జిల్లాలో మృగాళ్ల అకృత్యాలు ఆగడం లేదు. ఇటీవల మూగ యువతిపై ఐనవోలులో ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ....
మొన్న ఐనవోలులో మూగ యువతిపై,
నేడు వుహేశ్వరంలో మూగ బాలికపై లైంగికదాడి
బండారుపల్లిలో ఏడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారం
నర్సంపేట : జిల్లాలో మృగాళ్ల అకృత్యాలు ఆగడం లేదు. ఇటీవల మూగ యువతిపై ఐనవోలులో ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటనను మరవక ముందే మహేశ్వరంలో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని మూగబాలికను అన్నం పెడతానని తీసుకెళ్లిన ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అలాగే ములుగు మండలం బండారు పల్లి శివారులో ఏడేళ్ల బాలికపై పదిహేనేళ్ల బాలుడు శనివారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మూడు ఘటనలూ సభ్యసమాజానికి మచ్చతెచ్చారుు. లైంగి కదాడుల నిరోధానికి నిర్భయ లాంటి చట్టాలు చేసి నా కొందరు మృగాళ్ల పశుప్రవృత్తిలో మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాలో వరుసగా జరుగుతు న్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారుు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం వుహేశ్వరం గ్రావూనికి చెందిన తుత్తురి రవి(40) ఉదయుం 11 గంటల సవుయుంలో తన ఇంటికి సమీపంలోని ఇంటి వద్ద ఉన్న వుూగ బాలి కను తీసుకెళుతుండగా ఆమె నానమ్మ చూసింది. ఎక్కడికి తీసుకెళుతున్నావని అతడిని ఆ వృద్ధురాలు అడగగా అన్నం తినిపిస్తానని చెప్పాడు. వరసకు పెద్దనాన్న కావడంతో నమ్మిన వృద్ధురాలు చాలాసేప టి తర్వాత అనువూనం వచ్చి రవి ఇంటికి వెళ్లి చూడగా లైంగి కదాడికి పాల్పడుతుండడంతో అరిచింది. దీంతో రవి సంఘటన స్థలం నుంచి పరారవుతుండగా స్థానికులు గవునించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సవూచారమివ్వగా ఇన్‌చార్జీ ఎస్సై వెంకటేశ్వర్లు సంఘట న స్థలానికి చేరుకుని రవిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.