సాక్షి, శ్రీకాళహస్తి: మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నాననే ఆనందం కాసేపైనా ఆమెకు లేకుండా పోయింది. కనీస దయ, జాలి, కరుణ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకి వెళ్లగొట్టాడు తను అద్దెకుంటున్న బిల్డింగ్ యజమాని. ఈ అమానవీయ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వరిస్తున్న ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే చికిత్స అనంతరం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి కోటి ఆశలతో తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకుంది.
కానీ ఆ మహిళను ఇంటి యజమాని అడ్డుకున్నాడు. అమె అద్దెకుంటున్న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో ఈ ఊహించని పరిణామం ఏర్పడటంతో ఏం చేయాలో పాలుపోక నడిరోడ్డుపై సదరు మహిళ నిల్చునే పరిస్థితి ఏర్పడింది. అయితే తమ సహోద్యోగి పరిస్థితి తెలుసుకున్న శ్రీకాళహస్తి తహశీల్దారు ఆమెకు వేరొకచోట బస ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్థానికులు మహిళా ఉద్యోగికి అండగా నిల్చోగా ఇంటి యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి:
కలతచెంది.. కాలినడకన బయలుదేరి..
డాక్టర్ దంపతులపై పూల వర్షం
Comments
Please login to add a commentAdd a comment