నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో కొంతమంది పశువుల ఎముకలను ఆరబెట్టడంతో ఆదివారం స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో కొంతమంది పశువుల ఎముకలను ఆరబెట్టడంతో ఆదివారం స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటిచారు. కొంత కాలంగా పంట పొలాల్లో పశువుల ఎముకలను ఆరబెట్టడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని రైతులు, యువకులు ఆభ్యంతరం తెలిపారు.
అయినా తొలగించకపోవడంతో యువకులు ఎముకలు ఆరబెడుతున్న స్థలానికి వెళ్లి అక్కడి వారితో వాగ్వాదానానికి దిగారు. ఇరువురి మధ్య మాట-మాట పెరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై ఆసిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఆరబెడుతున్న ఎముకలను తొలగించాలని సూచించారు. లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.