jewelry shop
-
హైదరాబాద్ : పంజాగుట్టలోని నగల దుకాణంలో మెరిసిన మోడల్స్ (ఫోటోలు)
-
జైలులో కుదిరిన స్నేహం.. బయటకు వచ్చాక ఇలా చేశారు.. అలా పట్టుబట్టారు..
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ఆ ముగ్గురూ పలు చోరీ కేసుల్లో నిందితులు. జైలులో శిక్ష అనుభవించిన సమయంలో వారి మధ్య స్నేహం కుదిరింది. చోరీల ద్వారా కాజేసిన బంగారు నగలు, వెండి వస్తువులతో ఎప్పటికైనా కర్ణాటక రాష్ట్రంలో ఓ జ్యూయలరీ షాపు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 25 చోరీల్లో దోచుకున్న సొత్తుతో కారులో కర్ణాటకకు బయలుదేరారు. చదవండి: పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య ఈ క్రమంలో రామచంద్రపురం డివిజన్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.కోటి సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. అమలాపురంలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ కేఎఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, మండపేట సీఐ పి.శివగణేష్ ఈ దొంగల ముఠా చోరీల చిట్టాను వివరించారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును విలేకర్లకు చూపించారు. వీరు దోచుకున్న బంగారు నగలు, వెండి వస్తువులు, బంగారం కరిగించే పరికరాలు జ్యూయలరీ షాపును తలపించింది. ఇదీ చోరీల నేపథ్యం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరం గ్రామానికి చెందిన తోటకూర రామకృష్ణంరాజు, నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన సద్దుల కుమార్‌రాజాలు 2016లో పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి పోలీసు స్టేషన్ పరిధిలో పలు చోరీ కేసులలో పోలీసులకు పట్టుబడ్డారు. పది నెలల జైలు శిక్ష అనుభవించి, బయటకు వచ్చాక వారికి నర్సాపురంలో బంగారం కరిగించే వ్యక్తి.. కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన విజయ్ తవారు పవార్‌తో పరిచయం ఏర్పడింది. దొంగ సొత్తును కొనుగోలు చేసే రిసీవర్‌గా పవార్‌తో వారి అనుబంధం పెరిగింది. 2018లో ఈ ముగ్గురూ రాజోలు పోలీసు స్టేషన్లో పరిధిలో పలు చోరీల్లో అరెస్టయ్యారు. ఆ సందర్భంగా వారికి జైలుశిక్ష పడింది. దీంతో వారి స్నేహం మరింత బలపడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ముగ్గురూ కలిసి చోరీలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రామచంద్రపురం, అమలాపురం పోలీసు డివిజన్ల పరిధిలో 25 చోరీలు చేసి రూ.కోటి విలువైన సొత్తు కూడగట్టారు. ఇలా పట్టుబడ్డారు చోరీల్లో దోచుకున్న 1,360 గ్రాముల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు, రూ.40 వేలు నగదు, బంగారం కరిగించే పరికరాలు, కట్టర్లు, రాడ్లు తదితర సామగ్రితో ఓ కారులో సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రానికి ఆ ముగ్గురూ బయలుదేరారు. అక్కడ జ్యూయలరీ షాపు పెట్టాలన్నది వారి లక్ష్యం. వారి కారు అంగర పోలీసు స్టేషన్ పరిధిలోని టేకి గ్రామ శివారుకు వచ్చేసరికి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వీరి కారుపై అనుమానం వచ్చి ఆరా తీశారు. మండపేట సీఐ శివగణేష్, అంగర, ఆలమూరు ఎస్సైలు బి.సంపత్‌కుమార్, ఎన్.శివప్రాద్లు ఆ కారు నంబరును ఆన్లైన్లో తనిఖీ చేసి, తప్పుడు నంబరుగా గుర్తించారు. దీంతో కారును, కారులోని సొత్తును, ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని లోతుగా విచారించడంతో వారు ఐదేళ్ల నుంచి చేస్తున్న చోరీల చిట్టా వెలుగు చూసింది. ఈ ముఠా ఆలమూరు పోలీసు స్టేషన్ పరిధిలో 6, మండపేట రూరల్‌లో 2, అంగర పరిధిలో 3, రాయవరం పరిధిలో 1, మండపేట పట్టణ పరిధిలో 1, ద్రాక్షారామ పరిధిలో 1, పామర్రు పరిధిలో 2, రామచంద్రపురం పరిధిలో 1, అల్లవరం పరిధిలో 2, పి.గన్నవరం పరిధిలో 4, కడియం పరిధిలో 1, భీమవరం పరిధిలో 1 చొప్పున చోరీలు చేసినట్టు గుర్తించారు. వారిని సోమవారం అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. -
కొత్త బిజినెస్ మొదలెట్టిన కాజల్
చెన్నై : ఇప్పుడు సినీ నటీమణుల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీరు ఇప్పుడు ఒక వృత్తినే నమ్ముకోవడం లేదు. సినిమాలు, ప్రచార చిత్రాలు అంటూ చేతి నిండా సంపాదిస్తున్నారు. తమన్నా, త్రిష, కాజల్‌అగర్వాల్ ఇలా అగ్రహీరోయిన్లుగా రాణిస్తున్న వారంతా తమ క్రేజ్‌ను ఇతర రంగాల్లోనూ వాడుకుంటున్నారు. వీరిలో కొందరు సంపాదనను స్థిరాస్తులుగా మార్చుకుంటుంటే మరికొందరు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. నటి కాజల్‌అగర్వాల్ ఇదే పని చేస్తోంది. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ సంపాదిస్తోంది. తాజాగా నిర్మాతగానూ అవతారమెత్తిన ఈ బ్యూటీ బంగారం వ్యాపారంలోనూ పెట్టుబడులను పెడుతోంది. ముంబాయిలో సొంతంగా నగల దుకాణాన్ని ప్రారంభించింది. సినిమాల్లో సంపాదించిన డబ్బును ఆ నగల వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతోంది. కొందరు నటీమణులు హోటళ్ల లాంటి వ్యాపారాలతో లాభ నష్టాలను చవిచూస్తుంటే నటి కాజల్ మాత్రం తెలివిగా ఆదాయమే తప్ప నష్టం అనే మాటకు తావులేని లాభదాయకమైన బంగారం నగల వ్యాపారాన్ని ఎంచుకోవడం విశేషం. ఇక నటిగా ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో ఒక చిత్రం అంటూ బిజీగా నటిస్తున్న కాజల్ అగర్వాల్‌కు లోటు అన్నదేమైనా ఉంటే అది పెళ్లినే. కాజల్‌కు సరైన వరుడు సెట్ కావడం లేదు. ఈ అమ్మడికి 36 ఏళ్ల వయసు పైబడుతోంది. దీంతో ఎలాగైనా ఈ ఏడాదిలో కాజల్ అగర్వాల్ పెళ్లి చేయాలనే కృతనిశ్చయంతో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. అయితే నటిగా బిజీగా ఉన్న కాజల్‌అగర్వాల్ వారి నిర్ణయాన్ని ఎంత వరకు స్వాగతిస్తుందన్నది చూడాలి. కాజల్‌అగర్వాల్ చెల్లెలు నిషాఅగర్వాల్కు ఇప్పటికే పెళ్లి అయ్యి ఒక బిడ్డ కూడా ఉందన్నది గమనార్హం. -
జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం
కీసర: హైదరాబాద్ నగర శివారులో పట్టపగలే దొంగలు బరితెగించారు. జ్యువెలరీ షాప్‌లో చోరీ యత్నం విఫలం కావడంతో కాల్పులకు తెగబడ్డారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలోని ఆర్.ఎస్.రాథోర్ షాపులో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం జ్యువెలరీ షాపుకు సమీపంలో ఆరుగురు దుండగులు మూడు బైక్‌లపై వచ్చి ఆగారు. ఇద్దరు వ్యక్తులు రెండు తుపాకులు జేబుల్లో పెట్టుకొని షాపులోకి వెళ్లారు. మిగతా నలుగురు షాప్‌నకు ఇరువైపులా నిల్చుండి పరిసరాలను గమనిస్తున్నారు. లోనికి వెళ్లిన దుండుగులు రూ.15 వేల విలువ చేసే బంగారు గొలుసు కావాలంటూ హిందీలో మాట్లాడు తూ షాపింగ్ చేస్తున్నట్టు నటించారు. వారి మాటలు తడబడటాన్ని యజమాని రూప్సింగ్ గమనించాడు. వచ్చింది దొంగలేనన్న అనుమానంతో రూప్సింగ్ ఎదురుతిరిగి అరిచేందుకు ప్రయత్నించాడు. వెంటనే దుండగులు తలపై గన్ పెట్టేందుకు యత్నించగా రూప్సింగ్ ఆ దుండగుడితో కలబడి తుపాకీ లాక్కున్నాడు. పక్కనున్న దుకాణం యజమానురాలు తులసీదేవి అదే సమయంలో జ్యువెలరీ షాప్‌లోకి వస్తోం ది. బయట కాపాలా ఉన్న దుండగులు ఆమె రాక విషయాన్ని లోపలున్న దొంగలకు చేరవేశారు. వెంటనే తుపాకీతో కాల్పులు జరిపి జనాలను భయభ్రాంతులకు గురిచేసి బైక్‌లపై పారిపోయారు. ఈ క్రమంలో దుకాణానికి 200 మీటర్ల దూరంలో వారి బైక్ అదుపు తప్పటంతో ఇద్దరు దుండగులు కిందపడ్డారు. వెంటనే తేరుకుని అటుగా వెళుతున్న శ్రీకాంత్ అనే యువకుడి బైక్‌ను లాక్కున్నారు. అతడిపై పిడిగుద్దులు కురిపించి బైక్‌పై పరారయ్యారు. యజమాని సమయస్ఫూర్తితో.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్రావు, ఏసీపీ శివకుమార్‌లు ఘటనాస్థలికి చేరుకొని చోరీకి యత్నించిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ శాస్త్రీయ ఆధారాలు సేకరించారు. మాటల తీరును బట్టి ఆ దొంగలు ఉత్తర భారతీయ ముఠాకు చెందినవారేనని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. వారు వదిలి వెళ్లిన గన్ 3.2ను, పల్సర్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసున్నారు. యజమాని సమయస్ఫూర్తి వల్ల ప్రాణనష్టంతోపాటు భారీ చోరీ తృటిలో తప్పిందని కమిషనర్ అన్నారు. దుండగుల ఆచూకీ తెలిపినవారికి రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తామని, 949061 7111 నంబర్‌కు సమాచారం అందించాలని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. -
కంగారం.. కంగారం
ఓ బంగారం వ్యాపారిఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఓ నల్లరంగు బ్యాగుఓ పోలీసాయన పెళ్లిరోజుఓ చికుబుక్ చికుబుక్ రైలు కోపంతో మండిపడిన ఎస్పీభయంతో బిగుసుకుపోయిన ఎస్సైమధ్యలో చాయ్వాలాఅంతా కంగారం.. కంగారం.. మార్చి, 2013 అది ఖమ్మం జిల్లా రైల్వేపోలీస్ స్టేషన్. సబ్ఇన్స్పెక్టర్ రవిరాజ్ గోడ గడియారం కేసి పదేపదే చూస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఉగాది పండగ. పైగా తన పెళ్లిరోజు. రెండు పండుగలు కలిసి వచ్చాయి. కనీసం ఈసారైనా పెళ్లిరోజు తన భార్యతో కలిసి జరుపుకోవాలని ఏడాది నుంచి ప్లాన్ చేస్తున్నాడు. ముందురోజు రాత్రంతా నైట్ డ్యూటీ చేసాడు. ఉదయం అయింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళదామని సిద్ధమవుతున్నాడు రవిరాజ్..అపుడే బాయ్ ఛాయ్ తెచ్చి ఇచ్చాడు. చాయ్ వాసన తగలగానే రవిరాజ్కి నిద్రమత్తు దిగినట్లయింది. పొగలు కక్కుతున్న టీని ఒక్క గుటక మింగాడో లేదో అంతే.. ఓ నడివయస్కుడు.. ‘సార్ ..!’ అంటూ వచ్చాడు. అతని కాళ్లు, చేతులు వణుకుతున్నాయ్! ఖద్దరు దుస్తులు, ఒంటిమీద బంగారు ఆభరణాలు, చేతిలో ఐఫోన్... చూస్తుంటే బాగా డబ్బున్న వ్యక్తిలాగే ఉన్నాడు.ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ, ఏదీ చెప్పలేకపోతున్నాడు. కానిస్టేబుల్ 302 వైపు చూశాడు రవి.. వెంటనే గ్లాసుతో మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు 302.ఆ పెద్దమనిషి నీళ్లు తాగి కాస్త స్థిమిత పడ్డట్టు అనిపించగానే ‘ఇపుడు చెప్పండి ఏం జరిగింది?’ అన్నాడు.‘నా బ్యాగులో ఉన్న 3 కిలోల బంగారం పోయింది సార్!’ అన్నాడు ఆ వ్యక్తి. కుర్చీలో వాలుగా కూర్చున్న రవిరాజ్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. అది విన్న మిగిలిన పోలీసులు, ఛాయ్‌వాలా అంతా అతనివైపు తిరిగారు.‘‘మీ దగ్గర అంత బంగారం ఎందుకుంది? అసలు మీరెవరు?’’ అడిగాడు అనుమానంగా!‘సార్.. నా పేరు నట్వర్లాల్.. మాకు ఖమ్మంలో ఓ జ్యువెల్లరీ షాపు ఉంది. మేం తరచు గుంటూరు నుంచి బంగారం తీసుకొస్తాం. మాకిది అలవాటే.. ఎపుడూ లేనిది ఇప్పుడే ఇలా జరిగింది. బ్యాగు బ్యాగులాగే ఉంది. కానీ అందులో బంగారం లేదు’ అంటూ బ్యాగ్ కేసి చూపించాడు.తలపట్టుకున్నాడు రవిరాజ్. ఈసారి కూడా పెళ్లిరోజుకు ఇంటికి వెళ్లలేనని తెలిసిపోయింది.‘సరే! మీరు రైలెక్కిన దగ్గర నుంచి ఏం జరిగిందో వివరంగా చెప్పగలరా?’ అడిగాడు.‘నాతోపాటు విజయవాడలో ఓ కాలేజీ కుర్రాడు రైలెక్కినట్లు గుర్తుంది సార్..’ సమాధానమిచ్చాడతను. అతను చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు రవిరాజ్. అతను చెప్పిందంతా ఉన్నతాధికారులకు ఇన్ఫామ్ చేద్దామని మనసులో అనుకుంటుండగానే...సెల్ మోగింది. పేరు చూడగానే అటెన్షన్లోకొచ్చి ‘సార్! గుడ్‌మార్నింగ్ సార్’’ అన్నాడు వినయంగా. ‘ఆ వ్యక్తి వీవీఐపీ.. కేసును ఫాలో అప్ చేయమని పైనుంచి స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి.. నేనూ వస్తున్నాను.. మరో పది నిమిషాల్లో ఖమ్మం బయల్దేరుతాను. నేను జీపు దిగేలోపు దొంగ దొరకాలి’. ఆర్డర్ వేశాడు ఎస్పీ.ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు రవి. గుంటూరు నుంచి అన్ని రైల్వేస్టేషన్ల సీసీ కెమెరాల ఫుటేజీలనూ తెప్పించుకుని నిశితంగా పరిశీలించాడు. ఎవరూ అనుమానంగా కనిపించలేదు. బాధితుడు చెబుతున్న దాన్ని బట్టి.. మూడుకిలోల బంగారం తీసుకొచ్చే వ్యక్తి ఏమరుపాటుగా ఉండడు. కానీ బ్యాగులోని బంగారం ఎలా మాయమైంది? అన్న ప్రశ్న రవి బుర్రను తొలిచేస్తోంది. రవి బుర్రలో ఓ ఫ్లాష్ బాధితుడిని పిలిచాడు రవిరాజ్.. ‘‘మీరు బ్యాగులో బంగారంతోపాటు ఏమేం తెచ్చారు?’’ అనడిగాడు. ‘‘బంగారం బిస్కెట్లు, వాటి బిల్లులు, ఇంకా కొన్ని గాజులు తెచ్చాను సార్’’ ‘‘ఓసారి మీ బ్యాగు చూపిస్తారా?’’ అన్నాడు. ‘‘చూడండి’’ అన్నట్లుగా బ్యాగును అందించాడు. అందులో బిల్లులు ఏమీ లేవు. బదులుగా ఏవో కాంపిటీటివ్ పుస్తకాలు ఉన్నాయి.అది చూసేసరికి– ఇది దొంగతనం కాకపోవచ్చు.బహుశా బ్యాగు మారి ఉంటుంది... అని అనుమానం వచ్చింది ఎస్.ఐకి. ఆ పుస్తకాలపై పేరూ ఊరూ ఏమీ లేదు. కొత్తగా ఉన్నాయి. ఆ బ్యాగు ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిది అని అర్థం అవుతోంది కానీ ఆ విద్యార్థి ఎవరు? సాలోచనగా ఆ పుస్తకాలను తిరగేస్తుండగా అందులో నుంచి ఏదో కాగితం ముక్క జారి పడింది. రెండు నెలల క్రితం జరిగిన ఓ ఇంజినీరింగ్ ఫెస్ట్‌కు సంబంధించిన వాలంటీర్ ఐడీ కార్డు అది. దానిపై ‘324’ అనే నెంబరు ఉంది. అంతకుమించి ఎలాంటి వివరాలూ లేవు. ఆ కాగితం ముక్కే ఇపుడు కీలకం! విజయవాడలోని ఇంజినీరింగ్ కాలేజీలన్నీ కలిసి జనవరిలో ఆ ఫెస్ట్ నిర్వహించినట్లు గుర్తు. దాని నిర్వాహకులకు ఫోన్ చేశాడు ఎస్సై. కేసు తీవ్రత గురించి వివరించి రిక్వెస్ట్ చేయడంతో ఆ వివరాలన్నీ మెయిల్ చేశారు వాళ్లు. మెయిల్ ప్రింటవుట్ తీసుకున్న రవిరాజ్‌కు ఆ విద్యార్థి ఇంజినీరింగ్ చేసే 21 ఏళ్ల అబ్బాయి అని, అదీ ఖమ్మం వాడేనని తెలిసింది. వెంటనే బాధితుడితోబాటు కానిస్టేబుల్‌ను కూడా తీసుకుని జీపులో బయల్దేరాడు రవి రాజ్. టౌన్‌లోని ఓ బస్టాప్ వద్ద జీపు ఆగింది. అక్కడే ఉండే పాన్‌షాప్ ఓనర్ కమ్ పోలీస్ ఇన్ఫార్మర్ని పిలిపించారు. అతను వచ్చి ‘ఏంటిసార్ విషయం..’ అని అడిగాడు. ‘గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. దొంగ ఇక్కడే ఉన్నాడు. నువ్వు సాయం చేస్తే దొంగ దొరికినట్లే’ అంటూ చెప్పాడు రవిరాజ్. భోజనాలు అయ్యాక పుస్తకాలు తీద్దామనుకున్న అర్జున్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. తన బ్యాగులో బంగారం బిస్కెట్లు.. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వెంటనే ‘నాన్నా!’ అంటూ కేకలేశాడు. పరుగున వచ్చిన రామారావు కొడుకు చేతిలో బంగారం బిస్కెట్లు చూసి అవాక్కయ్యాడు. ‘ఏరా..! చదువుకోమని కాలేజీకి పంపిస్తే.. నువ్వు చేసే నిర్వాకం ఇదా?’ కొడుకేదో చేయకూడని పని చేసుంటాడనే అనుమానంతో అరిచాడు. ‘లేదు నాన్నా! అసలిది నా బ్యాగే కాదు. కావాలంటే చూడు. నేను విజయవాడలో కొన్న పుస్తకాలకు బదులుగా ఇందులో బంగారం ఉంది..’ అంటూ జరిగిన విషయం చెప్పాడు. రామారావు భార్య పద్మ వెంటనే ‘పోలీసులకు చెబుదామండీ...’’ అంది. ‘‘మనం నిజం చెప్పినా పోలీసులు నమ్ముతారా? వీడిని దొంగ అనుకుని లోపలేస్తారు.. ’’ మనసులోని భయాన్ని వెళ్లగక్కాడు రామారావు. తండ్రి మాటలు అర్జున్ను మరింత భయపెట్టాయి. ఇంతలోనే బయట తలుపుకొట్టిన చప్పుడు అవడంతో ఎవరై ఉంటారా అన్న అనుమానంతో అంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ధైర్యం చేసిన రామారావు నెమ్మదిగా తలుపు తీశాడు. వచ్చిన వ్యక్తి వైపు అనుమానంగా చూసి ‘ఎవర్నువ్వు? ఏం కావాలి?’ అడిగాడు. ‘సార్, నేను వీధి చివరన ఉండే పాన్‌షాప్ ఓనర్ని సార్. గుర్తుపట్టలేదా?’ అంటూనే చనువుగాలోపలికి వచ్చాడు.. ‘సార్! ఈ విషయం పోలీసులకు తెలిసిపోయింది’ అన్నాడు.‘పోలీసులు’ అన్న మాట వినగానే.. రామారావు గుండెలు జారిపోయాయి.వెంటనే అతని చేతులు పట్టుకున్నాడు.‘అయ్యో.. పెద్దవారు మీరు కావాలని చేయలేదు. జరిగిందంతా ఎస్ఐ గారికి తెలుసు.. కాకపోతే మీతో ఆయన మాట్లాడుతాడట’ అన్నాడు. ‘సరే పిలవండి’ అన్నాడుతడి ఆరిన గొంతుతో రామారావు.షాప్ ఓనర్ సిగ్నల్ ఇవ్వగానే పోలీసులు ఇంట్లోకి దూసుకొచ్చారు.అతని బేల ముఖం చూస్తూనే ఎస్.ఐ ‘జరిగింది పొరబాటే.. దొంగతనం కాదని మాకర్థమైంది. మీ అబ్బాయిని పిలవండి ఓసారి’ అన్నాడు.లోపలి నుంచి ఆ మాటలు వింటున్న అర్జున్ బ్యాగు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గదిలో నుంచి బయటికి వచ్చి తలదించుకుని నిలబడ్డాడు. ‘‘మీది మంచికుటుంబం కాబట్టిపోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నారు. ఇంకెవరైనా అయి ఉంటే.. దీన్ని ఎలా మాయం చేద్దామా అని ఆలోచించేవారు’’ అంటూనే ఎస్.ఐ బ్యాగు తీసుకుని బయటి వచ్చేశాడు.జీపులో కూర్చున్న బంగారం వ్యాపారి ప్రాణాలు లేచి వచ్చాయి. పరుగున వచ్చి ఎస్.ఐకి కృతజ్ఞతలు తెలిపాడు. ఈలోపు దారిలో ఉన్న ఎస్పీకి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రవిరాజ్. తీరా తన పర్సనల్ఫోన్ చూస్తే ఇంటి నుంచి 170 మిస్డ్ కాల్స్. ఎస్పీ వచ్చేసరికి సాయంకాలమైంది. కెమెరా ఫ్లాష్‌లతో ప్రెస్‌మీట్ ప్రాంగణమంతా మెరిసిపోతోంది. నిద్రలేకుండా పీక్కుకుపోయిన ముఖంతో ఉన్న రవిరాజ్ ఓపికగా నిలుచున్నాడు. అపుడు ఎస్పీ అసలేం జరిగిందో చెప్పాడు. అది విని ఇంతేనా అంటూ నిట్టూర్చారు మీడియా జర్నలిస్టులు. కానీ, కేసును గంటల వ్యవధిలోనే ఓ చిన్న క్లూతో ఛేదించిన పోలీసుల తెలివితేటలను అంతా అభినందించారు.అసలేం జరిగిందంటే..బంగారంతో రైలెక్కిన వ్యాపారి విజయవాడ వరకు నిద్రపోలేదు. కిటికీ పక్కనే కూర్చుని ఫోన్ మాట్లాడాడు. విజయవాడ దాటిన తరువాత చల్లగాలికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అపుడే విజయవాడలో రైలెక్కాడు ఖమ్మంకు చెందిన ఓ ఇంజినీరింగ్ కుర్రాడు. ఆ అబ్బాయి కూడా నిద్రపోయాడు. కానీ, ఖమ్మం రాగానే నిద్రమత్తుతో బ్యాగు భుజానకేసుకుని దిగి ఇంటికెళ్లాడు. రైలు కదిలే సమయానికి నిద్రలేచిన బంగారం వ్యాపారి బ్యాగు బరువులో తేడా ఉండటంతో తెరిచి చూసి గుండెలు బాదుకున్నాడు. అదీ జరిగింది. ఇద్దరివీ ఒకే కంపెనీ, ఒకే రంగు బ్యాగులు కావడంతో పొరబాటున ఆ ఇంజినీరింగ్ విద్యార్థి తనదనకుని వ్యాపారి బ్యాగు తీసుకెళ్లాడు. అదన్నమాట సంగతి. కానీ, అందులో దొరికిన ఫెస్ట్ వాలంటీర్ కార్డు కేసు చిక్కుముడి విప్పేందుకు కీలకమైన క్లూగా నిలిచింది.అక్కడే వ్యాపారి పోలీసులందరికీ రివార్డు ప్రకటించాడు. ఎస్పీ తిరిగి హైదరాబాద్ వెళ్లేదాకా అక్కడే వెయిట్ చేశాడు రవిరాజ్. తీరా ఇంటికెళ్లేసరికి రాత్రి 12 అయింది. భయం..భయంగా ఇంటి మెట్లెక్కుతూ వణుకుతున్న చేతులతో కాలింగ్ బెల్ నొక్కాడు. – అనిల్‌కుమార్ భాషబోయిన -
రూ.50 లక్షలతో సెక్యూరిటీ పరారీ
తిరువొత్తియూరు : చెన్నై టీ.నగర్ ప్రముఖ నగల దుకాణం నుంచి రూ.50 లక్షలతో పరారైన సెక్యూరిటీ కోసం ప్రత్యేక పోలీసుల బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లింది. చెన్నై వేళచ్చేరిలో ప్రముఖ నగల దుకాణం ఉంది. ఈ దుకాణానికి చెన్నై, ఇతర రాష్ట్రాల్లో పలు శాఖలున్నాయి. చెన్నై వేళచ్చేరి నగల దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణన్ బెంగళూరులో ఉన్న ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి రూ.50 లక్షలు తీసుకుని చెన్నై టి.నగర్లో ఉన్న నగల దుకాణం వద్దకు బుధవారం రాత్రి వచ్చారు. అక్కడ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సెక్యూరిటీ అయోధ్యనాథ్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. అతను కాపలాదారుడిగా బెంగళూరులో ఉన్న ప్రధాన కార్యాలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసి ఐదు నెలలకు ముందు చెన్నై టీ.నగర్‌కు బదిలీ అయ్యాడు. ఇంతకు మునుపటి నుంచే పరిచయం ఉండడంతో రూ.50 లక్షల నగదును రాధాకృష్ణన్ సెక్యూరిటీకి ఇచ్చాడు. తరువాత టీ.నగర్ శాఖ మేనేజర్ దినకరన్‌కు ఫోన్‌చేసి రూ.50 లక్షల నగదు సెక్యూరిటీకి ఇచ్చినట్టు తెలిపాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన మేనేజర్ దుకాణం వద్దకు వచ్చి చూడగా అక్కడ సెక్యూరిటీ పరారయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి అతన్ని అరెస్ట్ చేయడానికి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. -
కోవెలకుంట్లలో భారీ చోరీ
– 6 కిలోల బంగారు ఆభరణాలు అపహరణ కోవెలకుంట్ల(బనగానపల్లె): కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణం అమ్మవారిశాల సమీపంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దొంగలు.. స్థానిక బంగారు వ్యాపారి పెండేకంటి ఆంజనేయులు ఇంటి గేటు దూకి తలుపు తాళాలు పగలగొట్టారు. ఇంట్లో బీరువా తలుపులు తెరిచి.. అందులో ఉన్న రూ. 1.80 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదును అపహరించు కెళ్లారు. నగదుతోపాటు సుమారు 6 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.