రూ.1.5లక్షలు ఉన్నాయి. వీటిని ఈఎల్ఎస్ఎస్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక ఏక మొత్తంలో చేసుకోవాలా? -రత్నాకర్, మెదక్ సిప్ రూపంలో ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే.. అప్పుడు ప్రతీ సిప్‌కు 36 నెలల కాలం (సిప్ పెట్టిన తేదీ నుంచి) లాకిన్ అమలవుతుంది. కనుక మీరు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోదలిస్తే అది మొదటి సిప్ వరకే అలా చేసుకోగలరు. ఆ తర్వాతి సిప్‌లకు 36 నెలల కాలం ఇంకా ముగిసిపోలేదు కనుక వాటిని ఉపసంహరించుకోలేరు. మీ వద్ద ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోతగిన మొ త్తం ఉన్నప్పటికీ.. సిప్ వల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. దీంతో మార్కె ట్లు ప్రతికూలంగా మారినా ఆందోళన ఉండదు. సిప్ ద్వారా కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. -
డైరెక్ట్ ప్లానా? రెగ్యులర్ ప్లానా?
మ్యూచువల్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఫండ్స్ ఎన్ ఏవీ(నెట్‌అసెట్‌వేల్యూ) ప్రస్తుతమున్న స్థాయి నుంచి ఎంత మేర పతనమైతే, ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు? –శ్రీనివాస్, విజయవాడ మీకు ఈ విషయంలో నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. ఎన్ ఏవీ తగ్గేదాకా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీరు చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ వెయిటింగ్ నిరంతరం ఉండొచ్చు కూడా ! ఒకవేళ మార్కెట్ 20–25 శాతం పెరిగిందనుకోండి. మార్కెట్ మళ్లీ ఎప్పుడు పడిపోతుందా అని మీరు ఎదురు చూడాల్సి వస్తుంది. దీనికి బదులుగా ఒక మదుçపు వ్యూహాన్ని అనుసరించండి. మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తంలో పది శాతాన్ని ప్రతి నెలా చివరి రోజు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఎన్ఏవీ తగ్గకపోయినా ఈ 10 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. మీరనుకున్నట్లుగా ఎ¯Œ ఏవీ పడిపోయేదాకా వేచి చూస్తూనే, ప్రతి నెలా 10 శాతం మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి.ఎన్ఏవీ పడేదాకా ఎదురుచూసి, ఆ తర్వాత ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యూహం గతంలో పనిచేయలేదు. భవిష్యత్తులో కూడా పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఏ ఫండ్ మేనేజర్ కూడా ఇలాంటి వ్యూహాన్ని పాటిస్తున్న దాఖలాలు అయితే లేవు. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. ఒక్క డెట్ ఫండ్స్ మినహా, ఈక్విటీ, ఇతర ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ల ద్వారా నెలా నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం మంచి మదుపు వ్యూహం. ఇలా చూస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. నేను ప్రతినెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. డైరెక్ట్ ప్లాన్ ను ఎంచుకోవాలా? రెగ్యులర్ ప్లాన్ ను ఎంచుకోవాలా? –భార్గవి, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం డైరెక్ట్ ప్లాన్ ను ఎంచుకోవాలా ? రెగ్యులర్ ప్లాన్ ను ఎంచుకోవాలా అనేది పూర్తిగా మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీకు మ్యూచువల్ ఫండ్స్, వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి అవగాహన లేకపోతే, సలహాదారును గానీ, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్‌ను గానీ సంప్రదించండి. రెగ్యులర్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని వాళ్లు సలహా ఇస్తారు. మీకు మ్యూచువల్ ఫండ్స్‌పై అవగాహన వుండి, ఆన్ లైన్ లో ఇన్వెస్ట్ చేయగలిగేటట్లుగా ఉంటే, ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని, సదరు ఫండ్‌కు సంబంధించిన డైరెక్ట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయండి. రెగ్యులర్ ప్లాన్లతో పోల్చితే, డైరెక్ట్ ప్లాన్లలో వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా రెగ్యులర్ ప్లాన్ల కంటే డైరెక్ట్ ప్లాన్ ల్లో రాబడులు ఒకింత అధికంగా ఉంటాయి. నేను గత రెండేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ అనుభవంతో సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అలాగే విదేశీ కంపెనీల షేర్లున్న ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా ? –శ్రీధర్, హైదరాబాద్ సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలాంటి ఉపయోగం లేని పని అని నేను అనుకుంటున్నాను. ఒక్క కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయడం కాకుండా, విభిన్న రంగాలకు చెందిన వివిధ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ ? ప్రయోజనాలు లభిస్తాయి. ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలుంటాయి కాబట్టి, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేష¯Œ ప్రయోజనాలు పొందవచ్చు. ఫండ్‌లో ఒక రంగానికి చెందిన షేర్లను పెంచడం, తగ్గించడం వంటి అంశాలను ఆ ఫండ్‌ను నిర్వహించే ఫండ్ మేనేజర్ చూస్తాడు. భవిష్యత్తులో మంచి రాబడులు లక్ష్యంగా ఫండ్ మేనేజర్లు నిరంతరం ఈ కసరత్తు చేస్తూ ఉంటారు. సెక్టోరియల్ ఫండ్స్‌కు ఈ ప్రయోజనాలేమీ లభించవు. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో అంతా ఒకే రంగానికి చెందిన కంపెనీలతో నిండి ఉంటుంది. అన్ని రంగాలు.... ఫార్మా, బ్యాంక్, వాహన... ఇలా ప్రతీ రంగం చక్రీయంగా ఉంటుంది. అంటే ఒక సమయంలో ఉచ్ఛస్థితిలో ఉన్న ఈ రంగం మరో సమయంలో పాతాళానికి పడిపోతుంది. దీనికనుగుణంగానే సెక్టోరియల్ ఫండ్స్ పనితీరు కూడా ఉంటుంది. ఒకప్పుడు మంచి రాబడులు ఇచ్చినా, మరొకసారి భారీ నష్టాలూ ఇవ్వొచ్చు. ఒక రంగం ఎప్పుడు బాగా ఉంటుందో, ఎప్పుడు అధ్వానంగా ఉంటుందో, సామాన్య ఇన్వెస్టరే కాకుండే కొమ్ములు తిరిగిన ఫండ్ మేనేజర్ కూడా సరిగ్గా అంచనా వేయలేడు. ఉదాహరణకు ఫార్మా ఫండ్స్ మంచి పనితీరు చూపిస్తాయని ఆశిస్తే, అత్యంత అధ్వాన పనితీరు ఉన్న ఫండ్స్‌గా అవి అవతరించాయి. వీటన్నింటి దృష్ట్యా సెక్టోరియల్ ఫండ్స్‌కు దూరంగానే ఉంటే మంచిది. ఇక విదేశీ కంపెనీల షేర్లున్న ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి ఆలోచనే. ఇలాంటి ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డైవర్సిఫికేష¯Œ ప్రయోజనాలు బాగా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న గూగుల్, అమెజాన్ , యాపిల్ వంటి షేర్లలో ఇన్వెస్ట్ చేసే అవకాశమూ మీకు లభిస్తుంది. కొన్ని దేశీయ ఫండ్స్ తమ నిధుల్లో 35 శాతం మేర విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంతే కాకుండా పలు భారత మ్యూచువల్ ఫండ్ సంస్థలు అమెరికా–డొమిసెల్ ఫండ్స్‌ను విక్రయిస్తున్నాయి. మీరు నాస్డాక్ ఫండ్, యూఎస్ ఆపర్చునిటీ ఫండ్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
డెట్ ఫండా? ఈక్విటీ ఫండా? దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి?
నా వయస్సు 52 సంవత్సరాలు. నా ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) ఖాతా త్వరలో మెచ్యూర్ కానున్నది. రూ. 20 లక్షల వరకూ నగదు వస్తుంది. ఇప్పట్లో నాకు ఈ డబ్బులు అవసరం లేదు. పీపీఎఫ్ ఖాతా గడవును పొడిగించమంటారా ? లేక ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సలహా ఇవ్వండి. – ఆనందరావు, విశాఖపట్టణం మీరు ఈ పీపీఎఫ్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పీపీఎఫ్‌లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు మరింత అధికంగా రాబడులు వచ్చేవి. భవిష్యత్తులో పీపీఎఫ్ వడ్డీరేట్లు మరింతగా తగ్గుతాయి. అందుకని పీపీఎఫ్ ఖాతాను పొడిగించకపోవడమే మంచిది. మీకు ఐదు, అంతకు మించిన సంవత్సరాలకు ఈ డబ్బులు అవసరం లేకపోతే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. అయితే స్వల్పకాలంలో మాత్రం మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానాన్ని అనుసరించండి. ఒకటి లేదా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మీ పీపీఎఫ్ మొత్తాన్ని మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని, ఈ మొత్తాలను ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా ? ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా ? దేనిని ఎంచుకోవాలి? – ప్రశాంతి, హైదరాబాద్ మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు? మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అనే అంశాలను ఆధారంగా ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి. డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్... ఇవి రెండూ వేర్వేరు ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఉద్దేశించినవి. సాధారణంగా స్వల్పకాలిక అవసరాల కోసం డెట్ ఫండ్స్‌ను, దీర్ఘకాలిక అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. ఉదాహరణకు ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లలను పెద్ద చదువులు చదివించడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, నిలకడైన రాబడులు వస్తాయి. కానీ వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. వీటిల్లో నష్టభయం తక్కువగా ఉంటుంది. రాబడులు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి స్వల్పకాలిక పెట్టుబడి అవసరాల కోసం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మరో వైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు అధికంగా వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి స్వల్పకాలంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ ఫండ్స్‌లో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లో ఎదురయ్యే ఒడిదుడుకులను సిప్ల ద్వారా అధిగమించవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొనడమే కాకుండా, దీర్ఘకాలంలో మంచి రాబడులు కూడా పొందవచ్చు. మీరు మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా ఒకటి లేదా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ కార్పస్‌లో 65 శాతాన్ని ఈక్విటీలోనూ, మిగిలిన దానిని డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో సిప్ విధానంలో రెండు, మూడేళ్లు ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయమై మీకు కొంత అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో రెండు, లేదా మూడు మంచి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని, వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. మార్కెట్ బాగా పెరిగినా, లేదా బాగా పతనమైనా సిప్‌లను ఆపేయక, కొనసాగించండి. మీ జీతం పెరిగినప్పుడల్లా, సిప్ మొత్తాన్ని పెంచడం మరువకండి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సురక్షితమేనా ? వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – రవి, నెల్లూరు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌పై తీవ్రంగానే ఉంటుంది. అందుకని స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సురక్షితమైనవేనని చెప్పలేము. మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఇవి మంచి రాబడులను ఇస్తాయి. మార్కెట్ పతనమైనప్పుడు భారీగా నష్టపోతాయి. ఈ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో రిస్క్ అధికంగా ఉంటుంది. అధిక రిస్క్ ఉన్నట్లే, అధిక రాబడులూ వచ్చే అవకాశాలుంటాయి. మీరు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నా, రిస్క్ భరించడానికి సిద్ధంగా లేకున్నా ఈ ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. మీ వయస్సు 30 లోపు ఉండి, రిస్క్ భరించగలిగే సామర్థ్యం ఉందనుకుంటే, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఒక ఇన్వెస్టర్ తాను ఇన్వెస్ట్ చేసే మొత్తంలో 20–30 శాతం మాత్రమే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు కేటాయించాలి. అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?
మార్కెట్లో వందలాది మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలో తెలియడం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏ తరహా ఫండ్‌ను ఎందుకు ఎంచుకోవాలో వివరించండి ? –భరత్, విశాఖపట్టణం భారత్‌లో దాదాపు 4 వేలకు పైగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లున్నాయి. వీటిల్లో చాలా ఫండ్స్ స్కీమ్‌ల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనే అంశం ముఖ్యంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి సంబంధించింది. వివిధ రకాలైన ఇన్వెస్టర్ల కోసం పలు రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. అధిక రిస్క్ భరించేవారికి హై గ్రోత్–హై రిస్క్ ఈక్విటీ ఫండ్స్ ఉండగా, రిస్క్ తక్కువతీసుకోవాలనుకున్నవారు డెట్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఇక రెండవది ఇన్వెస్ట్ చేసే సమయం... మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారనేది మరో ముఖ్య విషయం. ఐదేళ్లు అంతకు మించి ఇన్వెస్ట్ చేసేవారికి ఈక్విటీ ఫండ్స్ సబబుగా ఉంటాయి. స్వల్పకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి డెట్ ఫండ్స్ సరైనవి. ఇక మూడో ముఖ్యమైన అంశం ఏ తరహా ఫండ్‌ను ఎంచుకోవాలి అనేది. మీరు ఎంచుకునే ఫండ్ లార్జ్, లేదా స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుందా ?భారత లేదా విదేశీ కంపెనీల్లో మదుపు చేస్తుందా? అనే విషయం పరిశీలించాలి. ఈ మూడు ముఖ్యమైన విషయాలే కాకుండా మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఫండ్‌కు మేనేజర్‌గా వ్యవహరించే వ్యక్తి ఎంత కాలం నుంచి ఆ ఫండ్‌ను నిర్వహిస్తున్నారు? పోటీ ఫండ్స్‌తో పోల్చితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఫండ్ పనితీరు ఎలా ఉంది ? మీరు పన్ను పరిధిలోకి వస్తారా ? వస్తే ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారు ? మీ ఇతర ఇన్వెస్ట్మెంట్స్, మీ సంపాదన, మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నేను కొంత మొత్తాన్ని 15–20 ఏళ్ల తర్వాత నా కానుకగా నా కూతురికి ఇవ్వాలనుకుంటున్నాను. నిలకడగా, మంచి పనితీరు కనబరిచే ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ఆ మొత్తాన్ని ఇవ్వాలనేది నా ఆలోచన. నా ఆలోచనకు అనుగుణమైన ఒక ఫండ్‌ను సూచించండి. –రాధిక, విజయవాడ మీరు దీర్ఘకాలం పాటు అంటే 15–20 ఏళ్ల తర్వాత కొంత మొత్తాన్ని బహుమతిగా మీ కూతురికి ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ పనితీరు ఎలా ఉంటుందోనని మీరు నిరంతరం గమనించాల్సిన అవసరం ఉండకూడదు. మార్కెట్ పెరుగుతున్నప్పుడైనా, లేదా మార్కెట్ పడిపోతున్నప్పుడైనా, లేదా పరిమిత శ్రేణిలో కదలాడుతున్నçప్పుడైనా, నిలకడగా వృద్ధి చెందే ఫండ్ మీకు అవసరం. ఇలాంటి అంశాలన్నింటి దృష్ట్యా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎంచుకోవడానికి మూడు ఫండ్స్ సూచిస్తున్నాం... ఐసీఐసీఐ డైనమిక్ ఈక్విటీ ఫండ్, క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, పరాగ్ పరేఖ్ లాంగ్ టర్మ్ఈక్విటీ ఫండ్.. ఈ మూడు ఫండ్స్‌లో మీరు ఏదైనా ఒక ఫండ్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయవచ్చు. నా వయస్సు 52 సంవత్సరాలు. నా పీపీఎఫ్ ఖాతాలో రూ.20 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం త్వరలో మెచ్యూర్ కాబోతోంది. ప్రస్తుతానికైతే నాకు ఈ డబ్బులు అవసరం లేదు. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? నాకు తగిన సూచనలివ్వండి. –హుస్సేన్, హైదరాబాద్ మీరు నిరభ్యంతరంగా ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టవచ్చు. అసలు పీపీఎఫ్‌లో కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు మరింతగా రాబడులు వచ్చి ఉండేవి. పీపీఎఫ్ వడ్డీరేట్లు భవిష్యత్తులో మరింతగా తగ్గవచ్చు. పీపీఎఫ్ డబ్బులు మీకు మరో ఐదు, అంతకు మించిన కాలానికి అవసరం లేకపోతే, ఈ డబ్బులను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. స్వల్పకాలంలో ఒకింత ఒడిదుడుకులున్నా, స్టాక్ మార్కెట్ నుంచి మీకు దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందుతారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా, రిస్క్ అని మీరు భావించినా, ఈ సొమ్ములను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయ వచ్చు. ఏదైనా 1–2 రెండు బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మీ పీపీఎఫ్ మొత్తాన్ని మూడేళ్ల కాలంలో నెలకు ఇంత చొప్పున ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి రాబడులు రావడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు. ఊరిలో పొలం అమ్మగా పెద్ద మొత్తమే నా చేతికొచ్చింది. ఈ మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎంత కాలంలో ఎస్టీపీ ద్వారా హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? –రమేశ్, కరీంనగర్ ఎస్టీపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలనే విషయానికి సా«ధారణæ సూత్రాలేమీ లేవు. చిన్న మొత్తాలైతే తక్కువ కాలం తీసుకోవాలి. భారీ మొత్తాలైతే దీర్ఘకాలం ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ దీర్ఘకాలం అంటే గరిష్టంగా మూడేళ్లు అని అర్థం చేసుకోవాలి. మూడేళ్లు ఎందుకంటే, మార్కెట్ సైకిల్ సాధారణంగా మూడేళ్లు ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనాలు పొందవచ్చు. మూడేళ్లకు మించి ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. మీ ఇన్వెస్ట్మెంట్స్ తగిన రాబడులు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనం ఇన్వెస్ట్‌చేసే మొత్తాన్ని బట్టే ఎస్టీపీ కాలాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు ఏడాదికొకసారి బోనస్ వస్తుందనుకుందాం. ఈ బోనస్‌ను మూడు నుంచి ఆరు నెలల కాలంలో ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఇక ఎంత పెద్ద మొత్తమైనా మూడేళ్లకు మించి ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే ఉత్తమం. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
బ్యాంక్ ఎఫ్‌డీయా? డెట్ ఫండా?
నేను ప్రస్తుతం క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవలే నిఫ్టీ బిఈఈఎస్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తున్నాను. ఇది మంచి రాబడినే ఇస్తోంది. ఈ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటా రా? సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్, బీఎన్పీ పారిబస్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌ల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ రెండు ఒకే ఫండ్ హౌస్‌కు చెందినవా? - జానకి, అమలాపురం ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత రాబడి పొందవచ్చో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిఫ్టీ ఇండెక్స్‌ను పూర్తిగా ప్రతిబింబించే నిఫ్టీ బీఈఈఎస్ ఈటీఎఫ్ -నిఫ్టీ లాగానే రాబడులందిస్తోంది. అంతేకాకుండా భారత్‌లో అత్యంత తక్కువ వ్యయాలున్న ఫండ్ కూడా ఇదే. దీని ఎక్స్పెన్స్ రేషియో 0.5 శాతంగా ఉంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్ సరైనది కాదని చెప్పవచ్చు. పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నిఫ్టీ కంటే డైవర్సిఫైడ్ ఫండ్లు ఉత్తమమని చెప్పవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మూడు ఫండ్స్- క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ డైనమిక్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీలు దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి ఫండ్స్ అని పేర్కొనవచ్చు. ఇక బీఎన్పీ పారిబస్, సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్‌లు ఒకే కంపెనీకి చెందిన ఫండ్స్ కావు. బీఎన్పీ పారిబస్, సుందరం సంస్థలు గతంలో జాయింట్ వెంచర్‌ను నిర్వహించాయి. కొన్నేళ్ల కితం ఈ జాయింట్ వెంచర్‌ను ఈ రెండు సంస్థలు రద్దు చేసుకున్నాయి. ఇవి రెండు విభిన్నమైన ఫండ్లు. మంచి రాబడులనే ఇస్తున్నాయి. డెట్ ఫండ్స్ గురించి వివరించండి. వీటికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకు తేడా ఏమిటి? - రమేశ్, జగిత్యాల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో గ్యారంటీ రాబడులు వస్తాయి. ఎంత రాబడులు వస్తాయో ముందే తెలుస్తుంది. మరోవైపు డెట్ ఫండ్స్‌ల్లో రాబడులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే ఎక్కువ రావచ్చు. లేదా తక్కువ రావచ్చు. అయితే ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా తేడా బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా స్వల్పంగానే ఉంటుంది. డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు. వివిధ రకాల డెట్‌ఫండ్స్ విషయానికొస్తే, లిక్విడ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నష్టాలు రావడమనేది చాలా అరుదు. అయితే బాండ్ ఫండ్స్‌ల్లో మాత్రం వడ్డీరేట్లు పెరిగితే బాండ్ ఫండ్స్ విలువ తగ్గుతుంది. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్ విషయానికొస్తే, ఈ ఫండ్ వల్ల మీకు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ విషయానికొస్తే, దీనిపై వచ్చే వడ్డీ మీ ఆదాయానికి కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలానికి మించి కొనసాగిస్తే, వాటిపై వచ్చే రాబడులను క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. నేను నెలకు రూ.10,000 మొత్తాన్ని 10-15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఏడాదికి ఎల్ఐసీ జీవన్ ఆనంద్ కింద రూ.42,000, పీపీఎఫ్ కింద రూ.10,000 చొప్పున చెల్లిస్తున్నాను. రెలిగేర్ నుంచి రూ.50 లక్షల టెర్మ్ప్లాన్ను తీసుకున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి తగిన ఫండ్స్ సూచించండి? - జాన్ పాషా, నిజామాబాద్ మీ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏమంటే, ఒక అత్యవసర ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడం. ఏ సమయంలోనైనా వెంటనే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకునేలా ఈ ఫండ్ ఉండాలి. ఇది కాకుండా, ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇక టెర్మ్ ప్లాన్‌ను కొనసాగించండి. ఎల్ఐసీ జీవన్ ఆనంద్, పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, 10-15 కాలానికి ఏదైనా ఒకటే. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ అనేది యులిప్(యూ నిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్). బీమా లేదా ఇన్వెస్ట్మెంట్ పూర్తి ప్రయోజనాలను ఇది ఇవ్వలేదని చెప్పవచ్చు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు పీపీఎఫ్ కూడా సరైనది కాదని నేను భావిస్తున్నాను. మరోవైపు ఏవైనా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. మ్యూచువల్ ఫండ్స్‌పై మీకు సరైన అవగాహన వచ్చాకే పూర్తి స్థాయి ఈక్విటీ ఫండ్స్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లించండి. మీరు ఎంచుకోవడానికి ఉన్న కొన్ని ఆప్షన్లలో టాటా బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాండేజ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించండి. -
హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
హెచ్ఎస్బీసీ ఫ్లెక్సి డెట్ గ్రోత్ ఫండ్‌లో ఆర్నెల్ల క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. వేరే ఫండ్‌కు మారిపోవడం మంచిదా? దీంట్లోనే కొనసాగమంటారా? - ఆంజనేయులు, నరసాపురం మరీ దీర్ఘకాలానికి కాకుండా, మరీ స్వల్పకాలానికి కాకుండా కొంత కాలం పెట్టుబడులకు మాత్రమే డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి. జూన్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించడంతో ఈ ఫండ్స్‌పై ప్రభావం పడింది. రానున్న రెండేళ్లలో ఈ ఫండ్ పనితీరు బాగా ఉంటుంది. అప్పటివరకూ ఓపిక పట్టగలిగితే ఈ ఫండ్‌లోనే కొనసాగండి. అప్పటి వరకూ వేచి ఉండే వెసులుబాటు లేకపోతే, ఈ ఫండ్ నుంచి మీ పెట్టుబడులను ఉపసంహరించి, మీరు ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ కాల పరిమితి ఉన్న డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ), లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్-టెర్మ్ ఫండ్స్, ఇతర షార్ట్‌టెర్మ్ ఫండ్లను కూడా పరిశీలించవచ్చు. డాబర్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి అవైవా సంస్థ వైదొలగాలని యోచిస్తున్నట్లు వార్త చదివాను. ఈ జేవీ నుంచి నేను అవైవా ఐ-లైఫ్ టెర్మ్ బీమా పాలసీ తీసుకున్నాను. వచ్చే నెలలో ఈ పాలసీని రెన్యూవల్ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ పాలసీని రెన్యూవల్ చేయమంటారా? లేక వేరే కంపెనీకి మారిపోమ్మంటారా? - శశికళ, నెల్లూరు భారత్‌కు చెందిన డాబర్ ఇండియా గ్రూప్, ఇంగ్లాండ్‌కు చెందిన అవైవా పీఎల్సీలు కలిసి అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో అవైవాకు 26 శాతం వాటా ఉంది. ఈ జేవీ నుంచి అవైవా వైదొలుగుతున్న వార్తల పట్ల మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. గతంలో కూడా కొన్ని విదేశీ కంపెనీలు దేశీయ కంపెనీలతో ఏర్పాటు చేసిన జేవీల నుంచి వైదొలిగాయి. ఇలా వైదొలిగేటప్పుడు తమ వాటా ను ఇతర కంపెనీకో లేక జేవీలోని ఇతర భాగస్వామికో విక్రయించేవి. అందువల్ల మీ పాల సీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మీ పాలసీ ఇంతకు ముందున్నట్లుగానే ఇప్పుడు కూడా ఉంటుంది. నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులుండవు. ఎలాంటి ఆందోళన చెందకుండా మీ పాలసీని రెన్యూవల్ చేయించండి. మీరు కొత్త పాలసీ తీసుకోవలసిన అవసరం లేదు. ఇటీవల మార్కెట్లోకి చాలా క్లోజ్డ్-ఎండ్ హైబ్రీడ్ ఫండ్స్ వచ్చాయి. వీటిల్లో అధిక భాగం రుణ పత్రాల్లోనూ, స్వల్పమొత్తంలో ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - శేఖర్, విజయవాడ ఇలాంటి ఫండ్స్‌ల్లో ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్యాపిటల్ ప్రొటెక్షన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టిపుల్ ఈల్డ్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుంది. ఈ ఫండ్స్ ఇప్పుడు ఓపెన్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయనివారికి, ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ ఫండ్స్ అనుకూలం. ఈ ఫండ్స్‌లో అధిక భాగం స్థిర ఆదాయం వచ్చే సాధనాల్లో, 30-35 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వస్తున్నప్పటికీ, మీరు పొందే రాబడులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ), షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్స్ కొంచెం మెరుగు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని దానికి దీటుగా రాబడిని ఇవ్వలేవు. మీరు పేర్కొన్న హైబ్రీడ్ ఫండ్స్ 30 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి స్థిర ఆదాయ సాధనాల కంటే మెరుగైన రాబడి వస్తుందని చెప్పవచ్చు. ఓపెన్ ఎండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి రోజూ ఎన్ఏవీ ఎంత ఉంటుందో అని ఆందోళన చెందాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్దేశిత కాలపరిమితి ఉన్న క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్‌లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఆ కాలపరిమితి తీరిన తర్వాతే ఆ ఫండ్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా మెరుగైన రాబడినే ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఇస్తున్నాయి. అందుకని తొలిసారిగా ఇన్వెస్ట్ చేసేవారికి ఇలాంటి ఫండ్స్ ఉత్తమం. ఇవి క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ కనుక క్రమం తప్పకుండా(నెలకొకసారి/రెండు నెలలకొకసారి కొంత కొంత మొత్తాల్లో) ఇన్వెస్ట్ చేసేవారికి ఈ ఫండ్స్ అనుకూలం కాదు. నేను బజాజ్ యూనిట్ గెయిన్ టూ, హెచ్డీఎఫ్సీ యంగ్స్టర్ల్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ రెండు యులిప్స్లకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్లున్నాయి. రైడర్లను కొనసాగించమంటారా? వద్దంటారా? - క్రిష్టోఫర్, సికింద్రాబాద్ రైడర్లను కొనసాగించాలో, వద్దో అనేది పాలసీదారు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మీరు రైడర్లు వద్దనుకుంటే, ఒక దరఖాస్తును నింపి సదరు బీమా సంస్థకు సమర్పించాలి. రైడర్ నుంచి ఒకసారి వైదొలిగితే, భవిష్యత్తులో దానిని పునరుద్ధరించే వీలు లేదన్న విషయాన్ని మాత్రం మరువకండి. ధీరేంద్ర కుమార్ సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
డెట్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లలాంటివేనా?
డెట్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లలాంటివేనా? ఎఫ్ఐఐల నిధుల కారణంగా అవి ఒడిదుడుకులకు గురవుతాయా? డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? - జాన్సన్, సికింద్రాబాద్ ఒడిదుడుకులున్నప్పటికీ, ఓ మేరకు డెట్‌ఫండ్స్ సురక్షితమైనవేనని చెప్పవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే ఇవి కొంచెం భద్రమైనవే. అయితే నష్టభయం పూర్తిగా లేదని చెప్పడానికి లేదు. డెట్‌ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు - ఇవి రెండూ ఒకలాంటివేనని, డెట్‌ఫండ్స్‌లో పెట్టిన తమ పెట్టుబడులు క్షీణించే అవకాశాల్లేవని చాలా మంది ఇన్వెస్టర్లు పొరబడుతూ ఉంటారు. వడ్డీరేట్లు పెరిగితే డెట్ ఫండ్స్ విలువ తగ్గిపోతుంది. డెట్ ఫండ్స్‌లో నష్ట భయాన్ని తగ్గించుకునే మార్గాలున్నాయి. ఇన్వెస్ట్మెంట్ టైమ్‌ఫ్రేమ్‌ను కచ్చితంగా నిర్దేశించుకోవాలి. ఈ టైమ్‌ఫ్రేమ్ 3 నెలలు/6 నెలలు/2 సంవత్సరాలు.... ఇలా ఏదైనా నిర్దిష్టమైన కాలపరిమితిని నిర్దేశించుకోవాలి. దీనికి తగ్గట్టుగా సరైన ఫండ్‌ను ఎంచుకుంటే మరీ నిరాశచెందేస్థాయిలో రాబడులు ఉండవు. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు చేసే పొరపాటేమిటంటే స్వల్పకాలానికి అవసరమయ్యే పెట్టుబడులను దీర్ఘకాలిక డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి సహజంగానే స్వల్పకాలంలో ఒడిదుడుకులకు లోనవుతాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు ఆశించిన రాబడులు రావు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) భారీ మొత్తాల్లో డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. వారి అవసరాలను బట్టి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. దీంతో ఒడిదుడుకులు తప్పవు. పెట్టుబడులను డైవర్సిఫై చేయమని మీరు తరచుగా సలహాలిస్తుంటారు కదా. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం మిడ్-క్యాప్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయమంటారా? లేక మల్టీ-క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? - పరమేశ్వర్, కాకినాడ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేయడానికి చాలా మార్గాలున్నాయి. వివిధ రకాలైన డెవర్సిఫైడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. లేదా వివిధ సెగ్మెంట్లకు సంబంధించిన ఫం డ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఏ మార్గాన్ని ఎన్నుకోవాలనేది మీ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మార్కెట్ల రోజువారీ ఒడిదుడుకుల కారణంగా మీరు అశాంతికి గురవుతున్నట్లయితే డైవర్సిఫైడ్ ఫండ్స్‌కు సంబంధించి వాల్యూ రీసెర్చ్ సూచించే లార్జ్, మిడ్‌క్యాప్, మల్టీ క్యాప్ ఈక్విటీ ఫం డ్స్‌లో పెట్టుబడులు పెట్టండి. మరో మార్గమేమిటంటే అధిక పనితీరు ఉన్న ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం. మీకు అనువైనది ఎంచుకోండి. బిర్లా సన్ లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్‌కు 2 స్టార్స్ రేటింగ్‌ని ఇచ్చారు. ఒడిదుడుకుల మార్కెట్లో మిడ్ క్యాప్ ఫండ్ పనితీరును బట్టి ఆ ఫండ్‌ను అంచనా వేయవచ్చని మీరు చెబుతుంటారు. గత ఏడాది కాలం నుంచి మన మార్కెట్లు ఒడిదుడుకులమయంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ పనితీరును ఎలా అంచనా వేస్తారు? - ముంతాజ్, ఖమ్మం ఓవరాల్‌గా చూస్తే బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ పనితీరు పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. అయితే ఈ కేటగిరి ఫండ్స్‌తో పోల్చితే మాత్రం, ఈ ఫండ్ తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పవచ్చు. ఒక మిడ్ క్యాప్ ఫండ్‌ను నిర్వహించే మేనేజర్ ఆ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక్కో ఫండ్ మేనేజర్ ఒక్కో విధంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా వివిధ ఫండ్స్ మేనేజర్లు వివిధ రకాలైన స్టాక్స్‌ను ఎంచుకోవడం వల్ల ఈ ఫండ్స్ పనితీరు వేర్వేరుగా ఉంటుంది. మరోవైపు ఈ కేటగిరి ఫండ్స్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఫండ్ ఇచ్చే రాబడికి, అధ్వాన పనితీరు కనబరిచిన ఫండ్ ఇచ్చే రాబడికి తేడా పెద్దగా ఉండదు. ఎంచుకోవడానికి లార్జ్‌క్యాప్ స్టాక్స్ తక్కువగా ఉండడమే దీనికి కారణం. బిర్లా సన్‌లైఫ్ మిడ్-క్యాప్ ఫండ్ 2009లో 120 శాతం రాబడులనిచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ కేటగిరి ఫండ్స్ సగటు రాబడిని కూడా అందించలేకపోయింది. గత 3-4 ఏళ్లలో చెప్పుకోదగిన రాబడులనిచ్చిన ఫండ్స్ కొన్ని లేకపోలేదు. -ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్