
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని.. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుధారాణి అనే మహిళను నాలుగు రోజుల క్రితం పోలీసులు తీసుకొచ్చారని.. ఇప్పటికీ కోర్టులో హాజరు పరచలేదని ధ్వజమెత్తారు.
దీనిపై మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. పిటిషన్ వేసినందుకు ఆమెపై మరో నాలుగు తప్పుడు కేసులు పెడతామని ఆమెని బెదిరిస్తున్నారు. రాయచోటికి చెందిన హన్మంతరెడ్డిని కూడా అలాగే తీసుకెళ్లారు. మేము పిటిషన్ వేశాక అతన్ని మదనపల్లెలో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో ఏకంగా ఎస్పీనే బదిలీ చేశారు. ఎస్పీల స్థానంలో నాన్ కేడర్ ఎస్పీలను వేస్తామని ఐపీఎస్‌లను కూడా బెదిరిస్తున్నారు. ‘కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఎఫ్‌ఐఆర్‌లను బాధితులకు ఇవ్వటం లేదు ఇలా చేయటం ద్వారా ఏం చెప్పదలచుకున్నారు?’’ అంటూ మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, ప్రశ్నిస్తే కేసులు పెట్టటం సరికాదని.. కాలం ఒకేలాగ ఎప్పుడూ ఉండదన్నారు. ప్రభుత్వం చేస్తోన్న తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టటం ఏంటి?. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారు. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. వారికి అన్నివిధాలా అండగా నిలబడుతున్నాం. పోలీసులు చేయ్యి చేసుకుంటే ఆ వివరాలు ఇవ్వాలని మా కార్యకర్తలను కోరుతున్నాం. సదరు పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాం. టీడీపీ అధికార ట్విట్టర్‌లోనే మాపై దారుణంగా పోస్టులు పెడితే డీజీపీ ఏం చేస్తున్నారు?
ఇదీ చదివండి: వేధించకుంటే వేటే!
..వైఎస్ జగన్‌ని దారుణంగా దూషిస్తుంటే డీజీపికి కనపడటం లేదా?. మరోసారి ఆ వివరాలన్నీ మేము డీజీపికి ఇవ్వబోతున్నాం. దీనిపై ఆయన కచ్చితంగా కేసులు పెట్టించాలి. లేకపోతే సదరు పోలీసులపై కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు.

Comments
Please login to add a commentAdd a comment