సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని భరత్‌నగర్ దిమ్మెల వద్ద జరిగింది. వివరాల ప్రకారం..ఇందిరానగర్ గ్రామానికి చెందిన రుద్రారం శంకర్(28) అనే వ్యక్తి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం పొలం దగ్గర మోటర్ వేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.