కరోనా ఎఫెక్ట్‌: నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కాల్చివేత | Currency Notes In Karnataka Were Burned On Roadside | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: నడిరోడ్డుపై పడిన కరెన్సీ నోట్ల కాల్చివేత

Published Sun, Apr 12 2020 7:10 AM | Last Updated on Sun, Apr 12 2020 12:36 PM

Currency Notes In Karnataka Were Burned On Roadside - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శివాజీనగర: రోడ్డుపై నోటు పడిందంటే దేవునికి దండాలు పెట్టుకుని తీసుకుంటారెవరైనా. కానీ కరోనా వైరస్‌ ధనాశను కూడా చంపేస్తోంది. రోడ్డుపై పడిన నోట్లను ప్రజలు కాల్చివేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కల్బుర్గి జిల్లా ఆళంద తాలూకా సుంటనురు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎవరో ఉమ్మివేసి నోటు రోడ్డుపై పారవేసినట్లు అనుమానంతో నోట్లను ముట్టకుండా కట్టెతో పేర్చి ప్రజలు కాల్చివేశారు.

ముఖానికి మాస్క్‌ వేసుకొని వచ్చిన అపరిచితులైన ముగ్గురు వ్యక్తులు కొంతసేపు మొబైల్‌లో మాట్లాడి, ఆ తరువాత నోటు పారవేసి వెళ్లినట్లు స్థానిక మహిళలు చెబుతున్నారు. నోటు పారవేసి వెల్లినవారిని తెలుసుకొని తక్షణమే గ్రామ మహిళలు నోటును పిల్లలు ముట్టకుండా మట్టితో మూయించి ఆ తరువాత గ్రామస్థులకు సమాచారం అందించారు. ఆ తరువాత గ్రామస్థులు నోట్లను తీసి కాల్చివేసినట్లు   తెలిపారు. చదవండి: తల్లి మందుల కోసం టిక్‌టాక్‌; స్పందించిన సీఎం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement