
మైసూరు: పెళ్లి కోసం ఎన్నిచోట్ల వెతికినా అమ్మాయి దొరకడం లేదు. నాకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు అని ఆవేదనకు లోనైన యువకుడు ఉరేసుకుని బతుకు చాలించాడు. నంజనగూడు తాలూకాలోని కప్పసోగు గ్రామంలో సోమవారం చోటు చెసుకుంది. ప్రవీణ్ (28) అనే యువకునికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆరు ఏడు సంవత్సరాలుగా సంబంధాలను వెతుకుతున్నారు. ఏ అమ్మాయి కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు. హుల్లహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment