
సాక్షి, కర్నూలు జిల్లా: గుట్కా డాన్ నూకల మనోహర్‌పై కోవెలకుంట్ల పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అతనిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో మనోహర్‌పై 14 కేసులు నమోదయ్యాయి. బళ్లారి, రాయచూరు, హైదరాబాద్‌ల నుండి గుట్కా కొనుగోలు చేసి కర్నూల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గుట్కా సరఫరా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన నేర ప్రవృత్తి మార్చుకోకుండా గుట్కా సరఫరా చేస్తున్న గుట్కా డాన్‌పై సెస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. మనోహర్‌పై పీడీయాక్ట్ నమోదుకు కలెక్టర్‌కు జిల్లా ఎస్పీ ప్రతిపాదనలు పంపించగా.. కలెక్టర్ వీరపాండ్యన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment