
రేషన్ అడిగిన మహిళపై దాడి
హైదరాబాద్: రేషన్ సరుకులు అడిగిన మహిళపై ఓ రేషన్ డీలర్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని రేషన్ షాపు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన మహిళ బియ్యం కోసం షాపుకు రాగా, ఆమెకు రేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు డీలర్ ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు రేషన్ షాపు ముందు ధర్నాకు దిగారు.