dumb
-
విధిపై యుద్ధం! గద్దించాలనుంది.. కానీ గొంతు పెగలడంలేదు
ఉమ్మడి కుటుంబం.. ఇంటినిండా జనం.. అనుబంధాల గుమ్మం..అనురాగాల కాపురం.. విధి వికృతం..మేనరికం శాపమో..పేదరికం పాపమో.. విధిపై యుద్ధం చేయాలనుంది.. వైకల్యం వెక్కిరిస్తోంది..గద్దించాలనుంది..గొంతు ఉన్నా పెగలడంలేదు. కష్టాలను ఎదురీదుతామని విన్నవించుకోవడం తప్పా..వినలేని దైన్యం వారిది. రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. శ్రమను నమ్ముకున్న ఈ కుటుంబంలో ఏకంగా నలుగురు బధిరులు ఉన్నారు. జీవన పోరాటం సాగిస్తూ కుటీర పరిశ్రమ కోసం చేయూత కోరుకుంటున్నారు. రాయదుర్గం: రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందులో ఒక కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క పుట్టుకతోనే మూగవారు. ఎదిగే కొద్దీ వినికిడి శక్తినీ కోల్పోయారు. దేవేంద్రకు సమీప బంధువైన నాగవేణితో వివాహమైంది. వీరికి రాధ, సంజయ్, పల్లవి సంతానం. వీరిలో సంజయ్‌కు మూగ, చెవుడు, అవయవలోపం ఉంది. పల్లవి కూడా మూగ, చెవుడుతో బాధపడుతోంది. వీరు పదో తరగతి వరకు చదువుకున్నారు. తిప్పక్కకు వివాహమైనప్పటికీ భర్తతో మనస్పర్థల నేపథ్యంలో తల్లి వద్దే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. గంగమ్మ మరో కుమార్తె వివాహమై మెట్టినింటికి వెళ్లిపోయారు. మొత్తం మీద తొమ్మిది మంది సభ్యులు గల ఈ ఉమ్మడి కుటుంబంలో నలుగురు మూగ, చెవుడు, వైకల్యంతో బాధపడుతున్నారు. సైగలతోనే సంభాషణ.. గంగమ్మ కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క, మనవడు సంజయ్, మనవరాలు పల్లవి సైగలతోనే సంభాషిస్తుంటారు. అవతలి వారికి వీరి భాష అర్థం కాకపోతే కాగితంపై రాసి చూపుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు వేరేచోట ఉన్నపుడు వారితో అవసరం ఉంటే వాట్సాప్ వీడియో కాల్‌ను ఉపయోగించుకుంటున్నారు. కుటీర పరిశ్రమ కోసం వినతి.. దేవేంద్ర తన భార్య నాగవేణితో కలిసి ఇంట్లోనే కుట్టుమిషన్ పెట్టుకుని పీస్ వర్క్‌పై జీన్స్‌ప్యాంట్లు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యనే కుమార్తె పల్లవికి కూడా కుట్టుమిషన్‌లో శిక్షణ ఇస్తున్నాడు. కుమారుడు సంజయ్ తనకు చేతనైన మేరకు తల్లిదండ్రులకు సహకారం అందిస్తున్నాడు. తల్లికి వృద్ధాప్య పింఛన్, దేవేంద్రకు వికలాంగుల పింఛన్ అందుతోంది. దేవేంద్ర సోదరి తిప్పక్కకు సెపరేట్ రేషన్‌కార్డు ఉన్నందున ఆమెకు పింఛన్ వస్తోంది. దీనితోనే అందరూ బతుకుబండి లాగుతున్నారు. అరకొర సంపాదనతో అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం లేదు. పీస్ వర్క్ కాకుండా సొంతంగా వర్క్ ఆర్డర్ తెచ్చుకుని కుట్టివ్వడం ద్వారా సంపాదనను మరింత పెంచుకోవడానికి కుటీర పరిశ్రమ ఏర్పాటు కోసం తమకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించాలని దేవేంద్ర దంపతులు కోరుతున్నారు. ప్రతి క్షణం కుంగిపోతున్నాం నాకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మూగ వారిగా జన్మించారు. కుమారుడికి కూడా ఇద్దరు పిల్లలు మూగ, చెవుడు, వైకల్య లోపంతో జన్మించడం బాధేస్తోంది. ఆ దేవుడు మాకే ఎందుకు ఇలా చేశాడని ప్రతిక్షణం కుంగిపోతున్నాం. అయినా బతుకుపోరాటం కొనసాగిస్తున్నాం. ఇంటి నిండా జనం. అయినా నిశ్శబ్దం. సైగలతోనే సహజీవనం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాం. – గంగమ్మ, కుటుంబ పెద్ద (చదవండి: పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం...) -
మూడేళ్ల కిందట మాటలు బంద్.. మూగవాడికి మాటలొచ్చాయ్!
కేశంపేట: ఓ ప్రమాదంలో మాట కోల్పోయిన వ్యక్తికి తిరిగి మాటలు వచ్చాయన్న ఉదంతం రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆదివారం చర్చనీయాంశమైంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడ్డాడు. బ్రెయిన్‌కు గాయాలవ్వడంతో అతడు మాట కోల్పోయాడు. వైద్యులను సంప్రదించగా రూ.3లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు. (చదవండి: స్టంట్లు చేస్తున్నారా.. జర జాగ్రత్త.. పోలీసులు ఇంటికే వచ్చేస్తారు!) అంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబసభ్యులు అలాగే వదిలేశారు. ఈ క్రమంలో గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో కలిసి బ్రహ్మచారి సైతం వీరబ్రహ్మేంద్రస్వామి దీక్ష చేపట్టాడు. దీక్షలో ఉన్న బ్రహ్మచారి ఆదివారం ఉదయం ఆలయ గర్భగుడిని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోయి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదటగా గర్భగుడిలో ఉంటేనే మాటలు రావడం.. బయటికి వస్తే రాకపోవడం గమనించారు. దీంతో స్వామివారికి 11బిందెలతో అభిషేకం చేయడంతో మాటలు పూర్తిగా రావడం మొదలైంది. గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంతో ఈ అద్భుతం జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గతంలో మాటలు రాలేదని.. తిరిగి రావడం వాస్తవమేనని పలువురు స్థానికులు ధ్రువీకరిస్తున్నారు. కాగా, దీనిపై డిప్యూ టీ డీఎంహెచ్ఓ దామోదర్ వివరణ కోరగా బ్రెయిన్‌కు గాయం అయినప్పుడు ఇలా మాటలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. గాయం మానినప్పుడు అనుకోని పరిణామాల్లో తిరిగి రావచ్చని అభిప్రాయపడ్డారు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి) -
సరిలేరు మీకెవ్వరు!
ఒకరిని చూసి నేర్చుకోవడానికి లేదా ఒకరిని చూసి స్ఫూర్తి పొందడానికి వాళ్లు గొప్పగొప్పోళ్లే కానక్కర్లేదు.. చరిత్రను తిరగరాసినోళ్లే అవ్వాల్సిన పనిలేదు.. ఒక దత్తాత్రి, ఒక మహేశ్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు.. స్ఫూర్తినీ పొందవచ్చు.. ఇంతకీ ఎవరు వీరు.. ఈ సామాన్యులు మనకు నేరి్పస్తున్న జీవిత పాఠం ఏమిటి? తెలుసుకోవాలంటే.. చలో నిర్మల్ జిల్లా.. అప్పటికే టీ దుకాణానికి చేరుకున్న పాలావార్ దత్తాత్రికి ఫోన్ల మీద ఫోన్లు.. అవి కూడా వీడియో కాల్స్.. అందులోని ఒక వ్యక్తి చేతులతో సైగలు చేశాడు.. వెంటనే దత్తాత్రి వేడివేడి చాయ్, కప్పులు తీసుకుని బైక్ మీద బయల్దేరాడు.. ఆర్డర్ డెలివరీ చేసి వచ్చాడు.. వినడానికి, చూడటానికి ఏముంది విశేషం అని మనకు అనిపించొచ్చు.. ఉంది.. దత్తాత్రి పుట్టుకతోనే మూగ, చెవుడు. అన్నీ సరిగా ఉండీ.. అబ్బో మనకు కష్టం అనేస్తున్న రోజులివీ.. దత్తాత్రి అలా అనుకోలేదు. ఆరవ తరగతి వరకూ చదువుకున్న అతను ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని.. సొంతంగా టీ దుకాణం పెట్టుకున్నాడు.. ఇదిగో ఇలా తన వినియోగదారులందరికీ సెల్ నంబర్ ఇచ్చాడు.. అతని పరిస్థితి తెలిసిన వారు కాబట్టి.. వీడియో కాల్ చేసి.. ఎన్ని టీలు కావాలన్నది ఆర్డర్ ఇస్తారు. మనోడు వెంటనే డెలివరీ ఇస్తాడు.. రోజుకు వెయ్యి వరకూ సంపాదిస్తానని చెప్పాడు. దత్తాత్రికి మరో ముగ్గురు సోదరులు ఉన్నారు. 2004లో అతడికి వివాహమైంది. తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు చెప్పాడు. చదవండి: పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయి.. ప్రియుడ్ని.. దివ్యాంగ శక్తి ఎంటర్ప్రైజెస్ షాపు.. పంచగుడి మహేశ్.. విస్తర్ల తయారీలో బిజీబిజీగా ఉన్నాడు.. అక్కడ ఉన్న మరికొందరు పర్యావరణహిత ఫినాయిల్, శానిటైజర్లు తయారుచేస్తున్నారు.. వాళ్ల పనిచూస్తే తెలియదు.. వాళ్లను దగ్గరగా చూస్తే తెలుస్తుంది.. దివ్యాంగులని.. ఈ దివ్యాంగ శక్తి ఎంటర్ప్రైజెస్ స్థాపించిన మహేశ్ అంధుడు(95%). మిగిలిన నలుగురూ దివ్యాంగులు! మహేశ్ ఒకరిపై ఆధారపడకుండా తాను స్వయం ఉపాధి పొందడమే కాకుండా.. తనలాంటి మరికొందరికి బతకడానికి దారి చూపాడు.. అంతేకాదు.. ముడిసరుకును కూడా దివ్యాంగులకు చెందిన యూనిట్ల నుంచే కొనుగోలు చేస్తాడట.. మహేశ్‌కి ఇద్దరు సోదరులు.. ఒక సోదరుడు శ్రీకాంత్ కూడా అంధుడే.. మహేశ్ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు.. మరేంటి మహేశ్.. చదువుకున్నావుగా.. బ్యాక్లాగ్ లేదా దివ్యాంగుల కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేకపోయావా అని అడిగితే.. ఏమన్నాడో తెలుసా? ‘‘నేను బాగుంటే.. నా కుటుంబం మాత్రమే బాగుంటుంది.. అదే నాతోపాటు నలుగురు బాగుంటే వారి కుటుంబాలు కూడా బాగుంటాయి’’ అని.. శెబ్బాష్ రా.. మహేశ్.. – భైంసా టౌన్ -
కరోనా రోగికి వరం: ‘నిశ్శబ్దం’ సినిమా సూత్రం
సాక్షి, గాంధీ ఆస్పత్రి/హైదరాబాద్: అతడు బయటి వ్యక్తులతో మాట్లాడలేడు.. ఏ అవసరం ఉన్నా కుటుంబ సభ్యులు వివరిస్తారు.. కానీ అతడు కరోనా బారిన పడ్డాడు. మాటలు రాకపోవడంతో వైద్యులతో మాట్లాడలేడు. వైద్యులు చెప్పేది వినబడదు. సరిగ్గా చెప్పాలంటే ఇటీవల విడుదలైన ‘నిశ్శబ్దం’ సినిమాలోని అనుష్కలా అన్నమాట. సినిమాలో అనుష్క టెక్నిక్‌నే వినియోగించి ప్రాణాంతకమైన కరోనా వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. హైదరాబాద్ మణికొండకు చెందిన రామచంద్రన్(45) దివ్యాంగుడు. మాటలురావు.. వినబడదు. కరోనా పాజిటివ్ రావడంతో గతనెల 27వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. రోగి సహాయకులకు అనుమతి లేకపోవడంతో రామచంద్రన్ ఒక్కడే వార్డులో అడ్మిట్ అయ్యాడు. అతడు మాట్లాడలేక పోవడం, చెప్పినా వినిపించకపోవడంతో అతడు ఇబ్బందులు పడ్డాడు. అతడి బదిర భాష వైద్యులకు అర్థం కాలేదు. మనసుంటే మార్గం ఉంటుందని భావించిన వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలను హావభావాలు, సంజ్ఞల ద్వారా వివరించారు. మరికొన్ని విషయాలను రోగి సెల్‌ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చాట్ ద్వారా చెప్పారు. దీంతో వైద్యులు, రోగి మధ్య కమ్యూనికేషన్ కొంతమేర మెరుగైంది. శానిటేషన్, పేషెంట్ కేర్ టేకర్లు, వార్డ్‌బాయ్స్‌ల వద్దకు వచ్చేసరికి కమ్యూనికేషన్ సమస్య మొదలైంది. ఇటీవల విడుదలైన నిశ్శబ్దం సినిమాలో అనుష్క పాటించిన చిట్కాను ఇక్కడ వినియోగించారు. బాధితుడు తన మొబైల్లో ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే, తెలుగులో బయటకు వినిపించే యాప్స్‌ను వినియోగించడంతో సమస్య పరిష్కారమైంది. రామచంద్రన్ పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, నోడల్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ వినయ్‌శేఖర్‌తో పాటు వైద్యులు, సిబ్బందికి రామచంద్రన్, సోదరుడు రామానుజన్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏ ఊరు వాడో?
విజయనగరం, డెంకాడ: మండలంలోని నాతవలస గ్రామానికి మంగళవారం ఓ బధిరుడు తప్పిపోయి వచేశాడు. ఊరు, పేరు చెప్పేందుకు ఆ వ్యక్తికి చెవిటి, మూగవాడు. దీనికి తోడు నిక్ష్యరాస్యుడు కావడంతో రాసికూడా చెప్పే అవకాశం లేకుండా పోయింది. తన సైగల ద్వారా ఏదో చెప్పాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. తనకు ఇద్దరు పిల్లలు అని మాత్రం సైగలు చేస్తున్నాడు. ఎక్కడికో పనికి తనవారితో గ్రూపుగా వెళుతూ తప్పిపోయి నాతవలసకు చేకున్నాడని ఆయన సైగల ద్వారా అర్థమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ట్రైన్లో వెళ్లుతూ నీళ్లు తాగేందుకు కిందకు దిగిలోపే ట్రైన్ వెళ్లిపోయినట్లు సైగల ద్వారా చెబుతున్నాడని అంటున్నారు. ఎలాగోలా చివరకు జాతీయ రహదారి పక్కనే ఉన్న నాతవలస ఎస్టీ కాలనీ వద్దకు చేరుకున్న ఆయన్ను వారంతా చేరదీశారు. మూడు నెలలుగా ఈ వ్యక్తి భోజన సదుపాయాలను ఎస్టీ కాలనీవాసులే కల్పిస్తున్నారు. మనిషి తెలుగు వ్యక్తిలాగే ఉన్నాడు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినవారు 8309034137, 7995620550, 8019714576 నంబర్లకు సమాచారం అందించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
‘మాట’కోసం మూగవేదన
ఈ బాలుడి పేరు కె.యువకిశోర్.. పుట్టు మూగవాడు. వైఎస్సార్ సీఎంగా ఉండగా రూ.6.50 లక్షల వ్యయంతో ఆరోగ్యశ్రీ పథకం కింద పైసా ఖర్చు లేకుండా కాక్లియర్ ఇప్లాంట్ ఆపరేషన్ ద్వారా ఇతనికి మాట తెప్పించారు. అయితే వినికిడి యంత్రం దెబ్బతినడంతో.. కొత్తదాని కోసం ప్రభుత్వానికి విన్నివించిన అతని తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. చిత్తూరు , కురబలకోట : కురబలకోట మండలంలోని అంగళ్లు గ్రామం ఇందిరాపురానికి చెందిన ఆదిమూర్తి అద్దెగదిలో బార్బర్ షాపు నిర్వహిస్తూ ఇంటికి నెట్టుకొస్తున్నాడు. అతని కుమారుడు యువకిశోర్ పుట్టు మూగవాడు. స్థానికంగా ఉన్న గోల్డెన్‌వ్యాలీ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్‌ను హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చేయించారు. రెండేళ్ల పాటు బిడ్డకోసం తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. ఆడియాలజిస్టు ద్వారా íస్పీచ్‌థెరఫీ ఇప్పించారు. అమ్మా.. నాన్న.. అప్ప.. అన్న.. అక్క.. అనే మాటలు పలకసాగాడు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్పందించని ప్రభుత్వం.. ఏళ్లు కావడంతో కాలక్రమంలో కాంక్లియర్ ఇంప్లాంటేషన మిషన్(వినికిడి యంత్రం) దెబ్బతింది. కొత్త మిషన్ కోసం అతని తండ్రి కె.ఆదిమూర్తి ఇప్పటి సీఎం చంద్రబాబును కలవడానికి రాజధాని అమరావతికి ఆరు సార్లు తిరిగినా దర్శన భాగ్యం కల్గలేదు. కొత్త మిషన్ రూ.6 లక్షలు అవుతుందని డాక్టర్లు ఎస్టిమేట్ ఇచ్చారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఉన్నపుడు వీరి పరిస్థితిని గుర్తించి ప్రధానమంత్రి నిధుల నుంచి రూ.2.59 లక్షలు మంజూరు చేయించారు. మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అధికార పార్టీ నాయకులు కేవలం రూ.50 వేలు మాత్రమే ఇప్పించారు. అది ఏమూలకు చాలకపోవడంతో చివరకు ఆ చెక్కు కూడా మురిగిపోయింది. ఒక్కసారి ఇస్తే మళ్లీ ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని రాష్ట్రప్రభుత్వం చేతులు దులుపుకుంది. రూ.6 లక్షలు ఇస్తే తప్ప కొత్త మిషన్ రాదు. దీంతో పాత మిషన్ పనిచేయక ఆరునెలలుగా యువకిశోర్ తిరిగి మూగవాడయ్యాడు. ఆవేదనలో తల్లిదండ్రులు.. యువకిశోర్ స్కూల్‌కు వెళ్తున్నాడన్న మాటేగాని అక్కడ టీచర్లు చెప్పే పాఠాలు విన్పించవని అతని తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు. ఒక్కడే కొడుకు. ఇన్నాళ్లు మాట్లాడిన కుమారుడు మునుపటి స్థితికి వెళ్లిపోవడంతో మౌనంగానే చెప్పకోలేని బాధను అనుభవిస్తున్నారు. లోలోన కుమిలిపోతున్నారు. మహానుభావుడు వైఎస్సార్ మాట తెప్పిస్తే.. ఇప్పటి సీఎం చంద్రబాబు వల్ల ఉన్న మాటపోయిందని కుటుంబీకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆయన లేని లోటు తెలిసొస్తోంది.. మూగవారు మాట్లాడటం.. చెవుటివారు వినడం అసాధారణం. ఇది దేవుడికే సాధ్యం. ఇలాంటి అసాధ్యాన్ని కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సుసాధ్యం చేసింది. బిడ్డకు మాటలు రావడానికి ఆరోగ్యశ్రీ ద్వారా దేవుడిలా వైఎస్సార్ ఆదుకున్నారు. రూ.6.50 లక్షలతో కాక్లియర్ ఇంప్లాంటేషన్ మిషన్‌తో మాట తెప్పించారు. ఆయన లేని లోటు ఇప్పుడు తెలిసొస్తోంది. కొత్త మిషన్ కోసం విన్నవిస్తే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.– ఆదిమూర్తి, యువకిశోర్ తండ్రి -
క్రికెటర్ బ్రెట్ లీ ఆర్థిక సాయంతో కొత్త జీవితం
కర్ణాటక, రాయచూరు రూరల్: పుట్టుకతోనే బధిర, మూగ అయిన చిన్నారి పాప జీవితంలో కొత్త వెలుగులు వచ్చాయి. బాలిక తల్లిదండ్రుల కష్టాలు తీరాయి. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా జవళగేరలో నివాసం ఉంటున్న బాలనగౌడ, కవిత అనే రైతు దంపతులకు సాక్షి అనే మూడేళ్ల కూతురు ఉంది. బాలిక పుట్టుకతోనే మూగ, చెవిటి. పాప అందరిలాగే వినాలని, మాట్లాడాలని కన్నవారు చేసిన ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాయచూరు ఆస్పత్రులు, మైసూరులోని మానస గంగోత్రి ఆస్పత్రిలో కూడా వైద్యం చేయించినా ఎలాంటి ఫలితం లభించలేదు. మూడేళ్ల పాటు శ్రమించారు. ఏడాది పాటు ఫిజియో థెరపీ చికిత్సలు చేయించారు. రూ. 16 లక్షలతో ఆపరేషన్ సింధనూరు అంగనవాడి కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన బాల స్వస్థ పథకం ద్వారా చికిత్సకు యత్నించారు. చెవులు మాటలు, చెవులు వినపడాలంటే రూ.16 లక్షలు ఖర్చువుతాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద నమోదు చే సుకోగా, చికిత్సకు ఎంపికైంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ బ్రెట్ లీ చి న్నారి శస్త్రచికిత్సకు ఆర్థికసాయం అందజేశారు. దీంతో బెంగళూరులోని ఒక కార్పొ రేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా కాంక్లియర్ ఇంప్లాంట్ తదితర ఆధునిక పరికరా లను బాలిక చెవిలో అమర్చారు. దీంతో బాలిక చక్కగా వినడంతో పాటు మా ట్లాడుతోంది.బ్రెట్‌లీకి బాలికతల్లిదండ్రులు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. -
రాములు వచ్చేదెట్టా?
సత్తుపల్లి : మతి స్థిమితం సరిగ్గా లేక, మూగ, చెవిటి వైకల్యంతో ఉన్న ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కంచపోగు పెద్దరాములు అదృశ్యమై ఏడాది కాలం తర్వాత..అతను రాజస్తాన్ రాష్ట్రంలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చక్కర్లు కొట్టడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు అతడిని రప్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన ఇతను అవివాహితుడు. 70 ఏళ్ల వయస్సులో..గతేడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు చాలా చోట్ల వెతికినా ప్రయోజనం కన్పించలేదు. అప్పట్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. శుభకార్యాల్లో వంటలు చేస్తూ జీవించేవాడు. అయితే..పరిశుభ్రత అంటే..చాలా ఇష్టమని, ఎక్కడ చిన్న చెత్తకాగితం కనిపించినా తీసి పక్కకు వేస్తుంటాడని, శుభకార్యాలప్పుడు వచ్చి పరిసరాలను పరిశుభ్రం చేస్తుంటాడని, స్థానికంగా సుపరిచితుడని ఇక్కడివారు చెబుతున్నారు. ఈక్రమంలో రెండురోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్దరాములు రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ ప్రాంతలో ఉన్నట్లు వచ్చింది. రాజస్తాన్ పత్రికలో తన వారి కోసం వృద్ధుడి ఆరాటం.. పేరిట కథనం కూడా ప్రచురితమైంది. తెలుగువాడు అయినందున సోషల్ మీడియాలో తెలుగు వాళ్లందరికీ పోస్టు చేశారు. ఈ ప్రాంతంలోని కొందరు గుర్తించడంతో పెద్దరాములు రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో ఉన్నట్లు వెలుగుచూసింది. కలెక్టర్, సీపీకి వినతి.. రాజస్తాన్ రాష్ట్రం నుంచి కంచపోగు పెద్దరాములును తీసుకొచ్చేందుకు సహకారం అందించాలని బంధువులు కలెక్టర్ లోకేష్‌కుమార్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌లను కలిసి వేడుకున్నారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దరాములును అప్పగించాలని కోరారు. -
వాట్సప్ కలిపింది ఇద్దరినీ
సాక్షి, బళ్లారి:ఇద్దరికీ ముఖ పరిచయం లేదు, మాటలు రావు, చెవులు వినిపించవు. అయినా ఇద్దరినీ వాట్సప్ ద్వారా చాటింగ్‌తో పరిచయం మొగ్గతొడిగి అది ఇరు హృదయాల మధ్య ప్రేమగా మారింది. వివాహ భాగ్యంతో ఒక్కటయ్యారు. ఆదివారం బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని బనశంకరి కళ్యాణ సముదాయ భవనంలో కుటుంబ సభ్యులు, బం«ధుమిత్రుల సమక్షంలో మూగబధిరులైన అశ్విని, ఈశ్వర్లు పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ఈశ్వర్, అశ్వినీ ఇద్దరూ వేర్వేరు జిల్లాలకు చెందిన వారు, పుట్టుకతోనే దివ్యాంగులు. వారి వారి తల్లిదండ్రులు ఎంతో ఓర్పుతో, కష్టంతో చదివించారు. ప్రైవేటు కంపెనీలో ఇద్దరికీ ఉద్యోగాలు లభించాయి. అయితే వీరిద్దరికీ గతంలో ఎలాంటి పరిచయం లేదు. వాట్సప్ ద్వారా పరిచయమై ప్రేమగా మారింది. నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధు–మిత్రులు అతనిది రాయచూరు, ఆమెది కొట్టూరు రాయచూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తిప్పణ్ణ, మంజుల కుమారుడు ఈశ్వర్. ఐటీఐలో ఎలక్ట్రికల్ పూర్తి చేశారు. ప్రస్తుతం హెచ్‌ఆర్‌బీఎల్ కంపెనీలో పని చేస్తున్నారు. బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలో కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ తిప్పేస్వామి, రత్నమ్మ దంపతులకు కలిగిన అశ్వినీ కూడా పుట్టుకతోనే మూగ. ఆ దంపతులు తమ కూతురికి మాటలు రావనే చింతను వదిలేసి ఎంతో కష్టపడి చదివించారు. ఆమె కూడా కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది.ఇద్దరూ తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలిపి పెళ్లికి ఒప్పించారు. బంధుమిత్రుల నడుమ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది. -
మీ సాయం జన్మలో మరచిపోలేమన్నా..
కర్నూలు: పుట్టుకతోనే మూగ, చెవుడు అయిన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వెల్తుర్ల చినఓబులేసు, రాణమ్మ దంపతుల కుమారుడు సందీప్‌కు రూ.7 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉచితంగా చేయించారు. తమ బిడ్డకు వినికిడి శక్తి వచ్చిందంటూ ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఆదివారం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
మూగ పాత్రలో యంగ్ హీరో
కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో మూగవానిగా కనిపించనున్నాడు. నారా రోహిత్ 18వ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాను శ్రీ వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్ పై నారాయణరావు అట్లూరి నిర్మిస్తున్నారు. వంశీ రాజేష్ కథా మాటలు అందిస్తుండగా పీబీ మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది రోజున ప్రారంభం కానుంది. -
అపరూప జంట..
సాక్షి, హావేరి(బొమ్మనహళ్లి): పుట్టు మూగ అయిన ఓ ప్రత్యేక జంట శుక్రవారం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన కర్టాటక రాష్ట్రంలోని హావేరి పట్టణంలో చోటుచేసుకుంది. హావేరి నగరంలోని రేణుకా కళ్యాణ మందిరంలో వివాహం ఘనంగా జరిగింది. నగరానికి చెందిన శివపుత్రప్ప కుమారుడు గంగాధర్‌కు పుట్టినప్పటి నుంచి మాటలు రావు. పీయూసీ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం మేనమాక ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. అదే జిల్లా శింగాం తాలూకా బంకాపుకు చెందిన గురుసిద్దప్ప కుమార్తె పవిత్ర కూడా పుట్టుకతోనే మూగ. దీంతో ఇరువైపుల పెద్దలు మాట్లాడుకుని వీరికి వివాహం జరిపించారు. ఈ అపురూప జంటను అతిథులు పెద్ద మనసుతో ఆశ్వీరదించారు. -
పసి మొగ్గపై పైశాచికం
అభంశుభం తెలియని 17ఏళ్ల మూగ, చెవుడు యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన విజయవాడలోని భవానీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55ఏళ్ల సాంబశివరావు అనే వ్యక్తి చిన్నారిపై నెల రోజులుగా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడని తల్లి సోమవారం భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భవానీపురం (విజయవాడ పశ్చిమ): మూగ, చెవుడు, ఆపై మతిస్థిమితంలేని బాలికపై ఒక వ్యక్తి నెల రోజులుగా లైంగికదాడి చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తల్లి భవానీపురం పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. గొల్లపూడి సారాయి కొట్టు సెంటర్లో ఓ మహిళ నివసిస్తోంది. భర్తతో పదేళ్ల కిందట విడిపోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం చేసింది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ మతిస్థిమితంలేని చిన్నకుమార్తె(17)తో కలిసి జీవిస్తోంది. గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామానికి చెందిన వీర్ల సాంబశివరావు(55) కుమార్తె గొల్లపూడిలో నివసిస్తోంది. ఆమె ఇంటిలోనే బాలికతల్లి అద్దెకు ఉంటూ, ఆ ఇంట్లోనే పాచిపనులు చేస్తోంది. తన కుమార్తె ఇల్లు నిర్మిస్తుండటంతో సాంబశివరావు నాలుగురోజులు ఇక్కడుంటే మూడు రోజులు స్వగ్రామం వెళ్లొస్తున్నాడు. సాంబశివరావు నెల రోజులుగా తల్లి ఇంట్లో లేని సమయంలో మతిస్థిమితంలేని బాలికపై లైంగికదాడి చేస్తున్నాడు. బాలిక సైగలద్వారా తల్లికి విషయం చెప్పడంతో ఆమె సాంబశివరావును నిలదీ సింది. తమపైనే ఆరోపణలు చేస్తావా అంటూ వారిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేసి బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నటిస్తే ఉన్న మాట పోయింది!
వాడకుండా వదిలేస్తే ఏ వస్తువైనా పనిచేయడం మానేస్తుంది. మానవులు కూడా ఇందుకు అతీతం కాదు. 12 ఏళ్ల పాటు మూగవాడిగా నటించిన ఓ వ్యక్తి నిజంగానే మూగవాడయ్యాడు. అసలు ఎందుకు నటించాల్సి వచ్చిందంటే.. చైనా జెన్‌జియాంగ్ తూర్పు ప్రావిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన 33 ఏళ్ల చెంగ్ 2005లో రూ.5 వేల అద్దె వివాదంలో తన భార్య తరపు బంధువొకరిని చంపాడు. పోలీసులకు చిక్కుతానన్న భయంతో మనోడు ఊరు వదిలిపెట్టి మరో చోటుకు పారిపోయాడు. పేరు మార్చుకుని మూగవాడిగా నటిస్తూ చిన్న పాటి ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. అయితే కుట్ర ఎంతోకాలం దాగదు కదా.. చివరికి పోలీసులకు చిక్కాడు. అతడి రక్త నమూనాలు సేకరించిన పోలీసులు డీఎన్ఏ పరీక్షలకు పంపారు. అసలు భండారం బయటపడటంతో ఆఖరికి నేరాన్ని అంగీకరించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మూగవాడిగా నటించడంతో మాట కోల్పోయినట్లు పేపర్‌పై రాసి చూపాడు. -
అనూహ్యం: నటించాడు.. నిజమైంది!
బీజింగ్: వాడకుండా వదిలేస్తే ఏ వస్తువైనా పనిచేయడం మానేస్తుంది. మనిషి అవయావాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీనికి నిదర్శనంగా నిలిచే ఉదంతం చైనాలో జరిగింది. 12 సంవత్సరాల పాటు మూగవాడిగా నటించిన ఓ వ్యక్తి చివరకు నిజంగానే మాట కోల్పోయాడు. అసలేం జరిగింది... ఝెజియాంగ్ తూర్పు ప్రావిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన జెంగ్ 33 ఏళ్ల చెంగ్ 2005లో కేవలం 5 వేల రూపాయల అద్దె వివాదంలో తన భార్య తరపు బంధువొకరిని చంపేశాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సొంతూరు వదిలిపెట్టి మరో ప్రావిన్స్‌కు పారిపోయాడు. పేరు మార్చుకుని మూగవాడిగా నటిస్తూ ఓ నిర్మాణ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు. ఇలా దొరికాడు.. ఎవరికీ అనుమానం రాకుండా రహస్య జీవితం గడుపుతున్న జెంగ్పై పోలీసులు కన్నుపడింది. అతడి దగ్గర ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. దీంతో పోలీసులు గత అక్టోబర్‌లో అతడి రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపారు. 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ హత్య కేసు నిందితుడి తల్లిదండ్రులతో జెంగ్ డీఎన్ఏ సరిపోలింది. బండారం బయటపడటంతో జెంగ్ నేరాన్ని అంగీకరించాడు. 12 ఏళ్లు మూగవాడిగా నటించడంతో మాట కోల్పోయానని అతడు పేపర్‌పై రాసి పోలీసులకు వెల్లడించాడని స్థానిక దినపత్రిక పేర్కొంది. అతడు దోషిగా తేలితే మరణశిక్ష పడే అవకాశముంది. -
ఎవరికీ చెప్పుకోను..?
అధికారుల తప్పిదంతో దక్కని ఉద్యోగం ఓ మూగ నిరుద్యోగి ఆవేదన ముకరంపుర: ఓ మూగ నిరుద్యోగితో అధికారులు చెలగాటమాడారు.. నోరుండి మాట్లాడలేని ఆ వ్యక్తి అధికారుల పొరపాటును నిలదీయలేకపోయాడు.. ఫలితంగా దక్కాల్సిన ఉద్యోగం చేజారిపోయింది. చివరికి తప్పు అధికారిదేనని ఒప్పుకునేసరికి ఉద్యోగ ఖాళీలు లేకుండా పోయాయి. తమ్ముడి సాయంతో సోమవారం ప్రజావాణిని ఆశ్రయించిన ఆ మూగ ఉద్యోగి ఆవేదన ఇది.. గోదావరిఖని :యెటింక్లయిన్ కాలనీకి చెందిన జె.సదానందం పుట్టుకతోనే మూగ. పట్టుదలతో డిగ్రీ పూర్తిచేశాడు. 2015 నవంబర్‌లో వికలాంగకోటాలో ఉద్యోగఖాళీలకు నోటిఫికేషన్ రాగా.. దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్ రిపోర్టు సమర్పించాడు. ఉద్యోగ ఖాళీలన్నీ 7వ తరగతి అర్హత కింద ఉన్న అటెండర్ పోస్టులే.. అయినా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే సంకల్పంతో దరఖాస్తు చేశాడని అతడి తమ్ముడు రఘు వివరించాడు. ఆయా మండలాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని నిబంధన ఉండడంతో ఆసక్తి చూపాడు. తీరా విద్యాశాఖలో 7వ తరగతి విద్యార్హతల సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని, స్కూల్రికార్డులో లేదని, అవి సరిపోలడంలేదని కారణంచూపారు. దీంతో సదానందం తర్వాత అర్హత మరొకరిని మెరిట్‌ప్రకారం ఉద్యోగంలోకి తీసుకున్నారు. తప్పు విద్యాశాఖపై నెట్టేసిన వికలాంగుల శాఖ తమదేమీ లేదన్నట్లు వ్యవహరించింది. బాధితుడు విద్యాశాఖ చుట్టూ తిరగగా.. డీఈవో స్వయంగా పరిశీలించి 7వ తరగతి సర్టిఫికెట్ ఒరిజినల్‌గా నిర్ధారించి పొరపాటు చేసిన సెక్షన్ ఇన్చార్జిపై ఆగస్టు 18న చర్యలకు ఆదేశించారు. ఈలోపు ఖాళీ ఉద్యోగం వేరొకరికి దక్కగా.. మొత్తం 30 మందికి పోస్టింగులిచ్చేశారు. సోమవారం ఒరిజినల్ అర్హత సర్టిఫికెట్లతో కలెక్టర్ నీతూప్రసాద్‌ను ఆశ్రయిస్తే ఏజేసీని విచారించాల్సిందిగా ఆదేశించారు. ఆయన వికలాంగులశాఖ ఏడీ నళిని పిలిచి ఆరాతీస్తే ఖాళీలు లేవని, తప్పు విద్యాశాఖదేనని, ఖాళీల కోసం కలెక్టర్‌కు లెటర్ పెడుతామని పేర్కొన్నారు. ఆ మూగ సైగలు 8 నెలలుగా ఎవరికీ పట్టలేదు. కళ్లుండి తప్పిదాలు చేసిన అధికారి తీరుతో ఆ మూగ నిరుద్యోగికి ఉద్యోగం కోసం నిరీక్షణ తప్పడం లేదు.. కలెక్టరమ్మ స్పందించి వికలాంగుల కోటాలో అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పించాలని సదానందం తన తమ్ముడు రఘు సాయంతో వేడుకున్నాడు. -
ఒక్కటైన మూగ మనసులు
-
దొంగ అనుకొని మూగవాడిని చంపేశారు
మదనపల్లె (చిత్తూరు) : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మూగ యువకుడిని దొంగ అనే నెపంతో స్థానికులు కొట్టిచంపారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రంగనాథ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న షేక్ చాంద్‌పాషా (24) లారీ క్లీనర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన అక్క ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో కొందరు స్థానికులు అడ్డుకొని ఎక్కడికి వెళ్లి వస్తున్నావని ప్రశ్నించారు. అతడు మూగవాడు కావడంతో సమాధానం చెప్పలేదు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు అతడిపై విరుచుకుపడ్డారు. మూగవాడు అనే విషయం తెలియక, అతన్ని దొంగగా భావించి తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక అతను మృతిచెందాడు. విషయం తెలుసుకున్న చాంద్‌పాషా తండ్రి అన్వర్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో మహిళలు కూడా పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వైకల్యాన్ని జయించిన ప్రతిభ
ఆయన పుట్టుకతోనే మూగ, చెవిటి వ్యక్తి. మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్ననాటి నుంచి బొమ్మలు వేయడమంటే ప్రాణం. ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీనికి తోడు సమయం దొరికినప్పుడల్లా తాను అభిమానించే వారి చిత్రాలు గీస్తుంటాడు. తాను గీసిన చిత్రాలకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఆయనే పోడుపాటి వెంకటేశ్. - వెంకటేష్ పుట్టుకతోనే మూగ, చెవిటి - అయినా అద్భుత ప్రతిభ - ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణ సిద్దిపేట రూరల్ : పోడుపాటి వెంకటేశ్ స్వస్థలం కొండపాక మండల కేంద్రం. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌లో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య రేవతి, ఇద్దరు పిల్లలున్నారు. చిన్ననాటి నుంచే మూగ, చెవుడు. ఎంతో కష్టపడి ఐటీఐ, డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఇర్కోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. వీటికి తోడు చిన్ననాటి నుంచి చిత్రకళపై ఆయన పెంచుకున్న అభిమానం అనేక మంది అభిమానాన్ని పొందేలా చేసింది. తనకు నచ్చిన వ్యక్తుల ఫొటోలను తీసుకుంటూ.. వాటి ఆధారంగా బొమ్మలను గీస్తూ వారికే గిప్టుగా అందిస్తుంటాడు. వెంకటేశ్ ఎక్కువగా ఆర్టీసీ చిత్రాలను గీస్తూ అదే బస్సులో ఫొటోలను అతికిస్తాడు. ప్రముఖుల చిత్రాలు... వెంకటేశ్ చిన్ననాటి నుంచి ఎక్కువగా ఆర్టీసీ బస్సుల చిత్రాలను గీసేవాడు. ప్రస్తుతం వాటితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, దేవుళ్ల చిత్రాలను చూసి పెన్సిల్‌తో గీసి స్కెచ్‌తో కలర్లు వేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. గతంలో మంత్రి హరీష్‌రావుతో పలుమార్లు అభినందనలు అందకున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలి : వెంకటేష్ తనకు చిన్ననాటి నుంచి చిత్రాలు వేయడం అలవాటని, ప్రభుత్వం గుర్తించి తనను ఆదుకుంటే చిత్రలేఖనంలో మరింత రాణిస్తా (సైగలతో) నంటూ వెంకటేశ్ పేర్కొన్నాడు. తనకు ఏదైనా ఇష్టం అనిపిస్తే చాలు దాన్ని బొమ్మ రూపంలో వ్యక్తపరుస్తానని పేపరు మీద రాసి చూపించాడు. ఇప్పటి వరకు చాలా మంది ప్రశంసలు పొందినట్లు కుటుంబికులు తెలిపారు. -
వికలాంగ సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇస్తలేరు
సంగారెడ్డి అర్బన్: చెవిటి, మూగనైన తనకు హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రి అధికారులు ధ్రువపత్రం ఇచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని తనకు పింఛన్ మంజూరు చేయాలని దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన దండు కుమారస్వామి కోరారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధితాధికారులకు అర్జీలను అందజేశారు. వికలాంగురాలైన తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని గత 15 సంవత్సరాలుగా సొంత ఇంటి కొరకై పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, ఇల్లు మంజూరు చేయాలని రామచంద్రాపురానికి చెందిన డి.వెంకటేశ్వరమ్మ జేసీ శరత్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో జేసీ మండలంలోని ఏదైనా ఒక గ్రామంలో ఆమెకు ఇల్లు మంజూరు చేయాలని తహాశీల్దార్‌ను ఆదేశించారు. పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామం బామన్ల కుంట చెరువును చెరువును తప్పుడు సేల్‌డీడ్‌తో 32 మంది వ్యక్తులు తప్పుడు హద్దులు చూపించి అక్రమించుకున్నారని ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని గొల్ల నిమ్మలయ్య జొన్నాడ క్రిష్టా యాదవ్, శివరాజ్ ఫిర్యాదు చేశారు. సదాశివపేట మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన గౌటాన్ భూమిలో దళితులైన తమకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇవ్వాలని గ్రామానికి చెందిన నర్సమ్మ, ఎల్లమ్మ, యశోద, మంజుల తదితరులు కోరారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటర్ల అవగాహన వాహనానికి జేసీ శరత్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్వో దయానంద్ పాల్గొన్నారు. -
ఆగని కామాంధుల దారుణాలు
మొన్న ఐనవోలులో మూగ యువతిపై, నేడు వుహేశ్వరంలో మూగ బాలికపై లైంగికదాడి బండారుపల్లిలో ఏడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారం నర్సంపేట : జిల్లాలో మృగాళ్ల అకృత్యాలు ఆగడం లేదు. ఇటీవల మూగ యువతిపై ఐనవోలులో ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటనను మరవక ముందే మహేశ్వరంలో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని మూగబాలికను అన్నం పెడతానని తీసుకెళ్లిన ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అలాగే ములుగు మండలం బండారు పల్లి శివారులో ఏడేళ్ల బాలికపై పదిహేనేళ్ల బాలుడు శనివారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మూడు ఘటనలూ సభ్యసమాజానికి మచ్చతెచ్చారుు. లైంగి కదాడుల నిరోధానికి నిర్భయ లాంటి చట్టాలు చేసి నా కొందరు మృగాళ్ల పశుప్రవృత్తిలో మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాలో వరుసగా జరుగుతు న్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారుు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం వుహేశ్వరం గ్రావూనికి చెందిన తుత్తురి రవి(40) ఉదయుం 11 గంటల సవుయుంలో తన ఇంటికి సమీపంలోని ఇంటి వద్ద ఉన్న వుూగ బాలి కను తీసుకెళుతుండగా ఆమె నానమ్మ చూసింది. ఎక్కడికి తీసుకెళుతున్నావని అతడిని ఆ వృద్ధురాలు అడగగా అన్నం తినిపిస్తానని చెప్పాడు. వరసకు పెద్దనాన్న కావడంతో నమ్మిన వృద్ధురాలు చాలాసేప టి తర్వాత అనువూనం వచ్చి రవి ఇంటికి వెళ్లి చూడగా లైంగి కదాడికి పాల్పడుతుండడంతో అరిచింది. దీంతో రవి సంఘటన స్థలం నుంచి పరారవుతుండగా స్థానికులు గవునించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సవూచారమివ్వగా ఇన్చార్జీ ఎస్సై వెంకటేశ్వర్లు సంఘట న స్థలానికి చేరుకుని రవిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మూగ,చెవిటి యువతిపై సామూహిక లైంగికదాడి
* చెట్టుకు కట్టేసి.. సొమ్మసిల్లేలా కొట్టి * పుట్టు మూగ అని చూడకుండా అమానుషం ఎంజీఎం : పుట్టు మూగ, చెవిటి అయిన కూతురిని ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆర్థికబాధలు వెంటాడుతున్నా... ఇంటర్ వరకు చదివించారు. ఆపై స్థోమత లేకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్న ఆమెను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. వికలాంగురాలినని బాధపడకుండా... సదరు యువతి సైతం ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి వెతుక్కుంది. నిరుపేద కుటుంబానికి తన వంతు అండగా ఉండాలని, తన కాళ్లపై తాను జీవించాలనే పట్టుదలతో కుట్టు మిషన్ నేర్చుకుంది. తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆసరాగా నిలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తమ కూతురుకు జరిగిన అమానవీయ సంఘటన ఆ వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామానికి చెందిన కొత్తూరి ఎల్లయ్య, ఉపేంద్ర దంపతుల కళ్లల్లో నీరు ఇంకేలా చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు మూగ యువతి కళ్లకు గంతలు కట్టి... పిడిగుద్దులతో సొమ్మసిల్లిపోయేలా చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చెట్టుకు కట్టివేసి.. సొమ్మసిల్లి పడిపోయి ఉండడాన్ని చూసి వారు రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. ‘చిన్న బిడ్డ ఆరేండ్ల క్రితం చనిపోయింది... ఉన్న ఒక్కగానొక్క కొడుకు వేరే చోట ఉంటున్నడు. నా బిడ్డ కోసమే కూలీనాలి చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం... అది కూడా మమ్మల్ని కష్టపెట్టకుండా జీవిస్తోంది... ఎవరి కన్ను కుట్టిందో.. ఇంత దారుణానికి ఒడిగటటిండ్రు’ అని విలపించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. సీకేఎంలో గంటపాటు అందని వైద్యం బాధితురాలిని ముందుగా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆమెను వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి తరలించగా... అక్కడా తిప్పలు తప్పలేదు. స్ట్రెచర్‌పై తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న యువతిని గంట పాటు ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ఇంతలో ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి వైద్యం అందకపోవడంపై మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్లు పోసి ఆస్పత్రిని నిర్మించి... లక్షల రూపాయాల జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైద్యులను దేవుళ్లతో కొలుస్తారని, ఇంకా అలసత్వం ప్రదర్శించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త నమూనాలను సేకరించి లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. డీజీఓ సుజాత, ఇతర జూనియర్ డాక్టర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పరిస్థితిని గమనించి వైద్యసేవలందించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, బాధితురాలిని పరామర్శించిన అనంతరం వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా మూగ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డారని, కారకులైన నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో వర్ధన్నపేట ఎంపీపీ మార్నెని రవీందర్రావు, సర్పంచ్ పల్లంకొండ సురేష్ తదితరులు ఉన్నారు. నిందితులను వదిలిపెట్టం : ఎస్పీ కిషోర్ ఝా మహిళపై అకృత్యానికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్చార్జ్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, క్రైం అడిషనల్ ఏఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. బాధితురాలి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించి, కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించారు. -
చంపేశారు...!
బద్వేలు: ఈ బాలుడి పేరు కృష్ణమోహన్.. వయస్సు పదేళ్లు.. పుట్టుకతోనే మూగ, చెవుడు.. బద్వేలు పట్టణంలోని 14వ వార్డుకు చెందిన ఇతనికి జనవరి నుంచే వికలాంగ పింఛన్ మంజూరైంది. ఈ విషయం కృష్ణమోహన్‌కు గానీ, కుటుంబసభ్యులకుగానీ తెలియదు. తనకు పింఛన్ వస్తున్నట్లు ఇటీవలే తెలుసుకున్న కృష్ణమోహన్ అక్టోబర్ నెల పింఛన్ తీసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లాడు.. నీ పింఛన్ 10 వార్డులోకి మారిపోయిందని అధికారులు చెప్పడంతో అక్కడికి వెళ్లాడు.. అడ్రస్, ఆధార్‌కార్డు, వికలాంగ సర్టిఫికేట్ అన్నీ సరిగా ఉన్నా పేరు మారింది. కృష్ణమోహన్‌కు బదులుగా వై. కొరగింజగా పేరు మారింది. అంతేకాకుండా పరిశీలనలో కొరగింజ మృతి చెందినట్లుగా భావించి పింఛన్‌ను తొలగించినట్లు చావుకబురు చల్లగా చెప్పారు. జనవరి నుంచి మంజూరైన మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించామన్నారు. తనకు న్యాయం చేయాలని, తాను బతికే ఉన్నానని మూగ సైగలు చేస్తూ అధికారుల చుట్టూ కృష్ణమోహన్ తిరుగుతున్నాడు. -
బధిరుల దినోత్సవం నేడు
-
తిరుమలలో మూగకు మాటలు
-
తిరుమలలో అద్బుతం....మూగకు మాటలు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో శనివారం అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్‌కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చిన మూడు నిమిషాల తర్వాత వకుళమాత ఆలయంతో తీర్థం తీసుకున్న అనంతరం దీపక్ (18) నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా వినిపించింది. అయితే ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే....లండన్‌కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్‌కు లండన్‌లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు. కాగా చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే దీపక్ కుటుంబ సభ్యులను కలుసుకుని అభినందించారు. వారికి స్వామివారి ప్రసాదాలను అందించారు.ఇదో అద్బుతం అని,ఇలాంటివి తెలిక మరెన్నో అద్భుతాలు జరుతున్నాయని అందుకే తిరుమల శ్రీనివాసుని దర్శించుకోటానికి రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారని ఆలయ అధికారి చిన్నంగారి రమణ అన్నారు. స్వామివారిని మనసారా వేడుకుంటే కోర్కెలు తప్పకుండా తీరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.