నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రం లోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న విఘ్నేశ్వర హోండా షోరూమ్ సర్వీసింగ్ పాయింట్ ఆది వారం దగ్ధమైంది. సాయంత్రం 3 గంటల సమయంలో షోరూమ్ వెనుకభాగంలో ఉన్న సర్వీసింగ్ పాయింట్‌లో దట్టమైన పోగలు రావడంతో వెనుకభాగంలో ఉన్న ఇళ్లలోని ప్రజలు గమనించి షోరూమ్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హూటాహుటిన చేరుకొని మం టలను ఆర్పేశారు. అప్పటికే లక్షల్లో ఆస్తినష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్ల లేదు. అయితే ఈ ఘటనపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ 40 లక్షల స్పేర్‌పార్ట్స్ అగ్నికి ఆహుతి
సర్వీసింగ్ పాయింట్‌లో ఉన్న రూ 40 లక్షల విలువైన స్పేర్‌పార్ట్స్ అగ్గికి ఆహుతయ్యాయి. సర్వీసింగ్ పాయింట్‌లోనే స్పేర్‌పార్ట్స్ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారికి ముందుభాగంలో షోరూమ్ ఉంది. ఘటన సమయంలో షోరూమ్ సిబ్బంది పూజలో ఉన్నారు.
కాలిపోయిన 20 బైక్‌లు
సర్వీసింగ్ కోసం ఇచ్చిన సుమారు 20 బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. వీటి విలువ సుమారు రూ 6 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కార్తీకపౌర్ణమితో పాటు ఆదివారం సెలవు కావడంతో వర్కర్లు సర్వీసింగ్ పాయింట్‌లోకి రాలేదని షోరూమ్ నిర్వాహకులు చెబుతున్నారు. దట్టమైన పొగలు వ్యాపించగానే సర్వీసింగ్ పాయింట్ ముందుభాగంలో ఉన్న మరో 20 కొత్త బైక్‌లను పక్కకు పెట్టారు.
ఘటనపై పలు అనుమానాలు..
సర్వీసింగ్ పాయింట్‌లో అగ్ని ప్రమాదం జర గడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్తీకపౌర్ణమి సందర్భంగా దేవుడి దగ్గర ఉన్న దీపం ప్రమాదవశాత్తు ఆయిల్‌కు అంటుకొని, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఉలిక్కిపడిన పరిసరాల ప్రజలు
సర్వీసింగ్ పాయింట్ దగ్ధమై మంటలు ఎగిసి పడుతుండడంతో పరిసరాల ప్రజలు ఒక్కసారి గా ఉలిక్కిపడ్డారు. అగ్నికీలలు ఎటువైపు వ్యాపిస్తాయేనని భయాందోళనకు గురయ్యారు. సమీపంలోనే ఉన్న పాఠశాల నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నల్లగొండతో పాటు నకిరేకల్, మిర్యాలగూడ నుంచి అగ్నిమాపక శకటాలు తెప్పించారు. రెండు గంటలలోపు మం టలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
ఆర్డీఓ పరిశీలన
ఘటన స్థలాన్ని నల్లగొండ ఆర్‌డీఓ జహీర్, సీఐ మనోహర్‌రెడ్డి పరిశీలించారు. మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
హోండా సర్వీసింగ్ పాయింట్ దగ్ధం
Published Mon, Nov 18 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement