
కర్నూలు: పుట్టుకతోనే మూగ, చెవుడు అయిన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వెల్తుర్ల చినఓబులేసు, రాణమ్మ దంపతుల కుమారుడు సందీప్‌కు రూ.7 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉచితంగా చేయించారు. తమ బిడ్డకు వినికిడి శక్తి వచ్చిందంటూ ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఆదివారం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.