
నారా రోహిత్
కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో మూగవానిగా కనిపించనున్నాడు.
నారా రోహిత్ 18వ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాను శ్రీ వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్ పై నారాయణరావు అట్లూరి నిర్మిస్తున్నారు. వంశీ రాజేష్ కథా మాటలు అందిస్తుండగా పీబీ మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది రోజున ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment