kovelakuntla
-
చెత్త నుండి సంపద సృష్టిస్తున్న కోవెలకుంట్ల గ్రామపంచాయతీ
-
గుంటూరు, తిరుపతి మధ్య కొత్త రైలు
జమ్మలమడుగు (వైఎస్సార్ జిల్లా): నంద్యాల– ఎర్రగుంట్ల మధ్య మరో రైలు పట్టాలెక్కబోతుంది. ఈనెల 18వ తేదీన గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17261/17262) రాబోతుంది. ఇప్పటికే నంద్యాల– ఎర్రగుంట్ల రహదారిలో డెమో రైలు నడుస్తోంది. ప్రస్తుతం మరొకటి రాబోతుండటం.. నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు నంద్యాల, బనగాపల్లి, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడపలో మాత్రమే స్టాపింగ్ పెట్టారు. కొవెలకుంట్ల, జమ్మలమడుగులో స్టాపింగ్ లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహపడుతున్నారు. మూడో రైలు పరుగులు తీయబోతుంది... ఇప్పటికే డెమో.. ధర్మవరం–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లు ఎర్రగుంట్ల–నంద్యాల మీదుగా నడుస్తున్నాయి. కరోనా కారణంగా నంద్యాల– ఎర్రగుంట్ల డెమో రైలు దాదాపు రెండు సంవత్సరాలుగా నిలిపివేశారు. గత నెల 16వతేదీ నుంచి తిరిగి డెమో పునఃప్రారంభమైంది. అదేవిధంగా ధర్మవరం– విజయవాడ రైలు కూడా ఉదయం – రాత్రి పూట నడుస్తుంది. దీనికి అదనంగా రైల్వేశాఖ గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని సంకల్పించింది. గతంలో పాత రైలు నంబర్ 67232/67231 స్థానంలో 17261/17262 నంబర్ గల రైలును నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. 18న గుంటూరులో, 19న తిరుపతిలో ప్రారంభం కడప మీదుగా గుంటూరు–తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు డైలీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేసినట్లు కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరులో ఈనెల 18వ తేదీ ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురంరోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12.45 గంటలకు చేరుకుంటుంది. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4.25 గంటలకు చేరుతుందన్నారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 7.35 గంటలకు తిరుపతిలో బయలుదేరి కడపకు రాత్రి 9.55 గంటలకు చేరుకుంటుంది. ఇదేమార్గంలో మరుసటిరోజు ఉదయం 8.00 గంటలకు గుంటూరుకు చేరుతుందన్నారు. ఈ రైలులో ఏసీ త్రీ టైర్ ఒకటి, స్లీపర్ 10, జనరల్ బోగీలు 2, బ్రేక్వ్యాన్ రెండింటితో కలిపి మొత్తం 15 కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ కేంద్రంలో రైలు ఆపాలి జమ్మలమడుగు ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమల వెంకన్న దర్శనం కోసం,విద్యార్థులు చదువుకోవటానికి తిరుపతికి వెళుతుంటారు. గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 18న ప్రారంభించబోతున్నారు. జమ్మలమడుగు డివిజన్ కేంద్రంగా..నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌గా ఉంది. రైల్వేశాఖ అధికారులు ఇక్కడ రైలును ఆపితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – పి.నాగేశ్వరరెడ్డి, ఎస్పీ డిగ్రీకాలేజీ కరస్పాడెంట్ -
100 ఏళ్ల క్రితం ఆ గ్రామం కాలగర్భంలోకి.. కానీ నేటికి అక్కడ..
సాక్షి,కోవెలకుంట్ల(కర్నూలు): సరిగ్గా వందేళ్ల క్రితం గ్రామం కాలగర్భంలో కలిసి పోగా ఈ ప్రాంతంలో ఒక ఊరు ఉండేదనటానికి చిహ్నంగా కొన్ని ఆనవాళ్లు నేటికి పదిలంగా ఉన్నాయి. గ్రామానికి గుర్తుగా ఉన్న ఆనవాళ్లు ఆ గ్రామ చరిత్రకు అద్దం పడుతున్నాయి. కోవెలకుంట్ల మండలంలో 100 సంవత్సరాల క్రితం కనుమరుగైన దద్దనాల గ్రామంపై ఆ గ్రామంలో నివాసం ఉన్న వారి వంశస్తులు సమాచారం ఆధారంగా గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు గ్రామ చరిత్రను తెలియజేస్తున్నాయి. కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్లకు అర కి.మీ. దూరంలో 562 సర్వే నంబర్లో 40 సెంట్ల విస్తీర్ణంలో దద్దనాల అనే చిన్న గ్రామం ఉండేది. గ్రామంలో 50 కుటుంబాలు జీవనం సాగించేవారు. గ్రామంలో ఒకే ఒక రెడ్డి కులానికి చెందిన కుటుంబం కాగా మిగిలిన వారిలో బోయ, గాండ్ల కులస్తులు అధికంగా ఉండేవారు. గ్రామానికి ఉన్న 200 ఎకరాల భూముల్లో గ్రామ శివారులో ప్రవహిస్తున్న కుందూనది ఆధారంగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. ఆ కాలంలో పత్తి, రాయచూర్ రకానికి చెందిన జొన్న, వేరుశనగ తదితర పంటలు ప్రధానంగా పండించేవారు. గ్రామస్తులు దసరా, ఉగాది పండుగలను ఘనంగా జరుపుకునేవారని ప్రస్తుతం అక్కడ ఉన్న ఆనవాళ్ల ఆధారంగా తెలుస్తోంది. దొంగల బెడద, కుందూవరదలతో గ్రామం ఖాళీ: దద్దనాల గ్రామానికి దొంగలబెడద అధికంగా ఉండటం, కుందూనదికి సంభవించే వరదల కారణంగా గ్రామం ఖాళీ అయినట్లు పూర్వీకుల చరిత్ర. గ్రామంలో కేవలం 50 కుటుంబాలు ఉండటంతో గ్రామంపై తరుచూ దొంగలు పడేవారు. అప్పట్లో డబ్బులు, ఆభరణాలు పెద్దగా లేకపోయినా దొంగలు కడుపు నింపుకునేందుకు చిన్న గ్రామం కావడంతో అనేకసార్లు దొంగతనాలకు పాల్పడేవారు. రైతులు పండించిన ధాన్యం, బట్టలు, పొట్టేళ్లు, కుక్కలు, తదితర వస్తువులను అపహకరించుకుపోయేవారు. దొంగల బెడద కారణంగా గ్రామస్తులు రాత్రిళ్లు ఇళ్లపై తిరుగుతూ కేకలు వేస్తూ ప్రహారా కాసేవారు. దొంగలబెడదకు తోడు గ్రామ శివారులో ప్రవహిస్తున్న కుందూనది ఉప్పొంగి గ్రామాన్ని, పంట పొలాలను ముంచెత్తుతుండేది. గ్రామం ఖాళీ కావడంతో గ్రామానికి చెందిన పొలాన్ని కలుగొట్ల, ఉప్పలూరు గ్రామ రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. దద్దనాల ఆనవాళ్లుగా నిలిచిన రచ్చబండ, మారెమ్మ దేవాలయం: వందేళ్ల క్రితం దద్దనాల గ్రామం కనుమరుగు కాగా గ్రామ ఆనవాళ్లుగా గ్రామంలో రచ్చబండ, మారెమ్మ దేవాలయం, పునాదిరాళ్లు, గోడలు నిలిచాయి. గ్రామస్తుల దాహార్తి తీర్చే బావి పూడిపోయి అక్కడ బావి ఉండేదన్న గుర్తుగా నిలిచింది. మారెమ్మ దేవాలయానికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. కలుగొట్ల, ఉప్పలూరు గ్రామాల్లో ఇప్పటికీ దద్దనాల గ్రామంలో నివాసం ఉన్న వారి వంశస్తులు నివాసం ఉంటున్నారు. కలుగొట్లలో పాపిరెడ్డి, పెద్దకొండారెడ్డి, చిన్న కొండారెడ్డి, గోపాల్‌రెడ్డి వంశస్తులతోపాటు బోయ కులానికి చెందిన వారి వంశస్తులు, ఉప్పలూరు గ్రామంలో గాండ్ల కులానికి చెందిన చెన్నయ్య వంశస్తులు జీవనం సాగిస్తున్నారు. దద్దనాల గ్రామం ఉన్న ప్రాంతంలో గత ఏడాది కాశీనాయన ఆశ్రమం, శ్రీకృష్ణ దేవాలయం, శివాలయం నిర్మించారు. చదవండి: ఆపరేషన్ ‘డాన్’.. ఇక వారికి చుక్కలే -
ప్రేమ వివాహం.. 36 ఏళ్లుగా కుటుంబం వెలివేత
కోవెలకుంట్ల: ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ వ్యక్తిని కుల పెద్దలు ఆ సామాజిక వర్గం నుంచి వెలివేయడంతోపాటు సినిమాలో పెదరాయుడు తరహాలో ఇచ్చిన తీర్పును మూడు దశాబ్ధాల నుంచి కొనసాగిస్తున్నారు. తమ కుటుంబాన్ని కులంలో చేర్చుకోవాలని బాధితులు గత 36 సంవత్సరాల నుంచి న్యాయపోరాటం చేస్తున్నా ఫలితం దక్కలేదు. బాధితులు అందించిన సమాచారం మేరకు వివరాలు.. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన గడ్డం రాముడు, ఓబుళమ్మ కుమారుడు పెద్దరాముడు 1985వ సంవత్సరంలో రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామంలో మరో కులానికి చెందిన రాధమ్మను ప్రేమించి పెళ్లాడాడు. వేరే కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడంతో కుల పెద్దలు ఆగ్రహించి ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నట్లు పంచాయితీ తీర్పు ఇచ్చారు. కులానికి చెందిన వ్యక్తులు పెద్దరాముడు కుటుంబానికి అన్నం పెట్టినా, మంచినీరు ఇచ్చినా, వారితో మాట్లాడినా, బాగోగులు, శుభకార్యాలకు వెళ్లినా రూ. 5వేలు జరిమాన విధిస్తామని అప్పట్లో కట్టుబాటు విధించారు. 36 ఏళ్లుగా న్యాయ పోరాటం: ఇలాంటి సంఘటన మరే ఇతర ప్రేమ జంటకు జరగకూడదని ఆ ప్రేమ జంట చేస్తున్న పోరాటానికి మూడున్నర దశాబ్ధాల కాలమైనా న్యాయం జరుగలేదు. వేరే కులానికిచెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆ కులపెద్దలు పూసల కులం నుంచి వెలివేయడంతో తిరిగి కులంలో చేర్చుకోవాలని ఆ జంట గత 36 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ తిరగని పోలీస్స్టేషన్లేదు. చిన్న కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎక్కని కోర్టులేదు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. పోలీస్స్టేషన్లు, కోర్టులు, పంచాయితీల రూపంలో రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక పట్టణంలో స్టేట్‌బ్యాంక్ రోడ్డులో రూ. కోటి విలువ చేసే ఇంటిని ఇరవై ఐదు ఏళ్ల క్రితం రూ. 20 లక్షలకే విక్రయించాడు. ఉన్న ఆస్తులన్నీ తెగనమ్మినా న్యాయం జరగకపోవడంతో ఆ కుటుంబం ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతోంది. పూసల వ్యాపారం, రికార్డ్ డ్యాన్సర్‌గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి రాము సంతానం కాగా నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో ఫోటో స్టూడియో నడుపుకుంటూ కులం నుంచి వెలివేయడంతో ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. 12 ఏళ్ల నుంచి పెద్దకర్మలకు దూరం: కులం నుంచి వెలివేయడంతో 12 ఏళ్ల నుంచి పెద్దరాముడు కుటుంబం పెద్ద కర్మలకు దూరంగా ఉంటోంది. 2009 సంవత్సరంలో తండ్రి, తర్వాత ఆరు నెలలకు తల్లి, తర్వాతి ఏడాది సోదరుడు మృతి చెందారు. పూసల కులంలో తొమ్మిది, 11 రోజుల్లో పెద్దకర్మ నిర్వహించాల్సి ఉంది. ఇదే కులానికి చెందిన గూడేగాడు(పూజారి) ఆధ్వర్యంలో పెద్దకర్మలు చేయాలి. కులం నుంచి వెలివేయడంతో గూడేగాడు పెద్దకర్మలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు మృతి చెందిన ఏ ఒక్కరికి పెద్దకర్మ చేయలేదు. పెద్దకర్మలు చేయని కారణంగా ఆ కుటుంబం ఆలయాలకు, ఇతర శుభకార్యాలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పూజలు, తదితర శుభ కార్యాలయాలకు దూరమైంది. 1985వ సంవత్సరానికి ముందూ కోవెలకుంట్ల, వెలగటూరు, అమడాల, బిజనవేముల, ముక్కమల్ల, గుళ్లదూర్తి, తదితర గ్రామాల్లో 100 పూసల కుటుంబాలు ఉండగా ఆ కుటుంబాల సంఖ్య ప్రస్తుతం 350కిపైగా చేరింది. ఈ కుటుంబాలు వృత్తిరీత్యా కోవెలకుంట్ల పట్టణంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో స్థిరపడ్డారు. మూడు జిల్లాల్లో ఉన్న పూసల కులంలో పెద్దరాముడు కుటుంబానికి విధించిన కట్టుబాటు ఇప్పటికి కొనసాగుతుండటం గమనార్హం. తమ కుటుంబాన్ని కులంలో చేర్చుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధిత కుటుంబాన్ని పట్టించుకోని అధికారులు: కులంలో చేర్చుకోవాలని గత 36 ఏళ్లుగా బాధిత కుటుంబం పోరాటం చేస్తోంది. 1998వ సంవత్సరం హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ స్వీకరించిన కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అప్పటి అధికారులు, గ్రామ పెద్దలు పెద్దరాముడిపై తప్పుడు నివేదిక ఇవ్వడంతో కోర్టు కేసు కొట్టివేసింది. తదనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంశాఖ మంత్రులు మాధవరెడ్డి, దేవేంద్రగౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంలో సబితాఇంద్రారెడ్డి, 2018వ సంవత్సరంలో నిమ్మకాయల చిన రాజప్పను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. వీరితోపాటు తమకు న్యాయం చేయాలని పలువురు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లను కలిశారు. మంత్రులు, జిల్లా అధికారులు స్పందించి సంఘటనపై పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించినా రెవెన్యూ, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించకపోవడంతో న్యాయం జరుగలేదు. పంచాయితీల పేరుతో కరిగిపోయిన ఆస్తి: ఎస్సీ మహిళను వివాహం చేసుకున్న కారణంగా కుల పెద్దలు పెద్దరాముడు కుటుంబాన్ని కులం నుంచి వెలివేయడంతోపాటు పంచాయితీల పేరుతో ఉన్న ఆస్తినంతటని కాజేశారు. పూసల కులంలో పంచాయితీ నిర్వహిస్తే ఇరు వర్గాలు చెరో రూ. లక్ష పెద్దల సమక్షంలో జమ చేయాల్సి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని చిన్న సమస్యను పెద్దదిగా సృష్టించి 1991వ సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు ఏడు పర్యాయాలు కోవెలకుంట్ల, తాడిపత్రి, బేతంచెర్ల, అవుకు, ఒంటి వెలగల, ఆళ్లగడ్డ, తదితర ప్రాంతాల్లో పంచాయితీలు నిర్వహించారు. కులంలో కలవాలన్న తాపాత్రయంతో ప్రతి పంచాయితీకి రూ. లక్ష డిపాజిట్ చేయడంతోపాటు తనకు మద్దతుగా ఇతర కుల సంఘాల నాయకులను తీసుకెళ్లడం, రోజుల తరబడి పంచాయితీలు జరగడంతో వాహనాలు సమకూర్చుకోవడం, భోజన, ఇతర ఖర్చులకు ఒక్కో పంచాయితీకి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కొన్ని పంచాయితీలు నెలల తరబడి కొనసాగాయి. ఈ పంచాయితీల్లో ఒక పంచాయితీ ఏకంగా ఏడాదికాలంపాటు జరిగింది. పంచాయితీలకు వెళ్లే సమయంలో చేతితో డబ్బులు లేకపోవడంతో ప్రైవేట్వ్యక్తుల వద్ద లక్షలాది రూపాయాలు అప్పులు చేయాల్సి వచ్చింది. కోవెలకుంట్ల పట్టణంలో పెద్దరాముడు కుటుంబానికి రూ. లక్షలు విలువ చేసే ఇళ్లు ఉండటంతో అప్పుదారులు అడిగినంతా అప్పులు ఇచ్చారు. పంచాయితీల్లో న్యాయం జరుగకపోగా చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఓ ఇంటిని అమ్మి అప్పులు తీర్చినా అప్పులు తీరలేదు. కులంలో కలిసే వరకు పోరాటం: పెద్దరాముడు, బాధితుడు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా 1985వ సంవత్సరంలో నా కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. ఆ ఏడాది నుంచి కులానికి చెందిన వ్యక్తులెవరైనా తమతో మాట్లాడినా, సహకరించినా రూ. 5వేలు జరిమాన విధించేలా కుల పెద్దలు కట్టుబాటు విధించారు. తన కుటుంబాన్ని కులంలో కలుపుకోవాలని గత 36 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. కులంలో కలుపుకోవడంతోపాటు తల్లిదండ్రులు, సోదరుడి పెద్దకర్మలు జరిపే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తాను. పదిరోజుల క్రితం కూడా కలెక్టర్, పోలీసు అధికారులను కలిసి విన్నవించుకున్నా స్థానిక అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి కాలయాపన చేస్తున్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా రేనాటి ఖ్యాతి చాటిన ‘సూర్యచంద్రులు’
కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు మహనీయులు శతాబ్ధం క్రితమే రేనాడు ప్రాంతఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. బ్రిటీష్ నిరంకుశత్వ పాలనపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసి అప్పటి ఇంగ్లాండ్ మహారాణితో సత్కరించబడి దానకర్ణుడిగా పేరొందిన బుడ్డా వెంగళరెడ్డి రేనాటి సూర్యచంద్రులుగా వెలుగొందుతున్నారు. నరసింహారెడ్డి వీరమరణం పొంది 174 సంవత్సరాలు, వెంగళరెడ్డి మరణించి 121 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెల్లదొరల పాలిట సింహస్వప్నమైన నరసింహారెడ్డి: కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్తత మండలాలుగా ప్రకటించి బ్రిటీష్వారికి దారాదత్తం చేశారు. నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. బ్రిటీష్ ప్రభుత్వం నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్‌పాలన నిరంకుశత్వపాలనను ప్రతిఘటించి 1842వ సంవత్సరంలోనే మొట్టమొదటి విప్లవవీరునిగా తిరుగుబాటుకు విప్లవశంఖం పూరించారు. 1846 వ సంవత్సరంలో కోవెలకుంట్ల పట్టణంలోని బ్రిటీష్ ట్రెజరీపై దాడి చేసి 805 రూపాయల 10 అణాల నాలుగుపైసలను కొల్లగొట్టారు. నరసింహారెడ్డి తిరుగుబాటుకు బ్రిటీష్ సామ్రాజ్యం గజగజ వణికిపోయింది. తన పోరాటంలో కోవెలకుంట్ల తహశీల్దార్‌ను నరికిచంపడమేకాక బ్రిటీష్‌వారి ఖజానాను కొల్లగొట్టారు. తెల్లదొరలపాలిట సింహ స్వప్నంగా మారటంతో నరసింహారెడ్డిని పట్టించిన వారికి 10వేల దినారాలు బహుమతి అందజేస్తామని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టకేలకు 1847 సంవత్సరంలో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకుని బందిపోటు దొంగగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22వతేదీ కోవెలకుంట్ల పట్టణ సమీపంలోగల జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలుపరిచారు. అయితే నరసింహారెడ్డి మరణించిన వంద సంవత్సరాలకు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో నరసింహారెడ్డి పేరుపై సైరా నరసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ అన్న జానపద గేయాలు వినిపిస్తుండటం అలనాటి వీరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏటా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆయన వంశస్తులు, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విప్లవ సింహం నరసింహారెడ్డి జీవిత చరిత్రను వెండితెరపైకి ఎక్కించారు. చిరంజీవి కథానాయకుడిగా 2019వ సంవత్సరంలో సైరా నరసింహారెడ్డి పేరుతో చలనచిత్రం విడుదలైంది. రేనాటి చంద్రుడు బుడ్డా వెంగళరెడ్డి: భారతదేశంలోని రేనాటిగడ్డలో పాలెగాళ్లేకాదు దానకర్ణులూ ఉన్నారంటూ ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి మానవత్వాన్ని, దాతృత్వాన్ని ప్రపంచానికి చాటారు. ఉయ్యాలవాడ గ్రామంలో 1822 సంవత్సరం రైతు కుటుంబంలో నల్లపురెడ్డి, వెంకటమ్మ దంపతులకు జన్మించిన బుడ్డా వెంగళరెడ్డి చిన్ననాటి నుంచి దానధర్మాలు చేస్తూ దానకర్ణుడిగా వెలుగొందారు. 1860 సంవత్సరంలో రాయలసీమలో కనీవినీ ఎరగని రీతిలో డొక్కల కరువు సంభవించింది. అప్పట్లో పేదలు ఆకలిమంటలు తట్టుకోలేక సాటిమనసుల డొక్కలు చీల్చి వారి పేగుళ్లలోని ఆహారాన్ని తినేంతటి కరువని చరిత్ర పేర్కొంది. కరువును తట్టుకోలేక ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. బ్రిటీష్ ప్రభుత్వం అక్కడక్కడా గంజికేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. కరువు బీభత్సాన్ని గమనించిన బుడ్డా వెంగళరెడ్డి గంజికేంద్రాలను ప్రారంభించి తన వద్ద ఉన్న ధాన్యంతో మూడు సంవత్సరాలపాటు అన్నదానం చేశారు. కర్నూలు జిల్లా ప్రాంత వాసులకేకాక బళ్లారి, చిత్తూరు, కడప ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చి ప్రతి రోజూ సుమారు 10వేల మందికి పైగా ఉయ్యాలవాడలో ఆయన ఇంటి వద్దనే భోజనం చేసేవారు. బుడ్డా వెంగళరెడ్డి దానగుణం తెలుసుకున్న ఇంగ్లాండ్ విక్టోరియా మహారాణి ఢిల్లీ రాజప్రతినిధుల సభలో ఆయనకు బంగారు పతకాన్ని, ప్రశంసాపత్రాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారు. 1900 సంవత్సరం డిసెంబర్ 31న బుడ్డా వెంగళరెడ్డి మృతిచెందారు. కడప–కర్నూలు కాల్వకు, ఉయ్యాలవాడ – రూపనగుడి గ్రామాల మధ్య కుందూనదిపై నిర్మించిన వంతెనకు ఈయన పేరు పెట్టారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు నంద్యాల ఎస్బీఐ బ్యాంకులో బుడ్డా వెంగళరెడ్డి పేరున ఒక విద్యానిధిని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వర్ధంతి రోజు, ఉగాది పండుగ రోజున బుడ్డా వంశుస్థులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, విక్టోరియా మహారాణి బహుకరించిన బంగారు పతకాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన సమాధిపై ఉంచుతున్నారు. ఇప్పటి కూడా యాచకులు బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో ఉత్తరాధి ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం చూడరయా, ధర్మ ప్రభువు బుడ్డా వెంగళరెడ్డి అంటూ జానపద గీతాలు ఆలపిస్తూనే ఉన్నారు. -
కుక్కల గుంపు.. 100 మీటర్ల దూరం లాక్కెళ్లి..
కోవెలకుంట్ల: మండలంలోని అమడాల గ్రామంలో ఐదేళ్ల బాలుడిపై శుక్రవారం కుక్కల గుంపు దాడి చేసింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన తిమ్మయ్య, నాగజ్యోతి దంపతులకు ప్రదీప్, పౌర్ణమి, ప్రత్యూష సంతానం. ముగ్గురు పిల్లలు ఇంటి పక్కనే ఉన్న కల్లంలో ఆడుకుంటుండగా దాదాపు ఇరవై కుక్కలు ఒక్కసారిగా చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు తప్పించుకోగా ప్రదీప్‌ను వెంబడించాయి. కింద పడటంతో బాలుడిని 100 మీటర్ల మేర లాక్కెళ్లి వీపు భాగంలో విచక్షణా రహితంగా కరిచాయి. మిగతా పిల్లలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తండ్రి తిమ్మయ్య హుటాహుటిన అక్కడకు చేరుకుని కుక్కల బారి నుంచి కుమారుడిని రక్షించాడు. చికిత్స నిమిత్తం వెంటనే కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పందించి ఎంపీడీఓ మహబూబ్‌దౌలా, ఈఓపీఆర్డీ ప్రకాష్‌నాయుడు తదితర అధికారులను ఆసుపత్రికి పంపించి బాలుడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. గ్రామంలో కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చదవండి: హడలెత్తించిన నాగుపాము.. నాగరాజుకు ఫోన్.. ప్రేమ వ్యవహారం: రాయబారానికి పిలిచి హతమార్చారు! -
గుట్కా డాన్‌పై పీడీ యాక్ట్..
సాక్షి, కర్నూలు జిల్లా: గుట్కా డాన్ నూకల మనోహర్‌పై కోవెలకుంట్ల పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అతనిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో మనోహర్‌పై 14 కేసులు నమోదయ్యాయి. బళ్లారి, రాయచూరు, హైదరాబాద్‌ల నుండి గుట్కా కొనుగోలు చేసి కర్నూల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గుట్కా సరఫరా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన నేర ప్రవృత్తి మార్చుకోకుండా గుట్కా సరఫరా చేస్తున్న గుట్కా డాన్‌పై సెస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. మనోహర్‌పై పీడీయాక్ట్ నమోదుకు కలెక్టర్‌కు జిల్లా ఎస్పీ ప్రతిపాదనలు పంపించగా.. కలెక్టర్ వీరపాండ్యన్ ఉత్తర్వులు జారీ చేశారు. -
భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): పదిహేనేళ్ల క్రితం తనతో ఏడడుగులు నడిచి అన్నింటిలోనూ తోడుగా నిలిచిన భార్యపై అతను అనుమానం పెంచుకున్నాడు. ఎంతలా అంటే చివరికి ఆమెను పెట్రోలు పోసి హత్య చేసేంతలా. ఆదివారం కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు హత్యకేసు వివరాలను వెల్లడించారు. దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన కొండన్న కుమారుడు నరసింహులు అనే వ్యక్తికి అదే మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన పరిమళతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా కుమారుడు, కుమార్తె జన్మించారు. మూడేళ్ల క్రితం కుమార్తె క్యాన్సర్‌తో బాధపడుతూ మృత్యువాత పడింది. ఇదిలా ఉండగా భర్త గత కొన్ని రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకోవడంతో అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గత నెల 23న ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నరసింహులు తండ్రి కొండన్న కోడలిని చంపేస్తే పీడ విరగడవుతుందని కుమారుడికి చెప్పడంతో పవర్ స్ప్రెయర్‌ను స్టార్ట్ చేసేందుకు తెచ్చుకున్న పెట్రోల్‌ను భార్యపై చల్లి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న పరిమళను గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చావు బతుకుల్లో ఉన్న పరిమళ వాగ్మూలం మేరకు భర్త, మామపై దొర్నిపాడు పోలీస్‌స్టేషన్ హత్యయత్నం కేసు నమోదైంది. ఇరవై నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి కోలుకోలేక శనివారం మృతి చెందింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు గ్రామ శివారులో హతురాలి భర్త, మామలను అరెస్టు చేసి కోవెలకుంట్ల కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు
సాక్షి, కర్నూలు : అప్పుగా ఇచ్చిన రూ.100 తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు. ఈ ఘటన బుధవారం కోవెలకుంట్ల మండలం జోళదరాశి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన కథనం మేరకు.. గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన వడ్డే వెంకటసుబ్బయ్య ఒకరికొకరు అప్పు ఇచ్చి పుచ్చుకునేవారు. అందులోభాగంగా వెంకటసుబ్బయ్య వద్ద వెంకటేశ్వర్లు రూ.100 అప్పు తీసుకున్నాడు. తిరిగివ్వమని వెంకటేశ్వర్లును పదేపదే కోరుతున్నా ఇప్పుడిస్తా, అప్పుడిస్తానంటూ కాలయాపన చేసేవాడు. బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటసుబ్బయ్యకు వెంకటేశ్వర్లు ఎదురుపడ్డాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించవా అంటూ వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పంచె ఊడిపోవడంతో అదనుగా భావించిన వెంకటసుబ్బయ్య మర్మాంగాన్ని కొరికేశాడు. స్థానికులు విడిపించి, తీవ్ర రక్తస్రావమైన వెంకటేశ్వర్లును హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. బాధితుడి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సాక్షి రిపోర్టర్‌పై హత్యాయత్నం
-
‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం
కోవెలకుంట్ల : కర్నూలు జిల్లా సంజామల మండల ‘సాక్షి’ విలేకరి వెంకటేశ్వర్లుపై గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో హత్యాయత్నం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాశాడన్న కారణంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గని దస్తగిరిరెడ్డి, గని రమణారెడ్డికి విలేకరి వెంకటేశ్వర్లుకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సంజామల శివారులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి బంధువుల వివాహం ఉండటంతో వెంకటేశ్వర్లు అక్కడకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తమ అనుచరులైన నాగిశెట్టి, హజరత్, శ్రీనివాసులును విలేకరిపై దాడికి ఉసిగొల్పారు. వారు కత్తి, రాళ్లతో ఆయనపై దాడి చేశారు. రెండుసార్లు కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా కత్తిపోట్ల నుంచి వెంకటేశ్వర్లు తప్పించుకున్నారు. ఆ వెంటనే బండరాయితో తలపై బలంగా కొట్టడంతో విలేకరి కింద పడ్డాడు. పక్కన ఉన్న రాళ్లతో మళ్లీ దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. అలాగే విలేకరి వెంట ఉన్న గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ మహేష్‌పైనా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ ప్రదేశంలో గొడవ జరుగుతున్నట్టు భావించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న నెపంతోనే విలేకరిని హత్య చేయించేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
మనవరాలిపై అత్యాచారం ..!
సాక్షి, కోవెలకుంట్ల: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి వరుసకు మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మండలంలోని రేవనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఎం.ఉప్పలూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ రమేష్‌కుమార్ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎం.ఉప్పలూరు గ్రామానికి చెందిన జింకల పుల్లయ్య (60).. మానసిక స్థితి సరిగా లేని మనవరాలి వరుసయ్యే బాలిక (16)తో కలిసి ఆరు నెలల క్రితం గొర్రెలు మేపుకునేందుకు పొలానికి వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి మతిస్థిమితం లేకపోవడంతో అప్పట్లో ఈ విషయం బయటకు పొక్కలేదు. రెండు రోజుల క్రితం ఆ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లగా..ఆరు నెలల గర్భవతిగా డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో యువతి బంధువులు పుల్లయ్యను నిలదీయడంతో అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పుల్లయ్యను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తలిలించారు. -
కప్పలవాగులో కొట్టుకుపోయిన కారు
సాక్షి, కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు సమీపంలో ప్రవహిస్తున్న కప్పలవాగులో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ఐదుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. చిత్తూరు జిల్లా వేంపల్లెకు చెందిన మధుసూదన్, మహేష్, మనోజ్‌కుమార్, మనోహర్, సోమశేఖర్ కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు సోమవారం కారులో బయలుదేరారు. అర్ధరాత్రి కావడంతో గూగుల్ మ్యాప్ ద్వారా దొర్నిపాడు మండలం గుండుపాపల నుంచి లింగాల మీదుగా ప్రయాణం సాగించారు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుందూ నదికి నీటిని విడుదల చేయడంతో ఇరవై రోజుల నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కప్పలవాగు సమీపానికి చేరుకున్నాక అర్ధరాత్రి కావడంతో కారు లైటింగ్‌లో వాగు ఉధృతిని అంచనా వేయలేకపోయారు. కారును వేగంగా వాగులోకి దించడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ముందు కూర్చున్న వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో వెనుక కూర్చున్న ముగ్గురు అప్రమత్తమై డోర్ తెరుచుకుని వాగులోకి దూకారు. తర్వాత అందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. బుధవారం గ్రామస్తులు వాగు వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు లాగారు. -
అన్నను చంపేసి...ఇంట్లోనే పూడ్చేశాడు
కర్నూలు : జోళదరాశి గ్రామంలో ఓ వ్యక్తి తమ్ముడి చేతిలో హతమైన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాసరెడ్డి సమాచారం మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎద్దుల ఇసాక్, యోహాన్, కంబగిరి రాముడు అన్నదమ్ములు. యోహాన్‌కు భారతి, రాజు(22), వసంత సంతానం. కంబగిరిరాముడుకు దేవేంద్రకుమార్, శ్రావణ్‌కుమార్ సంతానం. పిల్లలు చిన్న వయస్సులో ఉండగానే యోహాన్, ఆయన భార్య దానమ్మ మృతి చెందటంతో కంబగిరిరాముడు తన పిల్లలతోపాటు అన్న పిల్లల పోషణ బాధ్యతను తీసుకున్నాడు. ఆరవ తరగతి వరకు చదువుకున్న రాజు, శ్రావణ్‌కుమార్ పేదరికం నేపథ్యంలో చదువుకు స్వస్తి చెప్పి గౌండా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజు పాణ్యం మండలం కౌలూరులో ఉంటున్న అక్క, బావల వద్దకు వెళ్లి అక్కడే పనిచేసుకునేవాడు. ఏడాది క్రితం కంబగిరి రాముడు అక్కడికి వెళ్లి రాజును ఇంటికి పిలుచుకొచ్చాడు. అప్పటి నుంచి రాజు స్వగ్రామంలోనే ఉంటూ గౌండా పనికి వెళుతున్నాడు. మద్యానికి బానిసైన శ్రావణ్‌కుమార్ అన్నతో తరుచూ గొడవ పడేవాడు. ఇటీవల రాజు కొత్త బైక్ కొన్నాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి బైక్ విషయంలో అన్నతో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణలో పక్కన ఉన్న కట్టెతో అన్న తలపై బలంగా కొట్టడంతో రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లో పూడ్చి పరారీ రాజు మృతి విషయం బయటకు పొక్కకుండా శ్రావణ్‌కుమార్ ఇంట్లోనే బండ పరుపు తొలగించి గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చి ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఆదివారం ఉదయం అన్నను చంపిన విషయాన్ని నంద్యాలలో ఉంటున్న తల్లి ఇంద్రావతికి నిందితుడు ఫోన్ ద్వారా తెలియజేశాడు. భయాందోళనకు గురైన ఆమె వెంటనే విషయాన్ని శివవరంలో ఉన్న బంధువులకు తెలిపింది. వారు జోళదరాశిలోని హతుడి బంధువులకు సమాచారం చేరవేయడంతో తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ఇసుక కుప్ప కన్పించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆళ్లగడ్డ డీఎస్పీ చక్రవర్తి, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు హత్య జరిగిన విషయం పోలీసులకు తెలిసిపోవడంతో నిందితుడు నేరుగా కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారి తీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. -
మీ సాయం జన్మలో మరచిపోలేమన్నా..
కర్నూలు: పుట్టుకతోనే మూగ, చెవుడు అయిన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వెల్తుర్ల చినఓబులేసు, రాణమ్మ దంపతుల కుమారుడు సందీప్‌కు రూ.7 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉచితంగా చేయించారు. తమ బిడ్డకు వినికిడి శక్తి వచ్చిందంటూ ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఆదివారం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
వడ్డీలేని రుణం.. అందనంత దూరం!
కోవెలకుంట్ల : అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలన్నీ భేషరుతుగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి గద్దెనెక్కిన సర్కార్ అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. పొదుపు సంఘాల మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించి పట్టించుకోకపోవడంతో సంఘాలపై వడ్డీభారం పడి కుదేలవుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 4,770 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో పది నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకు లింకేజి,ఎస్ఎస్జీ, స్త్రీనిధి, గ్రామైక్య సంఘం నుంచి రుణాలు తీసుకొని, ఆ రుణాలతో చీరెల వ్యాపారం, కిరాణ, కొవ్వొత్తుల తయారీ, పాడిపరిశ్రమ, తదితర యూనిట్లు స్థాపించి జీవనంసాగిస్తున్నారు. పొదుపు సంఘాలకు అరకొరగా వర్తింపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వడ్డీతో సహా సక్రమంగా చెల్లించే గ్రూపులకు ప్రభుత్వం వడ్డీలేని రుణం వర్తింప చేయాల్సి ఉండగా అరకొరగా వర్తింపజేస్తుండడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు . ఐదవ విడత జన్మభూమిని పురస్కరించుకొని ప్రభుత్వం వడ్డీలేని రుణాలను మంజూరు చేయగా నియోజకవర్గంలో కొన్ని సంఘాలకు మాత్రమేవర్తించడంతో మిగతా గ్రూపులు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016 జూన్ వరకు రుణాలు సక్రమంగా చెల్లించిన గ్రూపులకు ఈ రుణం విడుదల అయినట్లు చెబుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించినా కొన్నిగ్రూపుల్లోని సభ్యుల ఖాతాల్లో జమ కాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. సకాలంలో వడ్డీతో సహా రుణాలు చెల్లించినా నాలుగు మండలాల్లో 1,884 గ్రూపులకుమాత్రమే వడ్డీలేని రుణాలు వర్తించగా మిగిలిన గ్రూపులకు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణం వర్తిస్తుందని పొదుపు మహిళలు అప్పులు చేసి నెలనెలా వడ్డీతో సహా రుణాలు చెల్లించినా రుణం వర్తించకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పొదుపు గ్రూపులన్నింటికీ వడ్డీలేని రుణంవర్తింపజేయాలని సభ్యులు కోరుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించలేదు పొదుపు గ్రూపు ద్వారా రూ. 7 లక్షల రుణం తీసుకొని బర్రెలు కొనుగోలు చేసి పాడి పరిశ్రమ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం పసుపు, కుంకుమ పథకం కింద రూ. 6వేలు అందజేసింది. వడ్డీలేని రుణం ఇప్పటి వరకు వర్తించలేదు. వడ్డీలకు వడ్డీలు చెల్లించడం కష్టమవుతోంది. – లక్ష్మిదేవి, చందన గ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల ఇప్పటికైనా రుణం అందించాలి పొదుపు గ్రూపులకు వడ్డీలేని రుణం వర్తింపజేసి సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలి. మా గ్రూపు ద్వారా రూ. 5 లక్షలు రుణం తీసుకొని పశుపోషణతో జీవనంసాగిస్తున్నాం. అన్ని గ్రూపులకు వడ్డీలేని రుణం అందించి ఆదుకోవాలి. – వెంకటలక్ష్మి, రామలక్ష్మిగ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల జమ అవుతోంది పొదుపు గ్రూపు సభ్యుల ఖాతాల్లో వడ్డీలేని రుణం జమ అవుతోంది. 2017 మార్చి నెలాఖరు వరకు గ్రూపులకు వడ్డీలేని రుణం మంజూరైంది. విడతలవారీగా అన్ని గ్రూపులకు వర్తిస్తుంది. – బాబు, ఏపీఎం, కోవెలకుంట్ల -
పోలీసుల అదుపులో దొంగ
కోవెలకుంట్ల: పట్టణంలోని అమ్మవారిశాల సమీపంలో గత శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కేసుకు సంబంధించి పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రూ. 15 లక్షల నగదు, 3 కిలోల 400 గ్రాముల బంగారు ఆభరణాలు.. అపహరించుకెళ్లినట్లు బాధితుడు పెండేకంటి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చోరీకి పాల్పడ్డ దొంగను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడ్డ దొంగ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దొంగ నుంచి బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీ కేసు వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
కోవెలకుంట్లలో భారీ చోరీ
– 6 కిలోల బంగారు ఆభరణాలు అపహరణ కోవెలకుంట్ల(బనగానపల్లె): కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణం అమ్మవారిశాల సమీపంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దొంగలు.. స్థానిక బంగారు వ్యాపారి పెండేకంటి ఆంజనేయులు ఇంటి గేటు దూకి తలుపు తాళాలు పగలగొట్టారు. ఇంట్లో బీరువా తలుపులు తెరిచి.. అందులో ఉన్న రూ. 1.80 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదును అపహరించు కెళ్లారు. నగదుతోపాటు సుమారు 6 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
సూర్య @45
జిల్లాలో ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం జిల్లాలోని కోవెలకుంట్లలో అత్యధికంగా 45.08 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ వేసవిలో గరిష్టంగా నమోదయిన ఉష్ణోగ్రత ఇదే. చాగలమర్రిలో 44.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రతకు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. గ్రామీణ ప్రజలు దాహర్తితో అల్లాడుతున్నారు. 10 రోజులకోసారి కూడా నీళ్లు సరఫరా కాని గ్రామాలు వందల్లో ఉన్నాయి. పశువుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. జిల్లాలో 750 నీటి తొట్లు ఉన్నా.. వీటిల్లోనూ చుక్కనీరు ఉండకపోవడం గమనార్హం. - కర్నూలు(అగ్రికల్చర్) -
కోవెలకుంట్లలో విషజ్వరాలు
- ఇద్దరు విద్యార్థులకు డెంగీ లక్షణాలు - ఆరుగురికి మలేరియా - నలుగురికి పసిరికలు కోవెలకుంట్ల: పట్టణ ప్రజలు విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా రంగరాజుపేటలోని 1, 2 వార్డులు జ్వర బాధితుల సంఖ్య అధికంగా ఉంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న మహ్మద్ రఫీ, నౌషార్ కుమారులు షాబీద్, మసూద్ అనే విద్యార్థులకు డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రులలో చూపించినా నయం కాకపోవడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. ఇదే వార్డుల్లోని సానియా, అస్లాం, షాజిదా, రహీమాన్, మస్తాన్, మహ్మద్ మలేరియా జ్వరంతో బాధపడుతూ పట్టణంలోని ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. అత్తార్ అస్లాం, మగ్బుల్‌తోపాటు మరో ఇద్దరు పసిరికలతో బాధపడుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. కాలనీలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత వైద్యాధికారులు పరిశీలించి జ్వరాల నియంత్రణకు చరయలు తీసుకోవాలని కోరతున్నారు. -
కొనసాగుతున్న సినిమా షూటింగ్
కోవెలకుంట్ల మండలంలోని జోళదరాశి గ్రామంలో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. శుక్రవారం హీరో మంజునాథ్, హీరోయిన్ తనీష్తివారీలపై ప్రేమకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. గ్రామీణ వాతావరణం కోసం ఈ పల్లెను ఎంపిక చేసుకున్నట్లు డైరెక్టర్ కేఎస్ పాల్ పేర్కొన్నారు. – కోవెలకుంట్ల -
మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం
ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్తున్న ఆ బాలుడిపై విధి పగబట్టింది. తలకు క్రికెట్ బాలు తగలడంతో మెదడులో గడ్డకట్టి ఆరుచోట్ల ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. మూడేళ్లుగా మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్నాడు. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబ సభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. * మూడేళ్లుగా మంచానికే పరిమితమైన బాలుడు * పైప్‌ద్వారా ఆహారంగా ద్రవ పదార్థాలు * ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు కర్నూలు : కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గడేకారి మహబూబ్‌బాషా, షేక్ ఉసేన్‌బీ దంపతులకు మౌలాలి, దస్తగిరి సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గడేకారి, కూలీపనికి వెళుతూ పిల్లలను చదివించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న దస్తగిరి స్నేహితులతో సరదాగా క్రికెట్ ఆడుతున్న సమయంలో 2013వ సంవత్సరంలో తలకు క్రికెట్ బాల్ తగిలింది. మొదట్లో దాని ప్రభావం కన్పించకపోగా కొంతకాలానికి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు, నంద్యాల ఆసుపత్రులకు తీసుకెళ్లగా ఎక్స్‌రేలో మెదడులో గడ్డ ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు, దాతల సాయం, దొరికిన చోటంతా రూ. 2 లక్షల వరకు అప్పు చేసి హైదరాబాదులోని నిమ్స్‌లో గడ్డను తొలగించేందుకు తల, మెడ, గొంతు, తదితర చోట్ల ఆరు ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్ అనంతరం దస్తగిరి యథావిధిగా కోలుకుంటారని భావించారు. ఎక్కువ చోట్ల ఆపరేషన్లు జరగడంతో అప్పటి నుంచి మంచానికి పరిమితం అయ్యాడు. ఆహారపదార్ధాలను ద్రవరూపంలో ముక్కుకు అమర్చిన పైప్‌ద్వారా అందజేయాల్సి వస్తోంది. ఆడుతూ, పాడుతూ జీవనం సాగిస్తున్న కుమారుడికి ఈ పరిస్థితి రావడంతో తండ్రి షాక్‌కు గురై.. మానసిక స్థితి సరిగా లేక ఇల్లు వదిలి వెళ్లాడు. కుమారుడి ఆలనాపాలన తల్లి చూస్తోంది. ఆమె ఇంటికే పరిమితం కావడంతో పోషణభారం పెద్దకుమారుడైన మౌలాలిపై పడింది. గడేకారి పనిచేస్తూ కుటుంబ పోషణ.. తమ్ముడు అనారోగ్యంతో మంచాన పడే సమయానికి పదో తరగతి పూర్తి చేసుకున్న మౌలాలి చ దువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఇల్లు లేక వీరు.. వనం ఆంజనేయస్వామి ఆలయంలో తలదాచుకుంటూ ఉండడంతో గ్రామానికి చెందిన ఉసేనయ్య ఆదుకున్నాడు. ప్రస్తుతం హుసేనయ్య ఇంట్లో వీరు ఉంటున్నారు. మౌలాలి.. గడేకారి పనికి వెళుతూ వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ, తమ్ముడి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాడు. మాత్రలు, మందుల కోసం నెలకు రూ. 5వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. దాతల సాయం కోసం ఎదురుచూపు మూడేళ్లుగా మంచానికే పరిమితమైన దస్తగిరికి మెరుగైన వైద్యం అందితే యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. అంతటి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. నెలకు కావాల్సిన మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని.. దాతలు ఆపన్న హస్తం అందించి కుమారుడికి పునర్జన్మను ప్రసాదించాలని తల్లి, కుమారుడు వేడుకుంటున్నారు. దాతలు సాయం చేసేందుకు 8186815860 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. -
గుళ్లదూర్తి గుండెల్లో హానెమన్
కోవెలకుంట్ల: ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వ్యక్తిని ఇక్కడి ప్రజలు గుర్తించారు. ఆయన ప్రపంచానికి చేసిన సేవలను స్మరిస్తూ నలుదిశలా చాటి చెప్పేందుకు కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి గ్రామం వేదికైంది. హోమియోపతి సృష్టికర్త శామ్యూల్ ఫ్రెడరిక్ క్రిస్టియన్ హానెమన్కు గుళ్లదూర్తివాసులు అరుదైన గౌరవం కల్పించారు. గ్రామంలో ఆయన స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయడం మన దేశానికే గర్వకారణం. హానెమన్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రోగుల హృదయాల్లో దేవుడు.. 1755వ సంవత్సరం ఏప్రిల్ 10న జర్మని దేశంలో జన్మించిన హానెమన్ బాల్యం నుంచి చాలా సృజనాత్మంగా ఉండేవారు. ఇరవై ఏళ్ల వయస్సులో లీప్జిగ్ పట్టణంలోని వైద్య కళాశాలలో చేరారు. డాక్టర్ పట్టా పుచ్చుకున్న తర్వాత పదేళ్లపాటు వైద్య సేవలందించారు. అయితే తాను చేస్తున్న వైద్య విధానం సరైంది కాదని కలత చెందారు. దీంతో వైద్యవృత్తిని విడిచి వ్యవసాయం, రసాయన మందుల తయారీ గురించి అధ్యయనం చేసి వాటిలో కొత్త విషయాలను అవగాహన చేసుకున్నారు. 1796వ సంవత్సరంలో ఏ పదార్థమైతే ఆరోగ్యవంతులలో అనారోగ్యాన్ని కలిగిస్తుందో అదే పదార్థం ద్విగుణికరణ స్థితిలో ఆ రోగాన్ని నయం చేస్తుందని భావించాడు. ఇదే హోమియోపతి శాస్త్ర ప్రధాన సూత్రమని ప్రకటించారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ వైద్య విధానాన్ని ఖండించినా, దానిపై దుష్ర్పచారం చేసినా చలించ క హానెమన్ ముందుకు సాగారు. ఎన్నెన్నో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కనిపెట్టి రోగుల హృదయాల్లో దేవుడిలా నిలిచారు. ప్రపంచంలో 80పైగా దేశాల్లో సుమారు 30 కోట్ల మంది ప్రజలు హోమియో వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారంటే అది హానెమన్ కృషినే. -
రోడ్డునపడ్డ విద్యార్థులు
కోవెలకుంట్ల: విద్యా శాఖ అధికారులకు ముందుచూపు లేకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సోమవారం 60 మంది విద్యార్థులు రోడ్డునపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలోని గాంధీనగర్ ప్రాంతానికి 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో మొదట ఏడేళ్లు కొట్టంలో నిర్వహించారు. అనంతరం రామిరెడ్డి అనే వ్యక్తి తాత్కాలిక ప్రాతిపదికన అద్దె లేకుండా ఉచితంగా భవనాన్ని ఇవ్వడంతో ఆరు సంవత్సరాలుగా అందులో నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులున్న ఈ పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాల కోసం కేటాయించిన 10 సెంట్ల స్థలం ఆక్రమణకు గురికావడంతో సొంత భవనం నిర్మాణాన్ని ప్రారంభించలేదు. చివరికి 2012లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని, ఆక్ర మణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో రెండు గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 9 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఏడాదిన్నర కిందట గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా ఒక గది నిర్మాణం మాత్రమే పూర్తయింది. తన భవనాన్ని ఖాళీ చేయాలని ఏడాది కిందట భవన యజమాని రామిరెడ్డి విద్యాశాఖ అధికారులను కోరారు. గదుల నిర్మాణం పూర్తి కావపోవడంతో ఈ ఏడాది కూడా అందులోనే తరగతులను నిర్వహిస్తున్నారు. పదేపదే చెప్పినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం రామిరెడ్డి వచ్చి, భవనాన్ని ఖాళీ చేయాలని పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులను బయటికి పంపి, ఖాళీ చేశారు. తరగతులను ఎక్కడ నిర్వహించాలో తెలియక ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయలు సందిగ్ధంలో పడ్డారు. చివరికి పూర్తి అయిన ఒక గదిలోనే ఐదు తరగతులకు చెందిన 60 మంది విద్యార్థులను కూర్చొబెట్టారు. కాగా.. ఇప్పటిదాకా కాంట్రాక్టర్‌కు రూ.6.50 లక్షలు చెల్లించామని, నిర్మాణం పూర్తయిన తర్వాత మిగతా డబ్బు చెల్లిస్తామని సర్వశిక్ష అభయాన్ ఈఈ భాస్కర్ తెలిపారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించామన్నారు. -
గాలి వాన బీభత్సం