land lease
-
యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక
సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిపటార్ గ్రామానికి చెందిన యువ కౌలు రైతు రాథోడ్ రాజు (34) వర్షాలకు పంట చేతికి రాదేమోననే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజుకు సొంత వ్యవసాయ భూమి లేకపోవడంతో గ్రామంలో 13 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగానికి పైగా పంట దెబ్బతింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం: ఈటల రాజేందర్ చేనుకు గురువారం ఉదయం వెళ్లిన రాజు దెబ్బతిన్న పంటను చూసి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య జమున వెంటనే స్థానికుల సాయంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి పిల్లలు లేరు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
లీజును రద్దు చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తామనే షరతుతో ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని.. షరతులను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుపత్రుల భూమి లీజును రద్దు చేయొచ్చని హైకోర్టు సూచించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అపోలో, బసవతారకం కేన్సర్ ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని పేదలకు ఉచితంగా వైద్యం చే యాలన్న నిబంధనను ఉల్లం ఘించాయంటూ రిటైర్డ్ ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ రెండు ఆసుపత్రుల్లో పేదలెవరికీ ఉచితంగా వైద్యం చేయడం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు నివేదించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామనే విషయాన్ని వెబ్సైట్లో కూడా పేర్కొనలేదని వివరించారు. ‘ప్రైవేటు ఆసుపత్రుల తీరు దారుణంగా ఉంది. లక్షల్లో డబ్బు లు కడితేనే శవాలను ఇస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు’అని ఈ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు అపోలో, బసవతారకం ఆ సుపత్రుల యాజమాన్యాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను 13కు వాయిదా వేసింది. అపోలో 15%, బసవతారకం 25% బెడ్లు ఇస్తామన్నాయి.. ‘జూబ్లీహిల్స్‌లో అపోలో ఆసుపత్రికి ఎకరాకు రూ.8,500 చొప్పున 30 ఎకరాలను 1985లో ప్రభుత్వం విక్రయిస్తూ జీవో జారీ చేసింది. అయితే 15 శాతం బెడ్లను పేద రోగులకు కేటాయించి వారికి ఉచితంగా వైద్యం చేయాలనే షరతు పెట్టింది. ప్రభుత్వం కేటా యించిన ఈ భూమి విలువ దాదాపు రూ.1,500 కోట్లు. గత 30 ఏళ్లుగా పేదలకు ఇక్కడ వైద్యం అందడం లేదు. ఇటు 1989లో బంజారాహిల్స్‌లో 7.35 ఎకరాలను నందమూరి బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి లీజు పద్ధతిలో ప్రభుత్వం కేటాయించింది. 1,000 బెడ్లతో అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. ఆ భూమి విలువ దాదాపు రూ.400 కోట్లు. ఆస్పత్రిలో 25 శాతం బెడ్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన ఉంది. అయినా ఎప్పుడూ పేదలకు ఉచితంగా వైద్యం అందించిన దాఖలాలు లేవు’అని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
ఐదేళ్లు..ఐదొందలకోట్లు.!
సాక్షి, నెల్లూరు: గూడూరు డివిజన్లోని సముద్రతీర ప్రాంతంలో చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల వరకు సిలికా భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా భూముల్లో ఉన్న సిలికాపై జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్‌కుమార్ కన్నేసి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మైనింగ్‌కు అనుమతులు ఉన్న యజమానుల వద్ద లీజుల పేరుతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. చిల్లకూరు మండలంలో సుమారు 60 మైన్లు, కోట మండలంలో సుమారు 11 మైన్లను లీజుకు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే కొన్నింటికి కాలపరిమితి మించిపోయి ఉండగా కొన్నింటికి ఇంకా పదేళ్ల వరకు తవ్వకాలు చేసుకునే వీలుంది. దీనిని ఆసరా చేసుకున్న అధికారపార్టీ నాయకులు లీజుదారులను ప్రలోభపెట్టి వారి మీదనే మైన్లు ఉండగా అగ్రిమెంట్లు మీద మైన్లు సొంత చేసుకున్నారు. రూ.500 కోట్ల దోపిడీ సిలికా మైన్స్ లీజు పేరుతో కొన్ని, కాలపరిమితి అయినపోయిన మరికొన్ని మైన్స్ యజమానులను అదిరించి, బెదిరించి సొంతం చేసుకున్న అధికారపార్టీ నేతలు ఐదేళ్లపాటు యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. మైన్‌లో పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో లోతైన గుంతలతోపాటు చెరువులను తలపించేలా భారీ యంత్రాలతో తవ్వేశారు. మొత్తం మీద 71 మైన్స్ ద్వారా సిలికాను తవ్వేసి నిత్యం 500 వాహనాలతో తరలించేవారు. చెన్నై, బెంగుళూరు, ముంబాయి, హైదరాబాద్, పూనే ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు తరలించేవారు. దీంతోపాటుç పక్క రాష్ట్రాల్లో పెద్ద భవంతుల నిర్మాణాలకు ఇసుక బదులుగా సిలికాను తరలించి సొమ్ము చేసుకున్నారు. సిలికా ఇసుకను పోలి ఉండడంతో దీనిని ఇసుకగా చూపి విక్రయించారు. దీంతో ఇక్కడ టన్ను రూ.600 వంతున దొరికే సిలికాను పక్క రాష్ట్రాల్లో టన్ను రూ.3 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రోజుకు సుమారు 500 లారీల వరకు సిలికాను తరలించేవారు. ఇలా ఐదేళ్లపాటు సిలికా తరలింపు ద్వారా దాదాపు రూ.500 కోట్ల వరకు నేతల జేబుల్లోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కావడంతో గనులశాఖ అధికారులు సైతం సిలికా అక్రమ రవాణాకు రాచబాట వేసి వారిచ్చే నెలవారీ మామూళ్లతో సరిపెట్టుకున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు తూట్లు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు తూట్లు పొడిచేలా సిలికా మైన్స్‌లో దోపిడీ సాగింది. అనుమతులు ఉన్న మైన్స్‌కు హద్దులు ఏర్పాటు చేసి 10 అడుగులకు మించి తవ్వకాలు చేపట్ట వద్దని గతంలో ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అధికారపార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కావడంతో వారు నిబంధనలు పాటించకున్నా అధికారులు పట్టించుకోలేదు. 10 అడుగులకు మించి గోతులు తీయకూడదనే నిబంధన ఉన్నా 40 అడుగుల తోతైన గుంతలు తవ్వేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. అంతేకాదు కాలుష్యం వెదజల్లి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. సాగు, తాగునీటికి కటకట సిలికా గనుల నుంచి వచ్చే ఊట నీటితో సొనకాలువలు ఎప్పుడూ నీటితో నిండి ఉండేవి. టీడీపీ పెద్దలు గనులను లీజులు తీసుకున్న తరువాత మండలంలో పలు గ్రామాలకు తాగు, సాగు అందించే 13 సొన కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో దాదాపు ఆయా కాలువల ద్వారా సాగయ్యే 2 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన దుస్థితి నెలకొంది. ఐదేళ్లపాటు కాలువలు ఎండి ఆ ప్రాంత రైతుల భూముల్లో పంటలు సాగు చేసుకోలేకపోయారు. సాగునీరుతోపాటు తాగునీటికి అష్టకష్టాలు పడ్డారు. వేసవి వస్తుందంటే తాగునీటికి ఆయా గ్రామస్తుల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. -
లీజుల పేరిట ధారాదత్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని ఆర్టీసీ స్థలాలను లీజు పేరిట టీడీపీ నేతలకు ధారాదత్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ స్థలం కనబడితే చాలు టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. సర్కారు పెద్దల తోడ్పాటుతో రూ.వందల కోట్ల విలువచేసే ఆర్టీసీ స్థలాల్ని కారుచౌకగా కొట్టేస్తున్నారు. ఈ స్థలాల పునాదులపై తమ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుని సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉన్న ఆర్టీసీ స్థలాలు చినబాబు అండతో టీడీపీ నేతలు, అనుకూల కార్పొరేట్ కంపెనీలు దక్కించుకోగా.. తాజాగా నరసరావుపేటలో రూ.20 కోట్ల విలువచేసే ఆర్టీసీ స్థలాన్ని అధికారపార్టీ సీనియర్ నేత తనయుడు చేజిక్కించుకున్నారు. టెండర్లను అడ్డుకుని బినామీలను రంగంలోకి దించి మరీ ఈ స్థలాన్ని కారుచౌకగా కొట్టేశారు. నామమాత్రపు ధరకు ఒప్పందం.. గుంటూరు–కర్నూలు రహదారి పక్కన నరసరావుపేట పట్టణంలో ఆర్టీసీ డిపో, గ్యారేజీ ఉంది. ఈ గ్యారేజీ పక్కనే ఆర్టీసీ అధికారుల క్వార్టర్లకు 60 సెంట్ల విలువైన భూమి ఉంది. ఇక్కడ డిపో మేనేజర్, సిబ్బంది ఉండేందుకు 1976లో క్వార్టర్లు నిర్మించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ విలువైన స్థలంపై కన్నేసిన సీనియర్ నేత తనయుడు చేజిక్కించుకునేందుకు ప్లాన్ వేశారు. మల్టీప్లెక్స్ నిర్మించేందుకు దీన్ని ఎంచుకున్నారు. ముందుగా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బందిని ఖాళీ చేయించి స్థలాన్ని బీవోటీ(నిర్మించు–నిర్వహించు–బదలాయిం^èు) విధానంలో లీజుకు తీసుకునేందుకు టెండర్లు పిలిచేలా ఆర్టీసీ ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. టెండర్లు పిలిచాక ఎవ్వరూ ముందుకు రాకుండా బెదిరించారు. ఓ కార్పొరేట్ కంపెనీని అడ్డుపెట్టుకుని అతి తక్కువ ధరకు చేజిక్కించుకున్నారు. రూ.20 కోట్ల విలువైన స్థలానికి నెలకు రూ.లక్ష నామమాత్రపు ధర చెల్లించేలా 33 ఏళ్లపాటు లీజుకు ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణం పూర్తయ్యేవరకు ఆర్టీసీకి పైసా చెల్లించకుండా ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. 28 ఎకరాలను లాక్కుంది.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1986లో గన్నవరం ఆర్టీసీ శిక్షణ కళాశాలకోసం సర్వే నంబర్ 20/1లో 28 ఎకరాల్ని జీవో నంబర్ 117 జారీ చేసి ఆర్టీసీకి అప్పగించగా.. ఈ భూముల్లో ఆర్టీసీ భవనాల నిర్మాణం కూడా చేపట్టింది. 2007లో ఈ భూములకు రెవెన్యూశాఖ నిరా>్ధరించిన రేటు ప్రకారం ఎకరాకు రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.12.43 లక్షలు చెల్లించింది. ఇప్పుడీ భూములు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉన్నాయని బలవంతంగా ఆర్టీసీ నుంచి లాక్కున్న సర్కారు రూ.250 కోట్ల విలువైన ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయని కృష్ణా కలెక్టర్‌తో నివేదిక తెప్పించి బలవంతంగా లాక్కుని హెచ్‌సీఎల్‌కు కట్టబెట్టింది. ప్రత్యామ్నాయ భూములిస్తామని చెబుతున్నా అది జరిగేది అనుమానమే. కారుచౌకగా కొట్టేస్తున్నారు... ఏపీఎస్ఆర్టీసీకి 13 జిల్లాల్లో 1,960 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ ఇప్పుడున్న రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమారు రూ.15 వేల కోట్ల ఉంటుందని అంచనా. అదే మార్కెట్ రేటు ప్రకారమైతే రూ.50 వేల కోట్లు ఉంటుంది. ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేతలు ప్రభుత్వ పెద్దల సహకారంతో అతి తక్కువ లీజుతో వాటిని కొట్టేయడంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే గుంటూరు నడిబొడ్డులోని అతి విలువైన స్థలాన్ని స్విస్ ఛాలెంజ్ విధానంలో విజయవాడకు చెందిన సిద్ధి ప్రధ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కారుచౌకగా గతేడాది కట్టబెట్టడం తెలిసిందే. గుంటూరు ప్రధాన బస్టాండ్‌ను ఆనుకుని ఉన్న పాత రీజినల్ మేనేజరు కార్యాలయం వద్ద 8,643 చదరపు గజాల స్థలం(సుమారు 1.80 ఎకరాలు) ఆర్టీసీకి ఉంది. మార్కెట్‌రేటు ప్రకారం ఈ స్థలం విలువ రూ.వందకోట్ల పైమాటే. ఈ స్థలాన్ని వ్యాపార కూడలిగా మారిస్తే ఏటా రూ.వందలకోట్ల ఆదాయాన్ని ఆర్జించే వీలుంది. అయితే దీనికి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్లు పిలిచిన ఆర్టీసీ.. సర్కారు అనుకూల కంపెనీలు దక్కించుకునేలా నిబంధనలు రూపొందించింది. ఆ మేరకు విజయవాడకు చెందిన సిద్ధి ప్రథ కంపెనీ ఒక్కటే టెండర్లలో పాల్గొనడం, దానికి ఏకపక్షంగా 49 ఏళ్లపాటు లీజు విధానంలో స్థలాన్ని కట్టబెట్టేయడం జరిగిపోయింది. ఇదేరీతిలో పలు నగరాలు, పట్టణాల్లోని భూములనూ అధికారపార్టీకి అనుకూలమైన వారికి కట్టబెడుతున్నారు. విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి తదితర ప్రాంతాల్లోనూ బీవోటీ విధానంలో 33 ఏళ్లకు, 99 ఏళ్లకు లీజుకివ్వడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్న ఈ స్థలాలు తిరిగి ఎన్నేళ్లకు ఆర్టీసీకి బదలాయింపు జరుగుతాయో.. కూడా తెలియని పరిస్థితి. -
ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతం!
ఆర్టీసీ సంస్థ తన ఆధీనంలోని భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ఫైల్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్‌లోని జోనల్ వర్క్‌షాప్ వద్ద మూడున్నర ఎకరాల స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆదాయం పెంచుకునేందుకే స్థలాలను లీజుకు ఇస్తున్నామని యాజమాన్యం చెబుతున్నా.. ఈ నిర్ణయం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని, సంస్థను ప్రైవేటుపరం చేయడంలో భాగమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మంకమ్మతోట(కరీంనగర్) : ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పెంచుకునేందుకు క్రమంగా ప్రైవేటువైపు అడుగులు వేస్తోం ది. ఇందులో భాగంగానే సంస్థ అభివృద్ధికి అంటూ.. భూములను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ అవసరాల మేరకు భూములన్నింటిని ప్రైవేటు కంపెనీలు, సంస్థలకు అప్పగించి కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్‌మాల్స్, ఐమాక్స్ థియేటర్లు, సినిమాహాళ్లు, రెస్టారెట్లు, ఫంక్షన్‌హాల్స్ నిర్మింపచేయాలని ప్రయత్నం చేస్తోంది. గ్యారే జీ, బస్‌స్టాపులు, వర్క్‌షాప్, టైర్వర్క్స్ వంటి సంస్థకు ఉపయోగపడే వాటిని ఏర్పాటు చేయకపోగా.. ప్రైవేటుకే పూర్తిగా అప్పగించాలనే నిర్ణయాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఆర్టీసీకి అదనంగా ఆదాయం వస్తుందని యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. లీజు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ భూములు సంస్థకు దక్కుతాయా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రీజియన్‌లో ఆర్టీసీకి చెందిన చాలా భూములన్నిఇప్పటికే ప్రైవేటుకు ధారాదత్తం అయ్యాయి. మిగిలిన వాటిలో ఇటీవల కొన్నిటికి అనుమతి ఇవ్వగా.. మరికొన్నింటికి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ భూములు సంస్థకోసం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉన్నా.. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం లాభాలు, అభివృద్ధి పేరుతో పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ధారపోయడానికే ఈ నిర్ణయం తీసుకుంటోందని కార్మికులు పేర్కొంటున్నారు. మూడున్నర ఎకరాలు ఇచ్చేందుకు.. నగరంలోని జోనల్ వర్క్‌షాప్ వెనుక సంస్థకు 50ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని వర్క్‌షాప్, రీటైరింగ్ వర్క్‌షాప్, స్క్రాప్ బస్సులు నిలుపుకోవడానికి వినియోగిస్తున్నారు. అయితే ఇందులో మూడున్నర ఎకరాల్లో హోటల్, మాల్స్, థియేటర్ నిర్మించుకోవడానికి గత అక్టోబర్‌లో టెండర్లు ఆహ్వానించింది. అయితే యాజమాన్యం విధించిన నిబంధనలకు లోబడి టెండర్ దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదని తెల్సింది. ప్రస్తుతం వర్క్‌షాప్ వెనుక గల స్థలాన్ని చెట్లు నరికివేసి చదును చేయిస్తున్నారు అధికారులు. స్క్రాప్ బస్సులను నిలుపుకోవడానికే చదును చేస్తున్నామని చెబుతన్నప్పకీ.. పెద్దమొత్తంలో స్థలాన్ని లీజుకు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికే సిద్ధం చేస్తున్నారని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. జోనల్ వర్క్‌షాప్‌ను పూర్తిగా ఇక్కడి నుండి తరలించాలనే ఉద్దేశంతోనే ఉద్యోగుల నియామకం చేపట్టడం లేదని, మరికొన్ని రోజుల్లో వర్క్‌షాప్ మూసేయడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో కరీంనగర్–2 డిపో తరలించే అవకాశాలూ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. డిపో తరలిస్తే.. ఆ స్థలాన్నీ లీజుకిచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకనుగుణంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థలాలు లీజుకు నగరంలోని కొన్ని స్థలాలను యాజమాన్యం ఇప్పటికే లీజుకు ఇచ్చింది. కరీంనగర్ –2 డిపో పక్కనగల స్థలాన్ని 99 ఏళ్లకుగాను లీజుకు ఇచ్చింది. ఇందులో మల్టీప్లెక్స్ నిర్మించారు. జగిత్యాలలోని స్థలాలను మూడేళ్లక్రితమే లీజుకిచ్చారు. ప్రస్తుతం నగరంలోని బస్‌స్టేషన్ ఆవరణలో వర్క్‌షాప్ వద్ద ఆర్టీసీ భూములున్నాయి. వీటిని కూడా లీజుకు ఇచ్చేందుకు శరవేగంగా ఫైల్ కదులుతున్నట్లు సమాచారం. -
గజం భూమికి ఏడాది లీజు ఒక్క రూపాయే
దేశ రాజధానిలో గజం భూమి ఏడాదికి లీజుకు తీసుకుంటే ఎంత అవుతుంది? ఎవరికైనా ఏమో గానీ.. కేజ్రీవాల్ సర్కారుకు మాత్రం ఒక్క రూపాయికే ఇస్తామని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, నైట్ షెల్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఢిల్లీలో తమకు స్థలం దొరకడం లేదంటూ కేజ్రీవాల్ సర్కారు ఆరోపించడంతో.. దానికి సమాధానంగా ఇలాంటి వాటికి డీడీఏ ఏడాదికి గజం భూమికి ఒక్క రూపాయే లీజుకు ఇస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రజోపయోగ సేవల కోసం నామమాత్రపు ధరకే భూములు ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యాడ్స్ మాత్రమే ఇస్తోందని, తాము మాత్రం అభివృద్ధిని యాడ్ చేస్తూ వెళ్తున్నామని ఆయన కేజ్రీవాల్‌కు చురక వేశారు. కనీసం ఆస్పత్రులు కట్టాలన్నా తమకు భూములు దొరకడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. వాణిజ్యపరంగా అయితే చదరపు మీటరుకు లీజు రూ. 1.82 లక్షల నుంచి రూ. 6.72 లక్షల వరకు ఉంది. కనీసం లాభనష్టాలు లేని ప్రాతిపదికన అయినా చదరపు మీటరుకు రూ. 11,745 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో డీడీఏ నుంచి జోనల్ వేరియంట్ రేటు ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి భూములు అందుబాటులోకి వస్తాయి. కేవలం ఆస్పత్రులు, కార్యాలయాలకే కాక సిబ్బంది క్వార్టర్లు, స్కూళ్లు తదితరాలకు కూడా తక్కువ ధరలకే భూములు లీజుకు ఇస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. -
ఇరు వర్గాల ఘర్షణ... పది మందికి గాయాలు
దిండి: నల్లగొండ జిల్లా దిండి మండలం ఎర్రారం గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లెళ్ల పెద్ద జంగయ్య వద్ద బర్కతుల్లా ఏడాది క్రితం కొంత మెత్తం అప్పు తీసుకున్నాడు. అందుకు హామీగా తన భూమిలో కౌలు చేసుకునేందుకు జంగయ్యను అనుమతించాడు. అయితే, తీసుకున్న అప్పు తీర్చకుండానే బర్కుతుల్లా తన భూమిని పెద్ద జంగయ్య సోదరుడు చిన్నజంగయ్యకు విక్రయించాడు. దీంతో ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పది మంది గాయపడ్డారు. యాంగిర్బీ, స్వామి, తిరుపతయ్యలకు తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.