
గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధు (ఘాతుకానికి పాల్పడ్డ నాగరాజు)
శృంగవరపుకోట: ప్రేమోన్మాదంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ నిర్లక్ష్యం చేస్తున్నందున ఆమెపై దాడికి యత్నించడమే గాకుండా... అడ్డుకున్న వ్యక్తి చేతి వేళ్లు నరికిన సంఘటన శృంగవరపుకోట పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కలకలం రేపిన సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పట్ణణంలో నడబండ ప్రాంతంలో నివాసం ఉంటున్న నానిగిరి నాగరాజు అనే యువకుడు మెకానిల్ డిప్లొమా పూర్తిచేసి మూడేళ్ల క్రితం స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ విభాగంలొ శ్రామిక్ గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో డిపోలో వున్న వాటర్ ప్లాంట్ దుకాణంలో గంట్యాడ మండలం కొండతామరాపల్లికి చెందిన ఓ వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఆ వివాహిత భర్త, కుమార్తె ఏడేళ్ల క్రితమే చనిపోగా ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఆ మహిళ ఇటీవలే వాటర్‌ప్లాంట్‌లో పని మానేసి ఆకులడిపో వద్ద ఆదిమూలం మధు అనే యువకుడు ప్రారంభించిన ఐస్‌క్రీమ్ పార్లర్‌లో పనికి కుదిరింది. ఇటీవల ఆమె నాగరాజును నిర్లక్ష్యం చేస్తుండటంతో తట్టుకోలేక పగ పెంచుకుని గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో పార్లర్‌కు వెళ్లి ఆమెపై దాడి చేశాడు. ఇంతలో దుకాణం యజమాని మధు అడ్డుకునే ప్రయత్నం చేయగా కుడిచేతి నాలుగు వేళ్లు తెగిపడ్డాయి. స్థానికులు హుటాహుటిన మధును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. హత్యకు పాల్పడిన నాగరాజు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రాధమిక చికిత్స అనంతరం మధును విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.