
ప్రతీకాత్మచిత్రం
సాక్షి, హైదరాబాద్(చైతన్యపురి): సెలూన్ పేరుతో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న వ్యక్తిపై సరూర్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బండ్లగూడ నూరినగర్‌కు చెందిన షేక్ అయాజ్ (24), దిల్‌సుఖ్‌నగర్‌లో స్పా అండ్ సెలూన్ నిర్వహించే బలరాం కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
లలితానగర్‌లోని సిగ్నేచర్ స్టూడియో హెయిర్ అండ్ స్కిన్ మేకప్ అకాడమీకి అందమైన యువతులను తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అక్టోబర్ 7న స్పాసెంటర్‌పై దాడి చేశారు. షేక్ అయాజ్, బలరాంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు నిందితుడు షేక్ అయాజ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి బుధవారం చర్లపల్లి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
చదవండి: (వివాహేతర సంబంధం తెలిసి భర్త మందలించాడు.. ప్రియుడితో కలిసి..)
Comments
Please login to add a commentAdd a comment