చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు | Farmers to scare of Leophard roaming in fileds | Sakshi
Sakshi News home page

చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

Published Wed, Oct 28 2015 5:00 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

Farmers to scare of Leophard roaming in fileds

కేతేపల్లి(పాన్‌గల్): మహబూబ్‌ నగర్ జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని కేతేపల్లి-కల్వరాల గ్రామాల మధ్య ఉన్న గుట్టలు, పరిసరా పొలాల్లో కొన్ని రోజుల నుంచి చిరుత సంచరిస్తుందనే పుకార్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుట్టల పరిసరా ప్రాంతాల రైతులు తమ పంట పొలాలకు నీరు పారించేందుకు వెళ్ళడానికి జంకుతున్నారు. పంట పొలాల్లో చిరుత సంచరించడాన్ని బుధవారం కళ్లారా చూసిన కొందరు రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

చిరుత సంచారంతో పంట పొలాలకు ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతూ పరిసర ప్రాంతాల రైతులు అందరు కలిసికట్టుగా వెళ్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పంట పొలాల్లో చిరుత సంచారాన్ని నివారించి.. భయాన్ని తొలగించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement