
పాలకుర్తి (వరంగల్ రూరల్): కరోనా వచ్చిన వారిపై ప్రేమచూపకున్నా.. వారిని హేళనగా చూడొద్దని, అలాంటి వారిని ఆదరించాలని ఎంత చెప్పినా.. కొంతమంది మారడంలేదు. అందుకు ఉదాహరణే ఈఘటన. సొంత ఇల్లు లేకపోవడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో నివాసముంటున్న ఈగ సుగుణమ్మ అనే వృద్ధురాలకి కరోనా సోకింది. దీంతో ఇంటి యజమాని ఆమెను బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో దిక్కుతోచిని స్థితిలో పడింది.
దీంతో స్పందించిన స్థానిక వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు సదరు వృద్ధురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. అయితే సుగుణమ్మకు ఇద్దరు కుమారులు ఉండగా.. ఒకరు హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. మరో కుమారుడు కుటుంబ కలహాల నేపథ్యంలో వేరుగా ఉంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment