Leophard
-
దాచంపల్లిలో చిరుత కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మండలం దాచంపల్లిలో ఆదివారం చిరుత కలకం సృష్టించింది. గొర్రెల మందపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో 70 గొర్రె పిల్లలు మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెదిరిపోయి బోరుబావిలో పడింది
గౌహతి: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కపోయింది ఓ చిరుతపులి. తన ఆవాసానికి వెళ్లే దారి మరిచిన చిరుత నేరుగా జనావాసాల్లోకి ప్రవేశించింది. దాంతో భయాందోళనలకు గురైన అక్కడి జనం ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారు. అది చూసి బెదిరిపోయిన చిరుత ప్రాణభయంతో పరుగుతీసి ప్రక్కనే ఉన్న ఓ బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన అసోం రాజధాని గౌహతిలో శనివారం చోటుచేసుకుంది. చిరుతపులి బోరుబావిలో పడిన విషయాన్ని స్థానికులు జంతుసంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు చివరకు చిరుతపులిని బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం చిరుతను అసోం జంతు ప్రదర్శనశాలకు తరలించినట్టు సమాచారం. -
లింగాపూర్‌లో చిరుత సంచారం
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ ప్రాంతం సమీపంలో చిరుత సంచరిస్తుందనే సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లింగాపూర్ సమీపంలో చిరుత తిరుగుతుండటం గమనించిన సురేష్ అనే వ్యక్తి విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత పాదముద్రలను పరిశీలిస్తున్నారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. -
చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు
కేతేపల్లి(పాన్‌గల్): మహబూబ్ నగర్ జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని కేతేపల్లి-కల్వరాల గ్రామాల మధ్య ఉన్న గుట్టలు, పరిసరా పొలాల్లో కొన్ని రోజుల నుంచి చిరుత సంచరిస్తుందనే పుకార్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుట్టల పరిసరా ప్రాంతాల రైతులు తమ పంట పొలాలకు నీరు పారించేందుకు వెళ్ళడానికి జంకుతున్నారు. పంట పొలాల్లో చిరుత సంచరించడాన్ని బుధవారం కళ్లారా చూసిన కొందరు రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చిరుత సంచారంతో పంట పొలాలకు ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతూ పరిసర ప్రాంతాల రైతులు అందరు కలిసికట్టుగా వెళ్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పంట పొలాల్లో చిరుత సంచారాన్ని నివారించి.. భయాన్ని తొలగించాలని రైతులు కోరుతున్నారు.