యాలాల(రంగారెడ్డి): రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ తెల్లారి లేచి చూసేసరికి కాలి బూడిదైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అచ్యుతాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గొళ్ల అంజిలయ్య శుక్రవారం రాత్రి యాలాలకు వెళ్లి తిరిగి వచ్చి హీరోహోండా బైక్‌ను ఇంటి ముందు ఉన్న పాకలో పార్క్ చేసి పడుకున్నాడు.
ఉదయం లేచి చూసేసరికి బైక్‌తో సహా పాక పూర్తిగా కాలిపోయింది. దీంతో అంజిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.