కోవెలకుంట్లలో భారీ చోరీ
– 6 కిలోల బంగారు ఆభరణాలు అపహరణ
కోవెలకుంట్ల(బనగానపల్లె): కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణం అమ్మవారిశాల సమీపంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దొంగలు.. స్థానిక బంగారు వ్యాపారి పెండేకంటి ఆంజనేయులు ఇంటి గేటు దూకి తలుపు తాళాలు పగలగొట్టారు. ఇంట్లో బీరువా తలుపులు తెరిచి.. అందులో ఉన్న రూ. 1.80 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదును అపహరించు కెళ్లారు. నగదుతోపాటు సుమారు 6 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.