ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున షార్ట్ డ్యురేషన్ ఫండ్ కంటే బంగారం మెరుగైనదా? బంగారం ధరలు ఎలా ఉండొచ్చు?
– రాజేంద్రన్
వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో బంగారం స్థిరంగా ఉండడమే కాకుండా, రాబడినిస్తుంది. అని శ్చిత పరిస్థితుల్లో ఇది సురక్షిత సాధనం. అయితే, ఇది సిద్ధాంతం మాత్రమే. వాస్తవం ఏమిటంటే బంగారం ఎంతో అస్థిరతలతో కూడుకున్నదని నిరూపితమైంది. ఎన్నో కారణాలు ఈ అస్థిరతలకు దోహదం చేస్తుంటాయి. ఇందులో ఒకటి డిమాండ్–సరఫరా. ఇది ధరలను నిర్ణయిస్తుంటుంది. పైగా బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ఒక టి. గతేడాది గణనీయంగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. భారత్‌లో బంగారం అతిపెద్ద దిగు మతి ఉత్పత్తిగా మారిపోయింది. ఇది ప్రభుత్వానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అనుత్పా దక సాధనం కనుక బంగారాన్ని పెట్టుబడి సాధనంగా ప్రభుత్వం నిరుత్సాహపరచొచ్చు. మనం షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తే ఫ్యాక్టరీలు, పరిశ్రమ, సేవల కంపెనీల యాజమాన్యంలో వాటా లభిస్తుంది. కానీ, బంగారాన్ని కొనుగోలు చేస్తే తీసుకెళ్లి లాకర్‌లో పెట్టేస్తాం. దాంతో అది ఉత్పాదకతలోకి రాదు. కనుక ప్రభుత్వం దీన్ని పెట్టుబడి కోణంలో నిరుత్సాహపరచొచ్చు. ఈ పరిస్థితులు బంగారంలో అస్థిరతలకు దారితీస్తాయి. అందుకనే స్వల్ప కాలం కోసం అల్ట్రా షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పెరుగుతున్న వడ్డీ రేట్ల సైకిల్‌ను అధిమించడానికి ఇదే మెరుగైన మార్గం అవుతుంది.
అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా?
– కపిల్
వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించడం అన్నది ఆర్ట్, సైన్స్‌తో కూడుకున్నది. డిస్కౌంటింగ్ సూత్రా న్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో గుర్తించి, ఆ మేరకు చెల్లించేందుకు ముందుకు రావడం. ఇక్కడ ఎన్నో అంశాలు లెక్కించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అనేది కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మింగేస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని కొనసాగే బలం కూడా కావాలి.
నా వద్ద రూ.12 లక్షలు ఉన్నాయి. ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మా కార్యాలయం నుంచి ఉన్న ఆంక్షల కారణంగా స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయలేను. కనుక ఈ మొత్తాన్ని ఎక్కడ, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు?
– బర్జిత్ సింగ్
ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఒకటి కాల వ్యవధి, రెండు పెట్టుబడుల పరంగా ఉన్న అనుభవం కీలకమవుతాయి. ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోతే (ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌లో సైతం) మీరు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా 65 శాతం వరకు ఈక్విట్లీలో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మూడింట ఒక వంతు డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వృద్ధిలో స్థిరత్వం ఉంటుంది. మార్కెట్ల పతనాల్లో అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరి, ఈ ఫండ్స్ మరీ అంత నష్టాలను నమోదు చేయవు. అలాగే, ఈ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడిని ఒకే విడతలో పెట్టేయకూడదు. 12 నెలల్లో సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడి వ్యయం సగటుగా మారుతుంది. కుదుపులను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఒకే విడత రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి.. ఆ తర్వాత 20% పడిపోయినా నష్టం ఎక్కువగా ఉంటుంది. దాంతో పెట్టు బడులను వెనక్కి తీసేసుకుందామన్న ఆందో ళన ఏర్పడొచ్చు. ఏడాది కాలం పాటు సిప్ రూపం లో రూ.12 లక్షలను ఇన్వెస్ట్ చేయడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment