అపరూప జంట..  | dumb couple get married in karnataka | Sakshi
Sakshi News home page

అపరూప జంట.. 

Published Fri, Feb 9 2018 7:47 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

dumb couple get married in karnataka - Sakshi

సాక్షి, హావేరి(బొమ్మనహళ్లి): పుట్టు మూగ అయిన ఓ ప్రత్యేక జంట శుక్రవారం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన కర్టాటక రాష్ట్రంలోని హావేరి పట్టణంలో చోటుచేసుకుంది. హావేరి నగరంలోని రేణుకా కళ్యాణ మందిరంలో వివాహం ఘనంగా జరిగింది. నగరానికి చెందిన శివపుత్రప్ప కుమారుడు గంగాధర్‌కు పుట్టినప్పటి నుంచి మాటలు రావు. పీయూసీ వరకు చదువుకున్నాడు.

ప్రస్తుతం మేనమాక ప్రింటింగ్‌​ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. అదే జిల్లా శింగాం తాలూకా బంకాపుకు చెందిన గురుసిద్దప్ప కుమార్తె పవిత్ర కూడా పుట్టుకతోనే మూగ. దీంతో ఇరువైపుల పెద్దలు మాట్లాడుకుని వీరికి వివాహం జరిపించారు. ఈ అపురూప జంటను అతిథులు పెద్ద మనసుతో ఆశ్వీరదించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement