
వాడకుండా వదిలేస్తే ఏ వస్తువైనా పనిచేయడం మానేస్తుంది. మానవులు కూడా ఇందుకు అతీతం కాదు. 12 ఏళ్ల పాటు మూగవాడిగా నటించిన ఓ వ్యక్తి నిజంగానే మూగవాడయ్యాడు. అసలు ఎందుకు నటించాల్సి వచ్చిందంటే.. చైనా జెన్‌జియాంగ్ తూర్పు ప్రావిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన 33 ఏళ్ల చెంగ్ 2005లో రూ.5 వేల అద్దె వివాదంలో తన భార్య తరపు బంధువొకరిని చంపాడు.
పోలీసులకు చిక్కుతానన్న భయంతో మనోడు ఊరు వదిలిపెట్టి మరో చోటుకు పారిపోయాడు. పేరు మార్చుకుని మూగవాడిగా నటిస్తూ చిన్న పాటి ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. అయితే కుట్ర ఎంతోకాలం దాగదు కదా.. చివరికి పోలీసులకు చిక్కాడు. అతడి రక్త నమూనాలు సేకరించిన పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. అసలు భండారం బయటపడటంతో ఆఖరికి నేరాన్ని అంగీకరించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మూగవాడిగా నటించడంతో మాట కోల్పోయినట్లు పేపర్‌పై రాసి చూపాడు.
Comments
Please login to add a commentAdd a comment