
కాలిపోయిన పుస్తకాలు
కోవెలకుంట్ల : పట్టణ శివారులోని గుంజలపాడు రహదారిలో ఉన్న వికాస్ స్కూల్‌లో గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. వచ్చే నెలలో పాఠశాలలు పున: ప్రారంభం కానుండటంతో రెండు రోజుల క్రితం నర్సరీ నుంచి పదో తరగతి వరకు రూ. 15 లక్షల విలువ చేసే టెస్ట్, నోట్ పుస్తకాలను తీసుకొచ్చి కంప్యూటర్ ల్యాబ్‌లో భద్రపరిచారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి స్కూల్‌లోకి ప్రవేశించి ల్యాబ్ తాళాలు పగలగొట్టి పెట్రోలో పోసి పుస్తకాలు, కంప్యూటర్లకు నిప్పు పెట్టారు.
స్కూల్ ఆవరణలో ఉన్న బస్సుల అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యారు. బుధవారం ఉదయం ఈ రహదారిలో వాకింగ్‌కు వెళుతున్న వ్యక్తులు తరగతి గదిలో పొగ రావడాన్ని గమనించి స్కూల్ యాజమాన్యానికి సమాచారమిచ్చారు.
పాఠశాల కరస్పాండెంట్ వినోద్‌కుమార్ స్కూల్‌కు చేరుకుని జరిగిన విధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో రూ. 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.