ఇంటి ముందు పార్క్ చేసిన ఓ బైక్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
కుషాయిగూడ (హైదరాబాద్) : ఇంటి ముందు పార్క్ చేసిన ఓ బైక్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ఏపీఐఐసీ కాలనీకి చెందిన కటారి ముఖేష్ అనే యువకుడు వ్యాపారం చేస్తుంటాడు. రోజులానే ఆదివారం రాత్రి బైక్ను ఇంటి ఎదుట పార్క్ చేశాడు. రాత్రి 12 గంటల సమయంలో ఇంటి ఎదుట ఉన్న టీఎస్:08,సీజీ:9962 నెంబరు గల అపాచీ బైక్‌కు మంటలు అంటుకున్నాయి.
మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన చుట్టు ప్రక్కలవారు కేకలు వేయడంతో ఇంట్లో పడుకొని ఉన్న వాహన యజమాని ముఖేష్ బయటకు వచ్చి చూడగా అప్పటికే బైక్ మంటల్లో కాలిపోతుంది. అంతా కలిసి మంటలార్పినా ఫలితం లేకుండా పోయింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా బైక్‌కు నిప్పంటించిన ఘటనలో ముగ్గురు పాల్గొన్నట్లు సమీపంలోని సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. బైక్‌పై వచ్చిన దుండగులు నిప్పంటించి అక్కడ నుంచి వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.