మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయం చేసే సమయంలో నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) పదం వినిపిస్తుంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ ధరగా కొందరు భావిస్తుంటారు. దీంతో ఎన్‌ఏవీ తక్కువ ఉంటే అది ఇతర పథకాలతో పోలిస్తే చౌక అని భావిస్తుంటారు. అంటే ఎన్‌ఏవీ తక్కువగా ఉన్న పథకాన్ని ఎంచుకోవాలని అర్థమా? కాదు. మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎన్‌ఏవీని పరిగణనలోకి తీసుకోవద్దన్నది మా సూచన.
ఒక పథకం ఎన్‌ఏవీ తక్కువగా ఉంటే.. దాన్ని చౌకగా భావించొచ్చా..? పెట్టుబడులకు ఆకర్షణీయంగా తీసుకోవచ్చా? -జగదీశ్వర్
మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయం చేసే సమయంలో నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) పదం వినిపిస్తుంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ ధరగా కొందరు భావిస్తుంటారు. దీంతో ఎన్‌ఏవీ తక్కువ ఉంటే అది ఇతర పథకాలతో పోలిస్తే చౌక అని భావిస్తుంటారు. అంటే ఎన్‌ఏవీ తక్కువగా ఉన్న పథకాన్ని ఎంచుకోవాలని అర్థమా? కాదు. మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎన్‌ఏవీని పరిగణనలోకి తీసుకోవద్దన్నది మా సూచన.
ఎన్‌ఏవీ అంటే?
ఒక మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియో (పెట్టుబడులు) మార్కెట్ విలువను మొత్తం యూనిట్లతో భాగించగా వచ్చేదే ఎన్‌ఏవీ. ఒక పథకానికి సంబంధించి ఒక యూనిట్ విలువను ఇది చెబుతుంది. ఒక కంపెనీ షేరు మాదిరే, ఒక పథకం యూనిట్ అని అనుకోవచ్చు. ఒక యూనిట్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో ఇది తెలియజేస్తుంది. అలాగే, ఒక యూనిట్‌ను విక్రయిస్తే ఎంత వస్తుందో చెప్పడానికి ప్రామాణికమే ఎన్‌ఏవీ.
ఎన్‌ఏవీ ధర
ఎన్‌ఏవీ విలువను చూసి ధరగా భావించొద్దు. తులం బంగారం కొనుగోలు చేద్దామని జ్యుయలరీ షాపునకు వెళ్లారని అనుకుందాం. 10 గ్రాములు రూ.50వేలు ఉంది. వెండి తులం ధర రూ.600. దీంతో చౌకగా వస్తుందని వెండిని కొనుగోలు చేసుకుని వెళతారా? ఒకవేళ కొనుగోలు చేసినా అది బంగారం కాదు. బంగారానికి ఉన్న విలువ రాదు. ఈ రెండింటి ధరలను పోల్చడానికి లేదు. అలాగే, రెండు పథకాల ఎన్‌ఏవీ కూడా అంతే. ఒక పథకం ఎన్‌ఏవీ చౌకగా ఉందని దాన్ని కొనుగోలు చేస్తామంటే అది సరి కాదు. ఎన్‌ఏవీ తక్కువగా ఉన్నది మెరుగైన పథకం కావాలని లేదు.
ఒక పథకం నిర్వహణలోని పెట్టుబడుల మార్కెట్ విలువ మారినప్పుడు, తాజా పెట్టుబడులు, అదే పథకంనుంచి ఇన్వెస్టర్లు ఉప సంహరించుకున్న మొత్తం ఇవన్నీ కూడా పరిగణనలోకి వచ్చే అంశాలే. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే ఫండ్ ఎన్‌ఏవీ రూ.10 ఉంది. వై అనే ఫండ్ ఎన్‌ఏవీ రూ.50 ఉంది. ఏడాది కాలంలో ఈ రెండు పథకాలు ఒకే విధంగా 25 శాతం రాబడి ఇచ్చాయని అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఫండ్ ఎన్‌ఏవీ రూ.10 నుంచి రూ.12.50 అవుతుంది. వై ఫండ్ ఎన్‌ఏవీ రూ.50 నుంచి రూ.62.50 అవుతుంది. ఆయా పథకాల పెట్టుబడులపై వచ్చిన రాబడి ఆధారంగా ఎన్‌ఏవీలో మార్పులు ఉంటాయి. అంతేకానీ, ఎన్‌ఏవీ తక్కువగా ఉంటే చౌక, ఆకర్షణీయమని అనుకోవద్దు.
వ్యయాలను మినహాయించిన తర్వాతే పనితీరు చూస్తారా? -విణదమ్
వ్యాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఫండ్స్ పనితీరును వాటి ఎన్‌ఏవీలో వృద్ధి ఆధారంగా లెక్కిస్తుంటాం. వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎన్‌ఏవీపై నిర్ణయానికి వస్తాం. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల విలువను, మొత్తం యూనిట్లతో భాగించగా ఎన్‌ఏవీ వస్తుందని తెలుసుకదా. ఇక్కడ పథకానికి సంబంధించి అన్ని వ్యయాలను, నిర్వహణ ఫీజులను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. అప్పుడు నికర విలువ వస్తుంది. ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ మార్కెట్ ముగిసిన తర్వాత పెట్టుబడుల విలువ ఆధారంగా, వ్యయాలను మినహాయించి పథకాల ఎన్‌ఏవీలను ఖరారు చేస్తుంటుంది. ఆయా ఫండ్ పథకాలు రోజువారీగా ప్రకటించే ఎన్‌ఏవీల ఆధా రంగానే మ్యూచువల్ ఫండ్ పథకం రాబడులను లెక్కిస్తుంటాం.
ఉదాహరణకు ఒక పథకం ఎన్‌ఏవీ రూ.12 ఉందనుకుంటే, ఏడాది క్రితం ఇదే పథకం ఎన్‌ఏవీ రూ.10గా ఉంటే, ఏడాదిలో 20 శాతం రాబడులను ఇచ్చినట్టు. ఒకవేళ ఎన్‌ఏవీ రూ.12 నుంచి రూ.10కు తగ్గితే అప్పుడు 20 శాతం నష్టాలను ఇచ్చినట్టు. ఏడాదికాలానికి మించి రాబడులను చూసే సమయంలో కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్)
Comments
Please login to add a commentAdd a comment