మద్యం మత్తులో కారుపై పెట్రోల్‌ పోసి దగ్ధం  | car burned | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కారుపై పెట్రోల్‌ పోసి దగ్ధం 

Published Sat, Mar 24 2018 11:37 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

car burned - Sakshi

పూర్తిగా కాలిపోయిన కారు

జైపూర్‌(చెన్నూర్‌): జైపూర్‌ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు ప్రహరీ గోడ సమీపంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఇమ్రాన్‌ అనే వ్యక్తి తన ఎర్టీగా కారును మద్యం మత్తులో గురువారం రాత్రి 1గంట సమయంలో పెట్రోల్‌ పోసి కాలబెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీఎస్‌08ఈయూ7243 అనే ఎర్టీగా కారు ఖమ్మం జిల్లాకు చెందినది కాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఇమ్రాన్‌ కొనుగోలు చేశాడు.

కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య పుట్టింకి వెళ్లింది. ఈ క్రమంలో గురువారం జైపూర్‌ మండల కేంద్రానికి వచ్చిన ఇమ్రాన్‌ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మద్యం మత్తులో తన ఎర్టీగా కారును తానే కాలబెట్టుకున్నాడు. కాగా అర్ధరాత్రికి రాత్రి కారు ఇక్కడకి తెచ్చి కాలబెట్టడంపై స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు విచారించగా తానే మద్యం మత్తులో కారును తగులబెట్టిన్నట్లు ఇమ్రాన్‌ చెప్పినట్లు స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement