బాలానగర్: ఇంటిని అద్దెకు ఇస్తానని ఆన్‌లైన్‌లో పోస్ట్‌పెట్టిన వ్యక్తి రూ.లక్ష పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్‌కు చెందిన గన్ను తిరుపతయ్య సాయినగర్‌లోని ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్ డాట్ కమ్‌లో 2వ తేదీన పోస్ట్ చేయగా.. నేను మీ ఇంటిని అద్దెకు తీసుకుంటానని ఓ వ్యక్తి రిప్లే ఇచ్చాడు.
నెలకు రూ.15 వేల అద్దె 3 నెలల అడ్వాన్స్‌గా ఇవ్వాలని తిరుపతయ్య కోరగా గుర్తు తెలియని ఆ వ్యక్తి గూగుల్ పే నుంచి మీ అకౌంట్ వివరాలు పంపాలని కోరగా బాధితుడు పంపాడు. కాసేపటి తర్వాత మీ దగ్గర నుంచి నాకు మెసేజ్ రాలేదని ఓసారి రూ.45 వేలు ఎంటర్ చేసి చూపండి అని చెప్పగా తిరుపతయ్య అదే విధంగా చేయగా రెండు దఫాలుగా రూ.45 వేలు, మరోసారి రూ.10 వేలు తిరుపతయ్య అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment