రేపల్లె: గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి రెండు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు లేచి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో రేపల్లె అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
రెండు పూరి గుడిసెలు దగ్ధం
Published Sun, Feb 22 2015 9:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement