లింగాపూర్‌లో చిరుత సంచారం
Published Tue, Dec 8 2015 12:53 PM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ ప్రాంతం సమీపంలో చిరుత సంచరిస్తుందనే సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లింగాపూర్ సమీపంలో చిరుత తిరుగుతుండటం గమనించిన సురేష్ అనే వ్యక్తి విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత పాదముద్రలను పరిశీలిస్తున్నారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.
Advertisement
Advertisement