సాక్షి, బెంగళూరు: తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు అడ్డుచెప్పాడనే ఆక్రోశంతో యువతి చిన్నాన్నను ఓ యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన చిత్రదుర్గం జిల్లా హోలాల్కెర తాలూకా చిత్రహళ్లి గొల్లరహట్టిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన ఈశ్వరప్ప(65) అన్న కుమారుడు చిత్రలింగ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కొద్ది రోజుల క్రితం తన చినాన్న ఈశ్వరప్పకు తెలిపాడు. అయితే ఆ యువతి ఈశ్వరప్పకు మనువరాలు అవుతుంది.
దీంతో ఆమె భవిష్యత్ దృష్ట్త్యా వారి ప్రేమపెళ్లికి ఈశ్వరప్ప అడ్డు చెప్పాడు. దీంతో ఈశ్వరప్పపై చిత్రలింగ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఈశ్వరప్పను కత్తితో పొడిచి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. తమ వివాహానికి అడ్డు చెప్పడంతోనే ఈశ్వరప్పను అంతం చేసినట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment