
మంటల్లో కాలిపోతున్న బైక్
దేవరుప్పుల, వరంగల్ : భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన వాహనానికి నిప్పంటించాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన బోడ రవికి ఆయన భార్యకు ఇటీవల ఓ విషయంలో వివాదం చోటుచేసుకుంది. అయితే తీవ్ర మనస్తాపాని కి గురైన రవి దేవరుప్పుల అంగడి సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి తన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లి నిప్పంటించారు.
దీంతో దుర్గామాత ఉత్సవాల్లో ఏదైనా ప్రమాదం జరిగిందా అని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై స్థానిక ఎస్సై గడ్డం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment