పసి మొగ్గపై పైశాచికం | house owner raped from one month on dum and def young woman | Sakshi
Sakshi News home page

పసి మొగ్గపై పైశాచికం

Published Tue, Jan 2 2018 11:27 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

house owner raped from one month on dum and def young woman - Sakshi

అభంశుభం తెలియని 17ఏళ్ల మూగ, చెవుడు యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన విజయవాడలోని భవానీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55ఏళ్ల సాంబశివరావు అనే వ్యక్తి చిన్నారిపై నెల రోజులుగా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడని తల్లి సోమవారం భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

భవానీపురం (విజయవాడ పశ్చిమ): మూగ, చెవుడు, ఆపై మతిస్థిమితంలేని బాలికపై ఒక వ్యక్తి నెల రోజులుగా లైంగికదాడి చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తల్లి భవానీపురం పోలీస్‌ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. గొల్లపూడి సారాయి కొట్టు సెంటర్‌లో ఓ మహిళ నివసిస్తోంది. భర్తతో పదేళ్ల కిందట విడిపోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం చేసింది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ మతిస్థిమితంలేని చిన్నకుమార్తె(17)తో కలిసి జీవిస్తోంది.

గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామానికి చెందిన వీర్ల సాంబశివరావు(55) కుమార్తె గొల్లపూడిలో నివసిస్తోంది. ఆమె ఇంటిలోనే బాలికతల్లి అద్దెకు ఉంటూ, ఆ ఇంట్లోనే పాచిపనులు చేస్తోంది. తన కుమార్తె ఇల్లు నిర్మిస్తుండటంతో సాంబశివరావు నాలుగురోజులు ఇక్కడుంటే మూడు రోజులు స్వగ్రామం వెళ్లొస్తున్నాడు. సాంబశివరావు నెల రోజులుగా తల్లి ఇంట్లో లేని సమయంలో మతిస్థిమితంలేని బాలికపై లైంగికదాడి చేస్తున్నాడు. బాలిక సైగలద్వారా తల్లికి విషయం చెప్పడంతో ఆమె సాంబశివరావును నిలదీ సింది. తమపైనే ఆరోపణలు చేస్తావా అంటూ వారిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేసి బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement